ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

వేములవాడ రాజన్న ఆలయం ముస్తాబు

ABN, First Publish Date - 2023-02-17T01:10:56+05:30

వేములవాడ శ్రీరాజరాజేశ్వరస్వామివారి దేవస్థానం మహాశివరాత్రి జాతర మహోత్సవాలకు ముస్తాబైంది.

అన్నపూర్ణ మ్యారేజెస్... వరల్డ్ వైడ్‌గా తెలుగువారు ఎక్కడున్నా అన్ని కులముల వారికీ పెళ్లి సంబంధాలు కుదర్చడంలో టాప్ పొజిషన్. ఉన్నతమైన కుటుంబాల ఎంపిక. సం|| 9397 9797 50

వేములవాడ, ఫిబ్రవరి 16: వేములవాడ శ్రీరాజరాజేశ్వరస్వామివారి దేవస్థానం మహాశివరాత్రి జాతర మహోత్సవాలకు ముస్తాబైంది. ఈ నెల 17వ తేదీ శుక్రవారం నుంచి 19వ తేదీ ఆదివారం వరకు మూడు రోజుల పాటు జరుగనున్న ఈ మహాజాతర కోసం సుమారు 3 కోట్ల 75 లక్షల రూపాయల అంచనా వ్యయంతో భారీ ఏర్పాట్లు చేశారు. జాతర సమన్వయ కమిటీ అధ్యక్షుడు, కలెక్టర్‌ అనురాగ్‌ జయంతి నేతృత్వంలో నిర్వహించిన సమావేశం సందర్భంగా తీసుకున్న నిర్ణయాలకు అనుగుణంగా యాత్రీకుల సౌకర్యార్థం ఆలయ అధికారులు విస్తృతస్థాయిలో ఏర్పాట్లు చేశారు. రాష్ట్ర ఐటీ, పరిశ్రమల శాఖ మంత్రి కేటీఆర్‌ సైతం మహాశివరాత్రి జాతర ఏర్పాట్లను సమీక్షించి పలు సూచనలు చేశారు. రాష్ట్ర దేవాదాయ శాఖ కమిషనర్‌ వి.అనిల్‌కుమార్‌ సైతం రెండు సార్లు ఏర్పాట్లు పరిశీలించారు. జిల్లా స్థానిక సంస్థల అదనపు కలెక్టర్‌ సత్యప్రసాద్‌ , ఆలయ ఈవో డి.కృష్ణప్రసాద్‌ నేతృత్వంలో ఆలయ ఇంజనీరింగ్‌ విభాగంతో పాటు వివిధ విభాగాల అధికారులు తమ పరిధిలోని ఏర్పాట్లు పర్యవేక్షిస్తున్నారు. మహాశివరాత్రి జాతర ఉత్సవాల కోసం ఇప్పటికే జిల్లా కలెక్టర్‌ అనురాగ్‌ జయంతి ఇప్పటికే పలుమార్లు సమీక్ష సమావేశం నిర్వహించడంతో పాటు ఏర్పాట్లను స్వయంగా పరిశీలించారు. ఈ మేరకు ఆలయ అధికారులతో పాటు రెవెన్యూ, మున్సిపల్‌, పోలీసు, పంచాయతీరాజ్‌, గ్రామీణ నీటి సరఫరా విభాగం, సెస్‌, ఆర్‌అండ్‌బీ, వైద్య ఆరోగ్య శాఖ, ఆర్టీసీ, ఎక్సైజ్‌, అగ్నిమాపక విభాగం తదితర శాఖల అధికారులు ఏర్పాట్లలో పాలుపంచుకున్నారు.

ఉత్సవాల ఏర్పాట్లపై క్షేత్రస్థాయిలో పరిశీలన

జాతర ఉత్సవాల ఏర్పాట్లపై జిల్లా అధికారులు ఎప్పటికప్పుడు క్షేత్రస్థాయిలో పరిశీలించి తగు చర్యలు తీసుకుంటున్నారు. వివిధ విభాగాలకు ప్రత్యేక అధికారులను నియమించి ప్రాంతాలు, అంశాల వారీగా బాధ్యతలు కేటాయించారు. ఇందులో భాగంగా శ్రీరాజరాజేశ్వరస్వామివారి ఆలయంతో పాటు అనుబంధ ఆలయాలకు రంగులు వే సి రంగు రంగుల విద్యుద్దీపాలతో అందంగా అలంకరించారు. యాత్రీకులకు వసతి సౌకర్యం, తాగునీటి సరఫరా, పారిశుధ్య నిర్వహణ, క్యూలైన్ల క్రమబద్దీకరణ, వాహనాల పార్కింగ్‌, బందోబస్తు తదితర ఏర్పాట్లు పూర్తయ్యాయి. క్యూలైన్లు, ఆర్జిత సేవలు, ప్రసాదాల కౌంటర్ల దారి తెలుపుతూ బోర్డులు పెట్టారు. క్యూలైన్లను క్రమబద్దీకరించడంతో పాటు క్యూలైన్లలో తాగునీటి సౌకర్యం ఏర్పాటు చేశారు. ఆలయ ఆవరణ, పరిసర బహిరంగ ప్రదేశాలలో చలువ పందిళ్లు ఏర్పాటు చేశారు. జాతర కోసం వచ్చే భక్తుల ర ద్దీని దృష్టిలో ఉంచుకుని నాలుగు లక్షలకు పైగా లడ్డూలను సిద్ధం చేశారు. భక్తుల కోసం మంచినీటి ప్యాకెట్లు, మజ్జిగ ప్యాకెట్లు సిద్ధం చేశారు.

