ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

అవిశ్వాసంపై ఒకే మాటపై ఉందాం..

ABN, First Publish Date - 2023-02-15T01:10:50+05:30

హుజూరాబాద్‌ మున్సిపాలిటీ చైర్‌పర్సన్‌ గందె రాధికపై పెట్టిన అవిశ్వాస తీర్మానంపై అందరూ ఒకే మాటాపై ఉందామని కౌన్సిలర్లు హైదరాబాద్‌ సమీపంలోని శామీర్‌పేట కట్ట మైసమ్మ ఆలయంలో మంగళవారం ప్రమాణం చేశారు.

హైద్రాబాద్‌లోని కట్ట మైసమ్మ వద్ద ఒకే తాటిపై ఉందని ప్రమాణం చేస్తున్న కౌన్సిలర్లు
అన్నపూర్ణ మ్యారేజెస్... వరల్డ్ వైడ్‌గా తెలుగువారు ఎక్కడున్నా అన్ని కులముల వారికీ పెళ్లి సంబంధాలు కుదర్చడంలో టాప్ పొజిషన్. ఉన్నతమైన కుటుంబాల ఎంపిక. సం|| 9397 9797 50

హుజూరాబాద్‌, ఫిబ్రవరి 14: హుజూరాబాద్‌ మున్సిపాలిటీ చైర్‌పర్సన్‌ గందె రాధికపై పెట్టిన అవిశ్వాస తీర్మానంపై అందరూ ఒకే మాటాపై ఉందామని కౌన్సిలర్లు హైదరాబాద్‌ సమీపంలోని శామీర్‌పేట కట్ట మైసమ్మ ఆలయంలో మంగళవారం ప్రమాణం చేశారు. ప్రభుత్వ విప్‌గా నియమితులైన ఎమ్మెల్సీ పాడి కౌశిక్‌రెడ్డిని కలిసేందుకు కౌన్సిలర్లందరూ హైద్రాబాద్‌కు వెళ్లారు. మొదట శామీర్‌పేట కట్ట మైసమ్మ ఆలయానికి చేరుకున్న కౌన్సిలర్లు చైర్‌పర్సన్‌పై అవిశ్వాసం పూర్తయ్యే వరకు కలిసికట్టుగా ఉండాలని తీర్మానించుకున్నారు. అనంతరం ప్రత్యేక పూజలు నిర్వహించి, ప్రభుత్వ విప్‌, ఎమ్మెల్సీ పాడి కౌశిక్‌రెడ్డిని కలిశారు.

21వరకు అవిశ్వాసంపై హైకోర్టు స్టే...

హుజూరాబాద్‌ మున్సిపల్‌ చైర్‌పర్సన్‌ గందె రాధికపై 25మంది కౌన్సిలర్లు అవిశ్వాసం తీర్మానం పెడుతూ ఈ నెల 2 కలెక్టర్‌కు నోటీస్‌లు అందజేశారు. ఈ అవిశ్వాసంపై చైర్‌పర్సన్‌ గందె రాధిక ఈ నెల 5న హైకోర్టులో కేసు వేయగా, 7న స్టే విధిస్తూ, ఈ నెల 21 వరకు ప్రభుత్వం కౌంటర్‌ దాఖలు చేయాలని కోర్టు ఆదేశించింది. దీంతో కౌన్సిలర్లు, చైర్‌పర్సన్‌ల మధ్య విభేదాలు ఎక్కువైనట్లు తెలిసింది. ఎవరికి వారే ఎమ్మెల్సీ కౌశిక్‌రెడ్డి, ప్రణాళిక సంఘం ఉపాధ్యక్షుడు వినోద్‌కుమార్‌ వద్దకు వెళ్లి సమస్యను వివరించారు. గందె రాధిక తప్ప తమలో ఎవరిని చైర్‌పర్సన్‌ చేసినా అభ్యంతరం లేదని కౌన్సిలర్లు వారికి తెలిపారు. దీంతో వినోద్‌కుమారర్‌ అసెంబ్లీ పూర్తయ్యే వరకు ఆగాలని సూచించినట్లు సమాచారం.

చైర్‌పర్సన్‌ రేసులో ముగ్గురు...

హుజూరాబాద్‌ మున్సిపల్‌ చైర్‌పర్సన్‌ పదవి కోసం ఎవరికి వారే ముమ్మరంగా ప్రయత్నాలు చేస్తున్నారు. చైర్‌పర్సన్‌ రేసులో ప్రతాప మంజల, కొలిపాక నిర్మల, దండ శోభ ఉన్నట్లు తెలిసింది.

Updated Date - 2023-02-15T01:12:44+05:30 IST

సంబంధం కోసం వెతుకుతున్నారా? తెలుగు మాట్రిమోని లో - రిజిస్ట్రేషన్ ఉచితం!
Advertising
Advertising