ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

వెబ్ స్టోరీస్+ -

కమ్మనైన వివాహాలు కుదర్చడంలో40 సంవత్సరాల సుదీర్ఘ అనుభవం ఉన్న కాకతీయ మ్యారేజెస్‌లో ఇప్పుడు ప్రీమియం మెంబర్‌షిప్‌ ఉచితం ఫోన్|| 9390 999 999, 7674 86 8080

అవకాశాలను సద్వినియోగం చేసుకోవాలి

ABN, Publish Date - Dec 23 , 2023 | 12:08 AM

విద్యార్థి దశలో విద్యతో పాటు క్రీడారంగాల్లో ప్రతి అవకాశాన్ని సద్వినియోగం చేసుకోవాలని కలెక్టర్‌ పమేలా సత్పతి అన్నారు.

క్రీడా జ్యోతిని వెలిగిస్తున్న కలెక్టర్‌ పమేలా సత్పతి

- కలెక్టర్‌ పమేలా సత్పతి

కరీంనగర్‌ స్పోర్ట్స్‌, డిసెంబరు 22: విద్యార్థి దశలో విద్యతో పాటు క్రీడారంగాల్లో ప్రతి అవకాశాన్ని సద్వినియోగం చేసుకోవాలని కలెక్టర్‌ పమేలా సత్పతి అన్నారు. శుక్రవారం డాక్టర్‌ బీఆర్‌ అంబేద్కర్‌ ప్రభుత్వ మోడల్‌ రెసిడెన్షియల్‌(ఎస్సీ) పాలిటెక్నిక్‌ కళాశాలలో నిర్వహించిన జిల్లాస్థాయి ఇంటర్‌ పాలిటెక్నిక్‌ సోర్ట్స్‌, గేమ్స్‌ మీట్‌-2023-24 నిర్వహించారు. ముఖ్య అతిథిగా హాజరైన జిల్లా కలెక్టర్‌ జ్యోతిప్రజ్వలన చేసి ప్రారంభించారు. అనంతరం విద్యార్థుల నుంచి మార్చ్‌ఫాస్ట్‌తో గౌరవ వందనం స్వీకరించారు. ఈ సందర్భంగా కలెక్టర్‌ మాట్లాడుతూ విద్యార్థులు భవిష్యత్తులో ఉద్యోగిగా మంచి స్థానాన్ని చేరుకున్న క్రమంలో సులువుగా నాయకత్వం వహించేలా మిమ్మల్ని ముందు నిలబెడతాయని అన్నారు. క్రీడల్లో క్రీడాకారులుగా హృదయపూర్వకంగా పూర్తి నిబద్ధతతో పాల్గొని విజయాలను సొంతం చేసుకోవాలని పిలుపునిచ్చారు. తనకు క్రీడల్లో ఎటువంటి అనుభవం లేకపోయినా పాఠశాల స్థాయిలో నిర్వహించే మార్చ్‌ఫాస్ట్‌లో మాత్రం చురుకుగా పాల్గొనేదానినని అన్నారు. క్రీడలు మానసిక, శారీరక దృఢత్వాన్ని పెంపొందిస్తాయని అన్నారు. ఈ కార్యక్రమంలో వివిధ పాలిటెక్నిక్‌ కళాశాల ప్రధానోపాధ్యాయులు జి అప్పారావు, బి రాజు, వ్యాయామ ఉపాధ్యాయులు ఇతర అధికారులు పాల్గొన్నారు.

Updated Date - Dec 23 , 2023 | 12:08 AM

సంబంధం కోసం వెతుకుతున్నారా? తెలుగు మాట్రిమోని లో - రిజిస్ట్రేషన్ ఉచితం!
Advertising
Advertising