ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

వెబ్ స్టోరీస్+ -

కమ్మనైన వివాహాలు కుదర్చడంలో40 సంవత్సరాల సుదీర్ఘ అనుభవం ఉన్న కాకతీయ మ్యారేజెస్‌లో ఇప్పుడు ప్రీమియం మెంబర్‌షిప్‌ ఉచితం ఫోన్|| 9390 999 999, 7674 86 8080

స్మార్ట్‌ సిటీలో పార్కింగ్‌ పాట్లు

ABN, Publish Date - Dec 18 , 2023 | 11:46 PM

కరీంనగర్‌లోని వాణిజ్య సముదాయ ప్రాంతమైన టవర్‌సర్కిల్‌, రాజీవ్‌చౌక్‌, కూరగాయల మార్కెట్‌, ప్రకాశం గంజ్‌ ప్రాంతాల్లో అడ్డదిడ్డంగా వాహనాలు పార్కింగ్‌ చేయడంతో జనం ఇబ్బందులు పడుతున్నారు.

కరీంనగర్‌ క్రైం, డిసెంబరు 18: కరీంనగర్‌లోని వాణిజ్య సముదాయ ప్రాంతమైన టవర్‌సర్కిల్‌, రాజీవ్‌చౌక్‌, కూరగాయల మార్కెట్‌, ప్రకాశం గంజ్‌ ప్రాంతాల్లో అడ్డదిడ్డంగా వాహనాలు పార్కింగ్‌ చేయడంతో జనం ఇబ్బందులు పడుతున్నారు. ఈ పాంతంలోనే పెద్ద పెద్ద మాల్స్‌, కిరాణం హోల్‌సేల్‌ దుకాణాలు, భవననిర్మాణం సంబంధ దుకాణాలు ఉన్నాయి. ఈ ప్రాంతానికి ఉమ్మడి జిల్లాకు చెందిన ప్రజలు నిత్యం వేలాది మంది వస్తూ కొనుగోళ్లు చేపడుతారు. ఉదయం నుంచి అర్ధరాత్రి వరకు రద్దీగా ఉండే ఈ ప్రాంతంలో ట్రాఫిక్‌ నియంత్రణ చర్యలు లేక పోవటంతో వాహనాలను అడ్డదిడ్డంగా పార్క్‌ చేస్తున్నారు. టవర్‌ సర్కిల్‌ ఏరియాలోని ప్రొఫెసర్‌ జయశంకర్‌ విగ్రహం నుంచి పొట్టిశ్రీరాములు విగ్రహం వరకు రోడ్డుపైన, కూడళ్ల చుట్టూ కార్లు అడ్డదిడ్డంగా పార్క్‌ చేస్తుండటంతో ఆ మార్గంలో వాహనదారులు, పాదచారులు ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు. స్మార్ట్‌ సిటీ పేరుతో నూతనంగా రోడ్డు నిర్మించినప్పటికీ ఫుట్‌పాత్‌లను చిరువ్యాపారులు, ఇతర దుకాణాదారులు వారి సామగ్రితో నింపేసి ఆక్రమించటంతో పార్కింగ్‌కు స్థలం లేకుండా పోయింది. మరో వైపున రద్దీ ప్రాంతంలో పెయిడ్‌ పార్కింగ్‌ కూడా లేకపోవటంతో వాహనదారులు ఎక్కడ పార్క్‌ చేయాలో అర్థంకాని పరిస్థితి నెలకొంది. శాస్త్రి రోడ్‌లో రోడ్డుకు ఇరువైపులా వాహనాలు పార్క్‌ చేసి వాహనాలు, పాదచారుల రాకపోకలకు పూర్తిగా అడ్డుగా ఉన్నప్పటికీ అధికారులు ఎలాంటి చర్యలు తీసుకోవటంలేదని ప్రజలు మండిపడుతున్నారు. ఇప్పటికైనా ట్రాఫిక్‌ పోలీసులు, మున్సిపల్‌ అధికారులు స్పందించి వాహనాల పార్కింగ్‌ స్థలాలను కేటాయించాలని, పెయిడ్‌ పార్కింగ్‌లను ఏర్పాటు చేయాలని జనం కోరుతున్నారు.

Updated Date - Dec 18 , 2023 | 11:47 PM

సంబంధం కోసం వెతుకుతున్నారా? తెలుగు మాట్రిమోని లో - రిజిస్ట్రేషన్ ఉచితం!
Advertising
Advertising