ఆరు గ్యారెంటీలు అమలు చేస్తాం
ABN, First Publish Date - 2023-11-27T00:30:29+05:30
కాంగ్రెస్ ప్రభుత్వం ఏర్పడిన తర్వాత మేనిఫెస్టోలో ప్రకటించిన ఆరు గ్యారెంటీ పథకాలు అమలు చేసి మాట నిలబెట్టుకుంటామని ఆ పార్టీ వేములవాడ నియోజకవర్గ కాంగ్రెస్ అభ్యర్థి ఆది శ్రీనివాస్ అన్నారు.
భీమారం, నవంబరు 26: కాంగ్రెస్ ప్రభుత్వం ఏర్పడిన తర్వాత మేనిఫెస్టోలో ప్రకటించిన ఆరు గ్యారెంటీ పథకాలు అమలు చేసి మాట నిలబెట్టుకుంటామని ఆ పార్టీ వేములవాడ నియోజకవర్గ కాంగ్రెస్ అభ్యర్థి ఆది శ్రీనివాస్ అన్నారు. మేడిపల్లి, భీమారం మండలంలోని పలు గ్రామాల్లో ఎన్నికల ప్రచారంలో మాట్లాడారు. బీఆర్‌ఎస్, బీజేపీ అభ్యర్థులు ఇక్కడ ఉండేవాళ్లు కాదని, ఎన్నికలప్పుడే ఇక్కడికి వస్తారని, నాన్ లోకల్ బీఆర్‌ఎస్, బీజేపీ అభ్యర్థులను నమ్మి ఓట్లు వేస్తే నట్టేట మునుగుతారని అన్నారు. గత పది సంవత్సరాలుగా అధికారంలో ఉన్న బీఆర్‌ఎస్ ప్రభుత్వం మేడిపల్లి మండల కేంద్రంలో కనీసం ఒక జూనియర్ కళాశాలను కూడా మంజూరు చేయలేదన్నారు. అమరవీరుల త్యాగాల మీద ఏర్పడి తెలంగాణ రాష్ట్రం కేవలం కల్వకుంట్ల కుటంబం చేతిలో బందీ అయ్యిందన్నారు. తెలంగాణ రాష్ట్రాన్ని బంగారు తెలంగాణగా మారుస్తానని చెప్పి అప్పుల కుప్పగా మార్చిన ఘనత కేసీఆర్‌ది అన్నారు. ఆనాడు చంద్రబాబు ప్రభుత్వంలో మంత్రిగా ఉన్న కేసీఆర్ వ్యవసాయం దండగా అన్నారని, కానీ దివంగత నేత రాజశేఖర్ రెడ్డి ముఖ్యమంత్రి అయిన వెంటనే ఉచిత కరెంట్‌పై మొదటి సంతకం చేశారని గుర్తు చేశారు. అలాంటి కాంగ్రెస్ ప్రభుత్వం రైతులకు మూడు గంటలు కరెంట్ ఎలా ఇస్తుందన్నారు. గత 30 సంవత్సరాలుగా మీ మధ్య ఉన్నానని, మీ కష్టసుఖాల్లో పాలు పంచుకుంటూ అన్నింటికీ అందుబాటులో ఉండే వ్యక్తిని అని.. నాలుగుసార్లు ఓడానని, తనకు ఒకసారి అవకాశం ఇవ్వాలని కోరారు. రానున్న ఎన్నికల్లో కాంగ్రెస్ పార్టీకి ఓట్లు వేసి గెలిపించాలన్నారు. ఈ కార్యక్రమంలో కాంగ్రెస్ మండల అధ్యక్షుడు సింగిరెడ్డి నరేష్ రెడ్డి, యూత్ కాంగ్రెస్ అధ్యక్షుడు గడ్డం జీవన్ రెడ్డి, బొమ్మెన ప్రశాంత్, ఉరుమడ్ల లక్ష్మణ్, ముంజ కిషన్, అరిగెల గంగారెడ్డి, శ్రీకాంత్, మధు, అజయ్, శంకర్ తదితరులు పాల్గొన్నారు.
మేడిపల్లి : అందుబాటులో ఉండే అభ్యర్థినని, ఆశీర్వదించి గెలిపించాలని వేములవాడ కాంగ్రెస్ అభ్యర్థి ఆది శ్రీనివాస్ అన్నారుు. ఎన్నికల ప్రచారంలో బాగంగా మేడిపల్లి మండలంలోని కట్లకుంట, పోరుమల్ల, తొంబర్రావుపేట, గూడ్లపల్లె, మేడిపల్లి, వల్లపల్లి, కల్వకోట, దమ్మన్నపేట, మాచాపూర్ గ్రామాల్లో ప్రచారం నిర్వహించారు. ఈసందర్భంగా ఆయన మాట్లాడుతూ కొండాపూర్ నుంచి విలాయతాబాద్ గ్రామాల మధ్య బ్రిడ్జి నిర్మాణం, మేడిపల్లిలో ప్రభుత్వ జూనియర్ కళాశాల, మండలంలో పరిష్కారానికి నోచుకొని సమస్యలను పరిష్కరించి అభివృద్ధి చేస్తానన్నారు. ఇక్కడి ప్రాంత సమస్యలు తెలిసిన వ్యక్తిగా మీముందుకు వస్తున్నానని ఒక్క అవకాశం ఇవ్వాలని ఓటర్లను కోరారు. కాంగ్రెస్ ఆరు గ్యారెంటీలను ప్రజలకు వివరించారు. నియోజకవర్గంలోని ప్రతిపల్లె తన సొంత ఊరేనని ప్రజల అకాంక్ష అవసరాలు తెలిసిన తాను అన్ని వేలలో అందుబాటులో ఉంటూ సేవ చేస్తానని అన్నారు. ప్రజలు మార్పు కోరుకుంటున్నారని దీనికి నాంది వేములవాడలో జరగాలని వేములవాడ ప్రజలు కోరుకుంటున్నారని అన్నారు. తనను ఆశీర్వాదించాలని కోరారు. పార్టీ నాయకులు సింగిరెడ్డినరేస్‌రెడ్డి, రమేర్‌రెడ్డి, రాజెందర్‌రెడ్డి, మహేష్ పాల్గొన్నారు.
