ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

ప్రజాస్వామ్య మూలాలు తెలియని మంత్రి కేటీఆర్‌

ABN, First Publish Date - 2023-03-04T00:53:47+05:30

ప్రజాస్వామ్య మూలాలు తెలియని మంత్రి కేటీఆర్‌ గవర్నర్‌ వ్యవస్థను ప్రశ్నిస్తు న్నారని వరంగల్‌ మాజీ ఎంపీ సిరిసిల్ల రాజయ్య అన్నారు. శుక్రవారం జిల్లా కేంద్రంలోని కాంగ్రెస్‌ కార్యాల యంలో విలేకరుల సమావేశంలో మాట్లాడారు.

సమావేశంలో మాట్లాడుతున్న కాంగ్రెస్‌ నాయకులు
అన్నపూర్ణ మ్యారేజెస్... వరల్డ్ వైడ్‌గా తెలుగువారు ఎక్కడున్నా అన్ని కులముల వారికీ పెళ్లి సంబంధాలు కుదర్చడంలో టాప్ పొజిషన్. ప్రవేశం ఉచితం. సం|| 9393 763 666

సిరిసిల్ల టౌన్‌, మార్చి 3: ప్రజాస్వామ్య మూలాలు తెలియని మంత్రి కేటీఆర్‌ గవర్నర్‌ వ్యవస్థను ప్రశ్నిస్తు న్నారని వరంగల్‌ మాజీ ఎంపీ సిరిసిల్ల రాజయ్య అన్నారు. శుక్రవారం జిల్లా కేంద్రంలోని కాంగ్రెస్‌ కార్యాల యంలో విలేకరుల సమావేశంలో మాట్లాడారు. దేశంలో ప్రజాస్వామ్యం ఖూని అవుతోందని, రాజ్యాంగాన్ని రద్దు చేసే కుట్ర జరుగుతోందని అన్నారు. ప్రజాస్వామ్యం, రాజ్యాంగాన్ని పరిరక్షించుకోవాల్సిన బాధ్యత ప్రజలం దరిపైనా ఉందన్నారు. ప్రజాస్వామ్య పరిరక్షణ కోసం ఏఐసీసీ మాజీ అధ్యక్షుడు రాహుల్‌గాంధీ కన్యకుమారి నుంచి కాశ్మీర్‌ వరకు భారత్‌ జోడో యాత్ర చేపట్టారని, దానికి అనుకూలంగా తెలంగాణలో టీపీసీసీ అధ్యక్షుడు రేవంత్‌రెడ్డి హాత్‌ సే హాత్‌ జోడో పాదయాత్ర నిర్వహిస్తు న్నారని అన్నారు. ప్రజాస్వామ్యాన్ని బీజేపీ ఖూనీ చేస్తోందని ఆరోపించారు. ఎన్నికల కమిషన్‌ ప్రీ అండ్‌ ఫేర్‌ ఎన్నికలు నిర్వహించాల్సి ఉండగా ప్రస్తుతం నిద్రా వస్థలో ఉందన్నారు. ఈడీ, సీబీఐ, ఐటీ శాఖల అధికా రులతో బీజేపీ ప్రభుత్వం భయబ్రాంతులకు గురి చేస్తోం దని, లొంగ దీసుకునే ప్రయత్నాలు చేస్తోందని మండి పడ్డారు. రాష్ట్ర ప్రభుత్వాలను బీజేపీ ప్రభుత్వం చీల్చు తోందని, పార్లమెంట్‌లో ప్రతిపక్షాలను మాట్లాడ నివ్వ డంలేదని అన్నారు. ప్రజాస్వామ్య మూలాలు, అంతం తెలయని మంత్రి కేటీఆర్‌ గవర్నర్‌ వ్యవస్థను ప్రశ్నిస్తు న్నారని ఎక్కడైనా ప్రభుత్వం రాజ్యాంగాన్ని మీరి ప్రవర్తిస్తే గవర్నర్‌కు అక్కడ రాష్ట్రపతి పాలనను విధించే అధికారం ఉందన్నారు.గవర్నర్‌ వ్యవస్థపై వ్యాఖ్యలకు మంత్రి కేటీఆర్‌ జాతికి క్షమాపణ చెప్పాలని, ఒక్కరోజు కూడా మంత్రి పదవిలో కొనసాగే హక్కు లేదని అన్నారు. రేవంత్‌రెడ్డి పాదయాత్ర, స్ట్రీట్‌ కార్నర్‌ సభను విజయ వంతం చేయాలని పిలుపునిచ్చారు. పాదయాత్ర రాజన్న సిరిసిల్ల జిల్లా ఇన్‌చార్జి సుభాష్‌రెడ్డి మాట్లాడుతూ కమీ షన్ల కోసం కేసీఆర్‌ ప్రాజెక్టులు తీసుకొచ్చారని ఆరోపిం చారు. సిరిసిల్ల నియోజవర్గం ఇన్‌చార్జి కేకే మహేందర్‌ రెడ్డి మాట్లాడుతూ ఈ ప్రాంతానికి ప్రాతినిధ్యం వహిస్తున్న మంత్రి కేటీఆర్‌ ఇచ్చిన హామీలను ఎంతవరకు నిలబెట్టుకున్నారన్నారు. కాంగ్రెస్‌ వరంగల్‌ ఎంపీగా పోటీ చేసిన సాంబయ్య, పార్టీ జిల్లా మాజీ అధ్యక్షుడు, టీపీసీసీ సభ్యుడు నాగుల సత్యనారాయణ, పట్టణ కాంగ్రెస్‌ అధ్యక్షుడు సంగీతం శ్రీనివాస్‌, ప్రధాన కార్యదర్శి వెంగళ అశోక్‌, బ్లాక్‌ కాంగ్రెస్‌ అధ్యక్షుడు సూర దేవరాజు, మహిళా జిల్లా అధ్యక్షురాలు కాముని వనిత, మాజీ అధ్యక్షురాలు మడుపు శ్రీదేవి, ఎస్సీ సెల్‌ జిల్లా అధ్యక్షుడు ఆకునూరి బాలరాజు, పట్టణ అధ్యక్షుడు నక్క నర్సయ్య, జిల్లా నాయకుడు ప్రకాష్‌, తాటికొండ శ్రీనివాస్‌, సంగం శ్రీనివాస్‌, కాసర్ల రాజు, యువజన కాంగ్రెస్‌ జిల్లా అధ్యక్షుడు సంగీతం శ్రీనాథ్‌, నాయకులు పాల్గొన్నారు.

