ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

బంగారు తెలంగాణగా తీర్చిదిద్దడమే ప్రభత్వ లక్ష్యం

ABN, First Publish Date - 2023-04-18T00:36:43+05:30

రాష్ట్రాన్ని బంగారు తెలంగాణగా తీర్చిదిద్దడమే కేసీఆర్‌ నేతృత్వంలోని రాష్ట్ర ప్రభుత్వం లక్ష్యమంటూ, అందుకు అనుగు ణంగా ఎన్నో బృహత్తర పథకాలు ప్రవేశపెట్టి అమలు చేస్తూ తెలంగాణ రాష్ట్రాన్ని దేశానికే ఆదర్శంగా తీర్చిదిద్దుతున్నట్లు రాష్ట్ర సంక్షేమశాఖ మంత్రి కొప్పుల ఈశ్వర్‌ పేర్కొన్నారు.

ధాన్యం కొనుగోలు కేంద్రం ప్రారంభిస్తున్న మంత్రి
అన్నపూర్ణ మ్యారేజెస్... వరల్డ్ వైడ్‌గా తెలుగువారు ఎక్కడున్నా అన్ని కులముల వారికీ పెళ్లి సంబంధాలు కుదర్చడంలో టాప్ పొజిషన్. ఉన్నతమైన కుటుంబాల ఎంపిక. సం|| 9397 9797 50

తెలంగాణ పథకాలు దేశానికే ఆదర్శం

సంక్షేమశాఖ మంత్రి కొప్పుల ఈశ్వర్‌

పెగడపల్లి, ఏప్రిల్‌ 17 : రాష్ట్రాన్ని బంగారు తెలంగాణగా తీర్చిదిద్దడమే కేసీఆర్‌ నేతృత్వంలోని రాష్ట్ర ప్రభుత్వం లక్ష్యమంటూ, అందుకు అనుగు ణంగా ఎన్నో బృహత్తర పథకాలు ప్రవేశపెట్టి అమలు చేస్తూ తెలంగాణ రాష్ట్రాన్ని దేశానికే ఆదర్శంగా తీర్చిదిద్దుతున్నట్లు రాష్ట్ర సంక్షేమశాఖ మంత్రి కొప్పుల ఈశ్వర్‌ పేర్కొన్నారు. సోమవారం పెగడపల్లి మండలంలోని పె గడపల్లి, నామాపూర్‌, మద్దులపల్లి గ్రామాలలోని ఫ్యాక్స్‌, మహిళా సంఘా ల ఆధ్వర్యంలోని ధాన్యం కొనుగోలు కేంద్రాల ప్రారంభంతో పాటు మద్దు లపల్లి, ఆరవెల్లి గ్రామాలలో పలు అభివృద్ధి కార్యక్రమాల ప్రారంభోత్స వానికి మంత్రి కొప్పుల ఈశ్వర్‌ ముఖ్య అతిథిగా హాజరై ప్రారంభించారు. ఈ సందర్భంగా మద్దులపల్లి పాఠశాలలో మన ఊరు మన బడిలో ప నులు పూర్తి కాగా వాటిని ప్రారంభించి అనంతరం ఏర్పాటు చేసిన స మావేశంలో మంత్రి మాట్లాడుతూ పేదోడి బడులుగా పిలవబడుతున్న స ర్కారు బడుల్లో మన ఊరు మన బడి పథకంతో ప్రభుత్వ పాఠశాలలో స కల సౌకర్యాలు కల్పిస్తూ కార్పొరేట్‌ పాఠశాలలకు దీటుగా తీర్చిదిద్దుతున్న ట్లు పేర్కొన్నారు. విద్య, వైద్యం, రవాణా సౌకర్యాల మెరుగు పరచడంతో పాటు రైతు బంధు, రైతు బీమా, 24 గంటల ఉచిత విద్యుత్‌, ప్రతి కు టుంబానికి పింఛన్‌, తాగు, సాగు నీటి రంగాలపై ప్రత్యేక దృష్టి సారించి ప్రతి ఇంటికి తాగు నీరు, ప్రతి ఎకరాకు సాగు నీరు అందిస్తు రాష్ట్రాన్ని బంగారు తెలంగాణగా తీర్చిదిద్దుతున్నట్లు పేర్కొన్నారు. కొత్త రాష్ట్రాన్ని దే శానికే ఆదర్శంగా తీర్చిదిద్దుతుండగా కేంద్రంలోని బీజేపీ ప్రభుత్వం నిధు లు కేటాయిస్తూ అభివృద్ధిని ప్రోత్సహించాల్సింది పోయి అభివృద్ధిని అ డ్డుకుంటూ రాష్ట్ర ప్రజలను తమ మాయమాటలతో తప్పు దోవపట్టిం చాలని చూస్తున్నారని విమర్శించారు. తెలంగాణ ప్రజలు బీజేపీ, కాంగ్రెస్‌ పార్టీల మాయమాటలు నమ్మేస్థితిలో లేరని మంత్రి ఈశ్వర్‌ అన్నారు. ఈ సందర్భంగా మండలంలోని వివిధ గ్రామాలకు చెందిన పలువురికి మం జూరైన కల్యాణలక్ష్మి, షాదీముబారక్‌ చెక్కులను లబ్ద్దిదారులకు మంత్రి ఈ శ్వర్‌ అందించారు. కార్యక్రమాలలో ఎంపీపీ గోళి శోభా సురెందర్‌రెడ్డి, వైస్‌ ఎంపీపీ గాజుల గంగాధర్‌, మార్కెట్‌ చైర్మన్‌ లోక నిర్మల, ఆర్బీఎస్‌ చైర్మన్‌ నరేందర్‌రెడ్డి, సర్పంచులు మేరుగు శ్రీనివాస్‌, కరుణాకర్‌రెడ్డి, అనూ ష, లక్ష్మణ్‌, ఎంపీటీసీలు బొమ్మెన జమున స్వామి, రజిత రమణాకర్‌, స్వాతి, విండో, మార్కెట్‌ ఉపాద్యక్షులు రాజశేఖర్‌ రావు, రాజు ఆంజనేయులు, జిల్లా సహకార అధికారి రామాంజనేయులు, తహసీల్దార్‌ కృష్ణ చైతన్య, ఎంపీడీవో పుల్లయ్య, ఎంఈవో శ్రీనివాస్‌, ఎంపీవో మహేందర్‌, ఏపీఎం సమత, సీఈవో గోపాల్‌రెడ్డి, వివిధ గ్రామాల సర్పంచులు, ఎంపీటీసీలు, బీఆర్‌ఎస్‌ మండల నాయకులు పాల్గొన్నారు.

Updated Date - 2023-04-18T00:36:43+05:30 IST

సంబంధం కోసం వెతుకుతున్నారా? తెలుగు మాట్రిమోని లో - రిజిస్ట్రేషన్ ఉచితం!
Advertising
Advertising