కమ్మనైన వివాహాలు కుదర్చడంలో40 సంవత్సరాల సుదీర్ఘ అనుభవం ఉన్న కాకతీయ మ్యారేజెస్‌లో ఇప్పుడు ప్రీమియం మెంబర్‌షిప్‌ ఉచితం ఫోన్|| 9390 999 999, 7674 86 8080

తెలుగు సాహిత్యానికి కీర్తి తెచ్చిన సినారె

ABN, First Publish Date - 2023-07-30T00:35:37+05:30

తెలుగు సాహిత్యానికి ప్రపంచ వ్యాప్తంగా కీర్తి తెచ్చింది డాక్టరు సి.నారాయణ రెడ్డి అని జిల్లా గ్రంథాలయ చైర్మన్‌ ఆకునూరి శంకరయ్య అన్నారు.

తెలుగు సాహిత్యానికి కీర్తి తెచ్చిన సినారె
నివాళులు అర్పిస్తున్న గ్రంథాలయ చైర్మన్‌

సిరిసిల్ల ఎడ్యుకేషన్‌, జూలై 30: తెలుగు సాహిత్యానికి ప్రపంచ వ్యాప్తంగా కీర్తి తెచ్చింది డాక్టరు సి.నారాయణ రెడ్డి అని జిల్లా గ్రంథాలయ చైర్మన్‌ ఆకునూరి శంకరయ్య అన్నారు. సిరిసిల్లలోని జిల్లా గ్రంథాలయంలో జిల్లా రచయితల సంఘం ఆధ్వర్యంలో శనివారం సినారె జయంతిని అధ్యక్షుడు ఎలగొండ రవి అధ్యక్షతన నిర్వహించారు. ఈ సందర్భంగా శంకరయ్య మాట్లాడుతూ కవులు సినారె రచనలు అధ్యయనం చేయాలన్నారు. సినారె రచనలను చదివించే బాధ్యత మనందరి పైన ఉందన్నారు. గ్రంథాలయం ముందు సినారే కాంప్యవిగ్రహాన్ని నెలకొల్పడానికి మంత్రి కేటీఆర్‌ను అడగగానే రూ.10 లక్షలు మంజూరు చేశారన్నారు. అఖిల భారత తెలంగాణ రచయితల వేదిక అధ్యక్షుడు జూకంటి జూకంటి జగన్నాథం మాట్లాడుతూ జ్ఞానపీఠ అవార్డు పొందిన మహాకవి సినారే అని, ఏటా జూలై29న సినారె ఏదో ఒక పుస్తకం తీసుకొచ్చేవారని అన్నారు. జిల్లా రచయితల సంఘం ప్రధాన కార్యదర్శి వాసరవేణి పర్శరాములు, సిరిసిల్ల సాహితీ సమితి అధ్యక్షుడు జనపాల శంకరయ్య, జిల్లా రచయితల సంఘం ఉపాధ్యక్షుడు వెంగళ లక్ష్మణ్‌, బూర దేవానందం, కోశాధికారి ఆడెపు ల్మణ్‌, కార్యనిర్వాహక కార్యదర్శులు గోనే బాల్‌రెడ్డి, వెంగల నాగరాజు, చిటికెన కిరణ్‌కుమార్‌, బుర్క గోపాల్‌, రేగుల బిక్షపతి, ఆడెపు సౌమ్య, ముడారి సాయిమహేష్‌, కోడం నారాయణ, నర్రా అంజన్‌రెడ్డి, కామారపు శ్రీనివాస్‌, దూడం గణేష్‌ తదితరులు పాల్గొన్నారు.

వేములవాడ రూరల్‌: వేములవాడలోని నృత్యకళానికేతన్‌ సేవాసంస్థ, జిల్లా సాంస్కృతిక కళా సంస్థల సమాఖ్య ప్రధాన కార్యాలయంతోపాటు పట్టణంలోని పలు ప్రాంతల్లో సి.నారాయణరెడ్డి జయంతి శనివారం ఘనంగా నిర్వహించారు. బీఆర్‌ఎస్‌ సీనియర్‌ నాయకుడు ఏనుగు మనోహర్‌ రెడ్డి, కళా సంస్థల వ్యవస్థాపక అధ్యక్షుడు యెల్ల పోశేట్టి, బొడ్డు రాములు, సావనపల్లి శ్రీనివాస్‌, మానువాడ లక్ష్మీనారాయణ, వారాల దేవయ్య, నరాల శేఖర్‌, మ్యాకల శ్రీనివాస్‌, వెంకట్‌రెడ్డి, రాజేందర్‌, శ్రీనివాస్‌, పర్షరాములు, శేఖర్‌, రవి, నాగరాజు, మహేష్‌, అనిల్‌, శ్రీధర్‌, సంజీవ్‌, ప్రవీణ్‌, భగవాన్‌ పాల్గొన్నారు.

Updated Date - 2023-07-30T00:35:37+05:30 IST

సంబంధం కోసం వెతుకుతున్నారా? తెలుగు మాట్రిమోని లో - రిజిస్ట్రేషన్ ఉచితం!
Advertising
Advertising