ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

కేంద్ర ప్రభుత్వ కుట్రలను తిప్పికొట్టాలి

ABN, First Publish Date - 2023-01-07T00:23:36+05:30

సింగరేణిలో బొగ్గు బ్లాకుల వేలానికి కేంద్ర ప్రభుత్వం పన్నుతున్న కుట్రలను తిప్పికొట్టాలని రామగుం డం ఎమ్మెల్యే కోరుకంటి చందర్‌ పిలుపునిచ్చారు.

అన్నపూర్ణ మ్యారేజెస్... వరల్డ్ వైడ్‌గా తెలుగువారు ఎక్కడున్నా అన్ని కులముల వారికీ పెళ్లి సంబంధాలు కుదర్చడంలో టాప్ పొజిషన్. ఉన్నతమైన కుటుంబాల ఎంపిక. సం|| 9397 9797 50

గోదావరిఖని, జనవరి 6: సింగరేణిలో బొగ్గు బ్లాకుల వేలానికి కేంద్ర ప్రభుత్వం పన్నుతున్న కుట్రలను తిప్పికొట్టాలని రామగుం డం ఎమ్మెల్యే కోరుకంటి చందర్‌ పిలుపునిచ్చారు. శుక్రవారం ఆర్‌జీ-1 పరిధిలోని జీడీకే 2ఏ, ఏరియా వర్క్‌షాపుల్లో బాయిబాట కార్యక్రమాన్ని నిర్వహించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లా డుతూ సింగరేణి కార్మికులు తమ రక్తాన్ని చెమటగా మార్చి దేశానికి వెలుగులు ప్రసాదిస్తున్నా సింగరేణి కార్మిక కుటుంబాల్లో బీజేపీ ప్రభుత్వం చీకటి నింపుతుందని ఆయన ఆవేదన వ్యక్తం చేశారు. ఎంఎండీఆర్‌ యాక్ట్‌తో సింగరేణి అస్తిత్వం కోల్పోయే ప్రమాదం ఉందని, రానున్న కాలంలో సింగరేణి ప్రైవేటీకరణ అవుతుందని, ముఖ్యమంత్రి కేసీఆర్‌ అధికారంలోకి వచ్చిన తరువాత వారసత్వ ఉద్యోగాల కల్పనతో పాటు అనేక సంక్షేమ పథకాలను ప్రవేశపెట్టారని, బీజేపీ హటావో సింగరేణి బచావో అనేనినాదంతో బాయిబాట కార్యక్రమాన్ని ప్రారంభించినట్టు, దీని ద్వారా కార్మికుల్లో చైతన్యం నింపడం జరుగుతుందన్నారు. రాబోయే పార్లమెంట్‌ సమావేశాల్లో ఎంఎండీఆర్‌ రద్దు చేయకపోతే బీజేపీ ప్రభుత్వానికి తగిన బుద్ధిచెబుతామన్నారు. అనంతరం ఏరియా వర్క్‌షాప్‌లో కార్మికులు బీఆర్‌ఎస్‌లో చేరగా వారికి కండువాలు కప్పి పార్టీలోకి ఆహ్వానించారు. ఈ కార్యక్రమంలో మేయర్‌ బంగి అనీల్‌ కుమార్‌, కార్పొరేటర్లు దాతు శ్రీనివాస్‌, కొమ్ము వేణు, బాల రాజ్‌కుమార్‌, కవిత సరోజిని, దొంత శ్రీనివాస్‌, కుమ్మరి శ్రీనివాస్‌, కోఆప్షన్‌ సభ్యులు చెరుకు బుచ్చిరెడ్డి, నాయకులు మూల విజయారెడ్డి, టీబీజీకేఎస్‌ నాయకులు కెంగర్ల మల్లయ్య, జాహిద్‌పాషా, దాసరి నర్సయ్య, లావుడ్య వెంకటేష్‌, చెలుకలపెల్లి శ్రీనివాస్‌, వడ్డేపల్లి శంకర్‌, ఐ సత్యం, దీటి బాలరాజు, అడప శ్రీనివాస్‌, నారాయణదాసు మారుతి, పర్లపల్లి రవి, జేవీ రాజు తదితరులు పాల్గొన్నారు.

Updated Date - 2023-01-07T00:23:42+05:30 IST

సంబంధం కోసం వెతుకుతున్నారా? తెలుగు మాట్రిమోని లో - రిజిస్ట్రేషన్ ఉచితం!
Advertising
Advertising