ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

వెబ్ స్టోరీస్+ -

కమ్మనైన వివాహాలు కుదర్చడంలో40 సంవత్సరాల సుదీర్ఘ అనుభవం ఉన్న కాకతీయ మ్యారేజెస్‌లో ఇప్పుడు ప్రీమియం మెంబర్‌షిప్‌ ఉచితం ఫోన్|| 9390 999 999, 7674 86 8080

రసవత్తరంగా కరీంనగర్‌ జిల్లా రాజకీయాలు

ABN, First Publish Date - 2023-11-12T00:52:17+05:30

కరీంనగర్‌ జిల్లా రాజకీయాలు రసవత్తరంగా మారుతున్నాయి. అన్ని పార్టీలు ఇక్కడ జరుగుతున్న అసెంబ్లీ పోరును ప్రతిష్టాత్మకంగా తీసుకుంటున్నాయి. మంత్రి గంగుల కమలాకర్‌, బీజేపీ జాతీయ ప్రధాన కార్యదర్శి, ఎంపీ బండి సంజయ్‌కుమార్‌, బీజేపీ ఎన్నికల నిర్వహణ కమిటీ చైర్మన్‌ ఈటల రాజేందర్‌ ఈ జిల్లా నుంచే అసెంబ్లీ బరిలో ఉండడంతో వారిని గెలిపించుకోవడం కోసం అగ్రనేతలు ఇక్కడ ప్రచారం చేసే అంశంపై దృష్టి సారించారు.

- 25న కరీంనగర్‌లో మోదీ జనగర్జన సభ

- 17, 20న సీఎం కేసీఆర్‌ రాక

- కాంగ్రెస్‌ అభ్యర్థులకు మద్దతుగా రేవంత్‌

(ఆంధ్రజ్యోతి ప్రతినిధి, కరీంనగర్‌)

కరీంనగర్‌ జిల్లా రాజకీయాలు రసవత్తరంగా మారుతున్నాయి. అన్ని పార్టీలు ఇక్కడ జరుగుతున్న అసెంబ్లీ పోరును ప్రతిష్టాత్మకంగా తీసుకుంటున్నాయి. మంత్రి గంగుల కమలాకర్‌, బీజేపీ జాతీయ ప్రధాన కార్యదర్శి, ఎంపీ బండి సంజయ్‌కుమార్‌, బీజేపీ ఎన్నికల నిర్వహణ కమిటీ చైర్మన్‌ ఈటల రాజేందర్‌ ఈ జిల్లా నుంచే అసెంబ్లీ బరిలో ఉండడంతో వారిని గెలిపించుకోవడం కోసం అగ్రనేతలు ఇక్కడ ప్రచారం చేసే అంశంపై దృష్టి సారించారు. బీజేపీ అధికారంలోకి వస్తే బీసీని ముఖ్యమంత్రిని చేస్తామని ప్రధాని నరేంద్ర మోదీ ప్రకటించడం, సీఎం రేసులో ఉన్న బీజేపీ బీసీ నేతలిద్దరు ఇక్కడ నుంచే పోటీ చేస్తుండడంతో జిల్లాకు రాజకీయ ప్రాధాన్యం పెరిగిపోయింది. ప్రధాని నరేంద్ర మోదీ ఈ నెల 25న కరీంనగర్‌లో జరిగే బీజేపీ జనగర్జన బహిరంగ సభకు హాజరుకానున్నారు.

ఫ ముఖ్యమంత్రి కేసీఆర్‌ ప్రత్యేక దృష్టి

హుస్నాబాద్‌ అసెంబ్లీ నియోజకవర్గం నుంచి అసెంబ్లీ ఎన్నికల ప్రచారానికి శ్రీకారం చుట్టిన ముఖ్యమంత్రి కేసీఆర్‌ ఉమ్మడి జిల్లా పరిధిలో మంత్రులు కేటీఆర్‌, కొప్పుల ఈశ్వర్‌ పోటీ చేస్తున్న సిరిసిల్ల, ధర్మపురి, మంథని, పెద్దపల్లి, కోరుట్ల నియోజకవర్గాలలో పర్యటింంచారు. కరీంనగర్‌ అసెంబ్లీ నియోజకవర్గంలో బిగ్‌ఫైట్‌కు తెరలేస్తున్న నేపథ్యంలో ఈ నెల 17న మంత్రి గంగుల కమలాకర్‌కు మద్దతుగా ప్రచారం నిర్వహించేందుకు కేసీఆర్‌ కరీంనగర్‌కు వచ్చే పర్యటనను ఖరారు చేసుకున్నారు. అదేరోజు ఆయన జిల్లాలోని చొప్పదండి, హుజూరాబాద్‌ నియోజకవర్గాల్లో జరిగే బహిరంగ సభల్లో పాల్గొంటారు. రాష్ట్ర సాంస్కృతిక సారథి చైర్మన్‌ రసమయి బాలకిషన్‌ పోటీ చేస్తున్న మానకొండూర్‌ నియోజకవర్గంలో ముఖ్యమంత్రి ప్రచారంలో పాల్గొననున్నారు. అదేరోజు జగిత్యాల నియోజకవర్గంలో పర్యటిస్తారని తెలుస్తోంది. ఉమ్మడి జిల్లాపై ప్రత్యేక దృష్టిసారించిన ముఖ్యమంత్రి జిల్లాలోని 13 అసెంబ్లీ నియోజకవర్గాలన్నింటిలోనూ ప్రజా ఆశీర్వాద సభలు నిర్వహించి మరోసారి ప్రజల మద్దతు కోరేందుకు నిర్ణయించుకున్నారని సమాచారం. తెలంగాణ ఉద్యమకాలం నుంచి ఇప్పటి వరకు కేసీఆర్‌కు వెన్నంటి ఉన్న ఉమ్మడి జిల్లాలో మళ్లీ కాంగ్రెస్‌ గాలులు వీస్తున్నాయన్న ప్రచారం జరుగుతుండడం, సుమారు ఏడు నియోజకవర్గాల్లో ఆ పార్టీ అభ్యర్థులు గట్టి పోటీదారులుగా తయారు కావడంతో వారి ప్రభావాన్ని తట్టుకుని తిరిగి అన్ని నియోజకవర్గాల్లో గులాబీ జెండాను ఎగురవేసేలా చూడాలని ముఖ్యమంత్రి ఈ జిల్లాపై ప్రత్యేక దృష్టిసారించారని చెబుతున్నారు.

