ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

‘మన ఊరు-మన బడి’ పనులను వేగవంతం చేయాలి

ABN, First Publish Date - 2023-03-10T00:53:17+05:30

ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా చేపట్టిన ’మన ఊరు- మన బడి’ కార్యక్రమంలో భాగంగా ప్రగతి పనులను వేగవంతం చేయాలని కలెక్టర్‌ అనురాగ్‌ జయంతి సంబంధిత శాఖ అధికారులను ఆదేశించారు. ఎల్లారెడ్డిపేట మండలం వెంకటాపూర్‌, దుమాల గ్రామాల్లో ప్రభుత్వ ఉన్నత, ప్రాథమిక పాఠశాలల్లో కొనసాగుతున్న ‘మన ఊరు-మన బడి’ కార్యక్రమంలోని పనులు, కంటి వెలుగు శిబిరాన్ని గురువారం ఆయన సందర్శించారు.

మధ్యాహ్న భోజనం చేస్తున్న విద్యార్థులతో మాట్లాడుతున్న కలెక్టర్‌ అనురాగ్‌ జయంతి
అన్నపూర్ణ మ్యారేజెస్... వరల్డ్ వైడ్‌గా తెలుగువారు ఎక్కడున్నా అన్ని కులముల వారికీ పెళ్లి సంబంధాలు కుదర్చడంలో టాప్ పొజిషన్. ప్రవేశం ఉచితం. సం|| 9393 763 666

- కలెక్టర్‌ అనురాగ్‌ జయంతి

ఎల్లారెడ్డిపేట, మార్చి 9: ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా చేపట్టిన ’మన ఊరు- మన బడి’ కార్యక్రమంలో భాగంగా ప్రగతి పనులను వేగవంతం చేయాలని కలెక్టర్‌ అనురాగ్‌ జయంతి సంబంధిత శాఖ అధికారులను ఆదేశించారు. ఎల్లారెడ్డిపేట మండలం వెంకటాపూర్‌, దుమాల గ్రామాల్లో ప్రభుత్వ ఉన్నత, ప్రాథమిక పాఠశాలల్లో కొనసాగుతున్న ‘మన ఊరు-మన బడి’ కార్యక్రమంలోని పనులు, కంటి వెలుగు శిబిరాన్ని గురువారం ఆయన సందర్శించారు. పాఠశాలల్లో చేపట్టిన పనుల ప్రగతిని క్షేత్రస్థాయిలో పరిశీలించారు. వంట గదులు, ప్రహరీ, డైనింగ్‌ హాలు, మూత్రశాలల నిర్మాణ పనుల వివరాలను అడిగి తెలుసుకున్నారు. పనుల్లో జాప్యం జరగకుండా వేగం పెంచాలని అధికారులను ఆదేశించారు. పాఠశాలల ఆవరణలో మొక్కలు నాటాలని సంబంధిత అధికారులు, హెచ్‌ఎంలకు సూచించారు. అనంతరం తరగతి గదుల్లోకి వెళ్లి విద్యార్థుల ప్రగతిని తెలుసుకున్నారు. పదో తరగతి విద్యార్థులు కష్టపడి చదువాలని పేర్కొన్నారు. ఉత్తమ ఫలితాలు సాధించేలా ఉపాధ్యాయులు కృషి చేయాలని సూచించారు. దుమాల గ్రామంలో పూర్తి చేపిన ఇంకుడు గుంతలను వినియోగంలోకి తీసుకురావాలని సంబంధిత అధికారులను ఆదేశించారు. మురుగు నీటి కాల్వను పరిశీలించారు. నర్సరీలోని మొక్కలను సంరక్షించేలా చర్యలు చేపట్టాలని ఆదేశించారు. పాఠశాల ఆవరణలో ఏర్పాటు చేసిన క్రీడా ప్రాంగణం పనులను పూర్తి చేసి వినియోగంలోకి తీసుకురావాలని కలెక్టర్‌ అనురాగ్‌ జయంతి అన్నారు.

- చిన్నోడా.. భోజనం బాగుందా.?

మండలంలోని దుమాల గ్రామంలో ప్రభుత్వ పాఠశాలలను సందర్శించిన కలెక్టర్‌ అనురాగ్‌ జయంతి మధ్యాహ్న భోజనాన్ని పరిశీలించారు. వంటల తయారీకి వినియోగించే సరుకులు, వంట గదులు, పరిసరాలను పరిశీలించారు. నాణ్యమైన భోజనం అందించాలని మధ్యాహ్న భోజనం నిర్వాహుకులకు సూచించారు. మధ్యాహ్న భోజనం చేస్తున్న విద్యార్థుల వద్దకు వెళ్లిన కలెక్టర్‌ అనురాగ్‌ జయంతి చిన్నోడా.. భోజనం బాగుందా..? అని ప్రశ్నించారు. రోజు ఏఏ రకాల వంటలు వడ్డిస్తున్నారని తెలుసుకున్నారు. సారూ భోజనం మంచిగుంది.. అని విద్యార్థులు కలెక్టర్‌కు వివరించారు. పెద్దాయ్యాక ఏం అవుతారంటూ ప్రశ్నించడంతో కలెక్టర్‌ను అవుతామని పిల్లలు సమాధానమిచ్చారు. దాంతో కలెక్టర్‌ శభాష్‌ అంటూ అభినందించారు.

- ‘కంటి వెలుగు’ను పకడ్బందీగా నిర్వహించాలి

దుమాలలోని గ్రామపంచాయతీ కార్యాలయం ఆవరణలో ఏర్పాటు చేసిన ‘కంటి వెలుగు’ శిబిరాన్ని కలెక్టర్‌ అనురాగ్‌ జయంతి తనిఖీ చేశారు. ఎంత మందికి కంటి పరీక్షలు నిర్వహించారని వైద్య సిబ్బందిని ప్రశ్నించారు. ఏమైన సమస్యలున్నాయా..? అని ఆరా తీశారు. కంటి పరీక్షలను పకడ్బందీగా నిర్వహించి ట్యాబ్‌ ఎంట్రీ ప్రక్రియను తప్పులు దొర్లకుండా చేపట్టాలని ఆదేశించారు. అద్దాలు పంపిణీ చేసే క్రమంలో ఫొటోలు తీసి యాప్‌లో అప్‌లోడ్‌ చేయాలని వైద్య సిబ్బందికి సూచించారు. కార్యక్రమంలో డీఈవో రమేశ్‌కుమార్‌, జిల్లా వైద్యాధికారి సుమన్‌మోహన్‌రావు, ఎంపీడీవో చిరంజీవి, పీఆర్‌ డీఈ శ్రీనివాస్‌, ఎంఈవో రఘుపతి, సర్పంచ్‌ రజిత, అధికారులు పాల్గొన్నారు.

Updated Date - 2023-03-10T00:53:17+05:30 IST

సంబంధం కోసం వెతుకుతున్నారా? తెలుగు మాట్రిమోని లో - రిజిస్ట్రేషన్ ఉచితం!
Advertising
Advertising