రుద్రంగి: రుద్రంగి బిడ్డ ఆది శ్రీనివాస్‌ను భారీ మెజార్టీతో గెలిపిద్దామని కాంగ్రెస్ మండల ఉపాధ్యక్షుడు తర్రె మనోహర్ ఆన్నారు. రుద్రంగి మండల కేంద్రంలో వేములవాడ నియోజకవర్గం కాంగ్రెస్ అభ్యర్ధి ఆది శ్రీనివాస్‌కు మద్దతుగా ఇంటింటా ప్రచారం నిర్వహించారు. ఆది శ్రీనివాస్ గెలుపే లక్ష్యంగా ప్రతీ ఒక్కరు పని చేయాలని, చేతి గుర్తుపై ఓటు వేసి ఆది శ్రీనివాస్‌ను భారీ మోజార్టీతో గెలిపించాలని కోరారు. కార్యక్రమంలో కాంగ్రెస్ గ్రామ అధ్యక్షుడు సామ మోహన్‌రెడ్డి, ఓబీసీ సెల్ మండల అధ్యక్షుడు గండి నారాయణ, డీసీసీ కార్యదర్శులు చెలుకల తిరుపతి, గడ్డం శ్రీనివాస్‌రెడ్డి, ఎర్రం గంగనర్సయ్య, పల్లి గంగాధర్, ఇప్ప మహేష్, మాడిశెట్టి అభిలాష్, గంధం మనోజ్, స్వర్గం పరంధామ్, అట్టపల్లి మల్లేశం, పోగుల మహేష్, ఎర్రం ఆరవింద్, పూదరి మహిపాల్ తదితరులు పాల్గొన్నారు.
కోనరావుపేట : మాజీ సర్పంచుల మద్దతు కాంగ్రెస్‌కేనని ఆ సంఘం అధ్యక్షుడు బొడ్డు దేవయ్య అన్నారు. కోనరావుపేట మండల కేంద్రంలో ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో ఆదివారం మాట్లాడారు. మాజీ సర్పంచులకు గౌరవ వేతనం ఇవ్వాలని బీఆర్‌ఎస్ ప్రభుత్వానికి ఎన్నోసార్లు మొరపెట్టుకున్నా పట్టించుకోలేదన్నారు. కాంగ్రెస్ అధికారంలోకి వస్తే మాజీ సర్పంచుల సమస్యలను పరిష్కరిస్తామని కాంగ్రెస్ నేతలు హామీ ఇచ్చారని, తమ మద్దతు కాంగ్రెస్ పార్టీకే ప్రకటిస్తున్నామని అన్నారు. వేములవాడలో కాంగ్రెస్ అభ్యర్థి ఆది శ్రీనివాస్‌ను గెలిపిస్తామన్నారు. మాజీ సర్పంచులు చందనగిరి గోపాల్, దేవరాజు, నందయ్య తదితరులు పాల్గొన్నారు.
వేములవాడ రూరల్: మిడ్‌మానేరు నిర్వాసితులను సీఎం కేసీఆర్ మోసం చేశారని సీపీఐ నియోజకవర్గ ఇన్‌చార్జి కడారి రాములు అన్నారు. కాంగ్రెస్ అభ్యర్థి ఆది శ్రీనివాస్‌కు మద్దతుగా సంకెపల్లిలో ఆదివారం ప్రచారం నిర్వహించారు. చేతి గుర్తుకు ఓటు వేసి ఆది శ్రీనివాస్‌ను గెలిపించాలని ప్రజలకు విజ్ఞప్తి చేసారు. అనంతరం ఆయన మాట్లాడుతూ ముంపు గ్రామాల నిర్వాసితులకు పూర్తి స్థాయిలో నష్టపరిహారం అందలేదన్నారు. కార్మికులను మోసం చేసిన బీఆర్‌ఎస్, బీజేపీలు ఇప్పుడు ఎలా ఓట్లు అడుగుతున్నారన్నారు. కోరె క్రాంతి, పండుగ పోశాలు, పండుగ చంద్రయ్య తదితరులు ఉన్నారు.
Updated Date - 2023-11-27T00:30:30+05:30 IST