ఫ 25న బీజేపీ జన గర్జన...

కరీంనగర్‌ అసెంబ్లీ నియోజకవర్గం నుంచి పోటీ చేస్తున్న బీజేపీ జాతీయ ప్రధాన కార్యదర్శి బండి సంజయ్‌ కుమార్‌ రాష్ట్ర మంత్రి గంగుల కమలాకర్‌తో తలపడుతున్నారు. హుజూరాబాద్‌లో పార్టీ ఎన్నికల నిర్వహణ కమిటీ చైర్మన్‌ ఈటల రాజేందర్‌ ఎమ్మెల్సీ, బీఆర్‌ఎస్‌ విప్‌ పాడి కౌశిక్‌ రెడ్డితో పోటీ పడుతున్నారు. ఈ ఇద్దరు బీసీ నేతల గెలుపుపై ఆ పార్టీ నాయకత్వం గట్టి పట్టుదలతో ఉన్నట్లు చెబుతున్నారు. బండి సంజయ్‌ కుమార్‌ నియోజకవర్గంలో ఇప్పటికే పాదయాత్ర చేపట్టి కరీంనగర్‌ కార్పొరేషన్‌ పరిధిలో రోజుకు రెండు లేక మూడు డివిజన్లలో ప్రచారం నిర్వహిస్తున్నారు. గ్రామీణ ప్రాంతాల్లో రెండు, మూడుగ్రామాల్లో పర్యటిస్తున్నారు. ఒకవైపు తన ప్రచారాన్ని కొనసాగిస్తూనే మరోవైపు ఇతర నియోజకవర్గాలకు స్టార్‌ క్యాంపెయినర్‌గా హెలికాప్టర్‌లో వెళ్తూ ప్రచారం నిర్వహిస్తున్నారు. ఆయనకు మద్దతుగా ప్రధాని నరేంద్రమోదీ కరీంనగర్‌లో 25న జరిగే జన గర్జన బహిరంగ సభకు హాజరై ప్రజలను ఉద్దేశించి ప్రసంగించేందుకు కార్యక్రమాన్ని ఖరారు చేసుకున్నారు.

ఫ ఉమ్మడి జిల్లా వ్యాప్తంగా రేవంత్‌రెడ్డి

టీపీసీసీ అధ్యక్షుడు రేవంత్‌రెడ్డి కూడా జిల్లాలోని పలు నియోజకవర్గాల్లో పర్యటించి ప్రచారం నిర్వహించనున్నారని సమాచారం. ఇప్పటికే ఆయన జిల్లాలోని ధర్మపురి, రామగుండం నియోజకవర్గాల్లో పర్యటించి ప్రచారం నిర్వహించారు. ఏఐసీసీ అగ్రనేత రాహుల్‌గాంధీ మంథని, పెద్దపల్లి నియోజకవర్గాలలో పర్యటించి ప్రచారం చేస్తూ కరీంనగర్‌ నియోజకవర్గానికి వచ్చి పాదయాత్రలో పాల్గొన్నారు. కాంగ్రెస్‌ ముఖ్య నేతలు మరికొందరు కూడా ప్రచార పర్వంలో పాల్గొనే అవకాశం ఉందని పార్టీ నేతలు పేర్కొంటున్నారు. తెలంగాణలో రాజకీయ ప్రాధాన్యం ఉన్న కరీంనగర్‌ జిల్లాలో వివిధ పార్టీల అగ్రనేతలు పర్యటనలతో రాజకీయాలు వేడెక్కి ఇక్కడి పోటీ వాతావరణాన్ని మరింత సంక్లిష్టంగా మారుస్తూ నువ్వానేనా అన్నట్లు పోటీ జరిగే అవకాశం కనిపిస్తున్నది.

Updated Date - 2023-11-12T00:52:20+05:30 IST

సంబంధం కోసం వెతుకుతున్నారా? తెలుగు మాట్రిమోని లో - రిజిస్ట్రేషన్ ఉచితం!
Advertising
Advertising