ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

వెబ్ స్టోరీస్+ -

కమ్మనైన వివాహాలు కుదర్చడంలో40 సంవత్సరాల సుదీర్ఘ అనుభవం ఉన్న కాకతీయ మ్యారేజెస్‌లో ఇప్పుడు ప్రీమియం మెంబర్‌షిప్‌ ఉచితం ఫోన్|| 9390 999 999, 7674 86 8080

సమర్థవంతంగా విధులు నిర్వహించాలి

ABN, Publish Date - Dec 21 , 2023 | 12:35 AM

సిబ్బందికి ఆరోగ్యం, సంక్షేమం విషయంలో అధిక ప్రాధాన్యమిస్తున్న క్రమంలో పోలీసు సిబ్బంది సమర్థవంతంగా విధులు నిర్వర్తించాలని ఎస్పీ అఖిల్‌ మహాజన్‌ అన్నారు.

విశ్రాంతి గదిని ప్రారంభిస్తున్న ఎస్పీ అఖిల్‌ మహాజన్‌

- ఎస్పీ అఖిల్‌ మహాజన్‌

వేములవాడ రూరల్‌, డిసెంబరు 20: సిబ్బందికి ఆరోగ్యం, సంక్షేమం విషయంలో అధిక ప్రాధాన్యమిస్తున్న క్రమంలో పోలీసు సిబ్బంది సమర్థవంతంగా విధులు నిర్వర్తించాలని ఎస్పీ అఖిల్‌ మహాజన్‌ అన్నారు. రూరల్‌ పోలీస్‌ స్టేషన్‌లో సిబ్బంది కోసం నిర్మించిన విశ్రాంతి గదులను, స్టేషన్‌కు వెళ్లే దారిలో ఏర్పాటు చేసిన ముఖ ద్వారాన్ని బుధవారం ఆయన ప్రారంభించారు. ఈ సందర్భంగా ఎస్పీ అఖిల్‌ మహాజన్‌ మాట్లాడుతూ 24 గంటలు విధులు నిర్వర్తించే సిబ్బందికి విశ్రాంతి ఎంతో అవసరమన్నారు. అందుకు అనుగుణంగా రూరల్‌ పోలీస్‌స్టేషన్‌లో సిబ్బందికి విశ్రాంతి గది నిర్మించామన్నారు. జిల్లాలో పనిచేస్తున్న పోలీస్‌ సిబ్బంది సంక్షేమం కోసం అధిక ప్రాధాన్యమిస్తు న్నామని తెలిపారు. సిబ్బందికి అవసరమైన సౌకర్యాల కల్పనకు చర్యలు తీసుకుంటున్నామన్నారు. సిబ్బందికి ఎలాంటి సమస్యలున్నా తన దృష్టికి తీసుకురావాలని సూచించారు. కార్యక్రమంలో అదనపు ఎస్పీ చంద్రయ్య, డీఎస్పీ నాగేంద్రచారి, సీఐ కృష్ణకుమార్‌, ఎస్సై మారుతీ సిబ్బంది పాల్గొన్నారు.

Updated Date - Dec 21 , 2023 | 12:35 AM

సంబంధం కోసం వెతుకుతున్నారా? తెలుగు మాట్రిమోని లో - రిజిస్ట్రేషన్ ఉచితం!
Advertising
Advertising