వేములవాడ: పీసీసీ అధ్యక్షుడు రేవంత్‌రెడ్డి తలపెట్టిన సభను విజయవంతం చేయాలని వరంగల్‌ మాజీ ఎంపీ సిరిసిల్ల రాజయ్య కోరారు. శుక్రవారం వేములవాడలో విలేకరులతో మాట్లాడుతూ ప్రజల సమస్యలు తెలుసుకోవడంతోపాటు కాంగ్రెస్‌ పార్టీని బలోపేతం చేసేందుకు పీసీసీ అధ్యక్షుడు రేవంత్‌రెడ్డి హాత్‌ సే హాత్‌ జోడో యాత్రను చేపట్టారన్నారు.జిల్లా కాంగ్రెస్‌ అధ్యక్షుడు ఆది శ్రీనివాస్‌, నాయకులు సాగరం వెంకటస్వామి, చిలుక రమేశ్‌, పాత సత్యలక్ష్మి తదితరులు పాల్గొన్నారు.

చందుర్తి: హాత్‌ సే హాత్‌ జోడో అభియాన్‌ పాదయా త్రను విజయవంతం చేయాలని కాంగ్రెస్‌ మండల అధ్యక్షుడు చింతపంటి రామస్వామి అన్నారు. స్థానిక పార్టీ కార్యాలయంలో జడ్పీటీసీ నాగం కుమార్‌తో కలిసి శుక్రవారం విలేకరులతో మాట్లాడారు. నియోజకవర్గ యూత్‌ కాంగ్రెస్‌ అధ్యక్షుడు ధర్మపురి శ్రీనివాస్‌, నాయ కులు తదితరులు పాల్గొన్నారు.

కోనరావుపేట: రేవంత్‌రెడ్డి పాదయాత్రను విజయ వంతం చేయాలని కాంగ్రెస్‌ మండల అధ్యక్షుడు ఫిరోజ్‌ పాషా కోరారు. మండల కేంద్రంలోని పార్టీ కార్యాల యంలో కార్యకర్తల సమావేశం నిర్వహించి మాట్లాడారు. నాయకులు గోపాల్‌, గొట్టె రుక్మిణి, సత్యం పాల్గొన్నారు.

ముస్తాబాద్‌ : హాత్‌ సే హాత్‌ జోడో యాత్రలో మండల ప్రజలు భాగస్వాములు కావాలని కాంగ్రెస్‌ మండల అధ్యక్షుడు యెల్ల బాల్‌రెడ్డి పిలుపునిచ్చారు. ఏఐసీసీ పిలుపు మేరకు రాష్ట్రంలో టీపీసీసీ అధ్యక్షుడు రేవంత్‌రెడ్డి జోడో యాత్ర చేప ట్టారన్నారు.

Updated Date - 2023-03-04T00:53:47+05:30 IST

సంబంధం కోసం వెతుకుతున్నారా? తెలుగు మాట్రిమోని లో - రిజిస్ట్రేషన్ ఉచితం!