జగిత్యాల బల్దియా మాస్టర్ ప్లాన్‌పై నిరసనలు
ABN, First Publish Date - 2023-01-10T00:43:32+05:30
జగిత్యాల బల్దియా ఆధ్వర్యంలో ఇటీవల నూ తన మాస్టర్ ప్లాన్ ముసాయిదాను విడుదల చేశారు. అభ్యంతరాలు, సలహా లు, సూచనలు ఇవ్వాలని కోరుతూ పట్టణంలోని పలు చోట్ల నూతన మాస్టర్ ప్లాన్ మ్యాప్‌తో కూడిన ప్లెక్ల్సీలను అధికారులు ఏర్పాటు చేశారు.
కలెక్టరేట్ ఎదుట రైతుల ఆందోళన
జగిత్యాల టౌన్, జనవరి 9: జగిత్యాల బల్దియా ఆధ్వర్యంలో ఇటీవల నూ తన మాస్టర్ ప్లాన్ ముసాయిదాను విడుదల చేశారు. అభ్యంతరాలు, సలహా లు, సూచనలు ఇవ్వాలని కోరుతూ పట్టణంలోని పలు చోట్ల నూతన మాస్టర్ ప్లాన్ మ్యాప్‌తో కూడిన ప్లెక్ల్సీలను అధికారులు ఏర్పాటు చేశారు. అయితే నూ తన మాస్టర్ ప్లాన్‌లో జగిత్యాల చుట్టు పక్కల గ్రామాలతో పాటు వ్యవసా య భూములను కలుపుతూ అధికారులు పబ్లిక్ జోన్, సెమీ పబ్లిక్ జోన్‌లుగా ముసాయిదా రూపొందించారు. దీనిని వ్యతిరేకిస్తూ సోమవారం జగిత్యాల రూ రల్ మండలంలోని తిమ్మాపూర్, అర్బన్ మండలంలోని మోతె, తిప్పన్నపేట గ్రామాలకు చెందిన రైతులు ఆందోళన నిర్వహించారు. కలెక్టరేట్ ఎదుట తమ నిరసనను తెలియజేశారు. మాస్టర్ ప్లాన్‌లో పలు మార్పులు చేయాలని కోరు తూ కలెక్టర్‌కు వినతి పత్రాలు అందజేశారు. అనంతరం వారు మాట్లాడుతూ వ్యవసాయంపై ఆధారపడి జీవిస్తున్న తమకు జగిత్యాల మున్సిపల్ పరిధిలోని మాస్టర్ ప్లాన్‌లోకి తమ భూములను తీసుకవచ్చి ఇబ్బందులకు గురిచేస్తున్నా రని ఆవేదన వ్యక్తం చేశారు. మాగ్రామాల్లో ఉన్న వివిధ సర్వే నెంబర్లలో ఉన్న భూములను మాస్టర్ ప్లాన్ పరిధిలోకి చేర్చవద్దని డిమాండ్ చేశారు. ఈ ఆం దోళన కార్యక్రమంలో ఆయా గ్రామాల రైతులు ఉన్నారు.
Updated Date - 2023-01-10T00:43:35+05:30 IST