యాత్రీకుల కోసం ప్రత్యేక ఆర్టీసీ బస్సులు

వివిధ ప్రాంతాల నుంచి భక్తులు వేములవాడకు చేరుకోవడానికి వీలుగా ఆర్టీసీ సంస్థ హైదరాబాద్‌, వరంగల్‌, నర్సంపేట, కోరుట్ల మెట్‌పల్లి, ఆర్మూర్‌, నిర్మల్‌, నిజామాబాద్‌, కామారెడ్డి, జగిత్యాల, కొండగట్టు తదితర ప్రాంతాల నుంచి మూడు రోజుల పాటు ప్రత్యేక బస్సులు నడిపిస్తున్నారు. సానిటేషన్‌ నిర్వహణ కోసం పట్టణాన్ని ఏడు జోన్లుగా విభజించి మూడు రోజుల పాటు మూడు షిఫ్ట్‌లలో 24 గంటలు పారిశుధ్య కార్యక్రమాలు చేపట్టనున్నారు. ఇందుకోసం ప్రతి జోనుకు పారిశుధ్య సిబ్బంది, ట్రాక్టర్‌తో పాటు పర్యవేక్షణ అధికారిని నియమించారు. భక్తులు సంచరించే ప్రాంతాలలో తాత్కాలిక మరుగుదొడ్లను సిద్ధం చేశారు. ఇదిలా ఉండగా, మహాశివరాత్రి జాతర శివార్చన కార్యక్రమాన్ని ఘనంగా నిర్వహించేందుకు ఏర్పాట్లు చేశారు. రాష్ట్ర భాషా సాంస్కృతిక విభాగం ఆధ్వర్యంలో ఆలయ గుడి చెరువు మైదానంలో సుమారు 50 లక్షల వ్యయంతో శివార్చన పేరిట సాంస్కృతిక కార్యక్రమం నిర్వహించనున్నారు.

అదనపు బలగాలతో పోలీసు బందోబస్తు

వేములవాడ మహాశివరాత్రి ఉత్సవాల బందోబస్తు కోసం అదనపు పోలీసు బలగాలను రప్పించారు. జాతర బందోబస్తు ఏర్పాట్లను జిల్లా ఎస్పీ అఖిల్‌ మహాజన్‌ పర్యవేక్షిస్తున్నారు. ఈ మేరకు. అదనపు ఎస్పీ చంద్రయ్య, స్థానిక డీఎస్పీ కే.నాగేంద్రచారి, పట్టణ సీఐ ఓ.వెంకటేశ్‌ బందోబస్తు చర్యలు చేపట్టారు. జాతరలో అణువణువూ పరీక్షించడానికి ఈ సారి కొత్తగా కెమెరాలను బిగించడంతో పాటు అద్దె ప్రాతిపదికన మరిన్ని కెమెరాలను ఏర్పాటు చేశారు. ప్రత్యేక మొబైల్‌ బృందాలు, డాగ్‌ స్క్వాడ్‌, బాంబ్‌ డిస్పోజల్‌ స్క్వాడ్‌ను రంగంలోకి దింపుతున్నారు. మూడు అగ్నిమాపక వాహనాలు, ఫైర్‌ డిస్టింగిషర్లు అందుబాటులోకి తీసుకువచ్చారు.

వైద్యసేవల కోసం ప్రత్యేక సిబ్బంది

మహాశివరాత్రి జాతర సందర్భంగా అస్వస్థతకు గురైన యాత్రీకులకు తక్షణమే వైద్య సేవలు అందిచండానికి జిల్లా వైద్య ఆరోగ్య శాఖ ఆధ్వర్యంలో పలు చోట్ల ఆరోగ్య కేంద్రాలను ఏర్పాటు చేశారు. తిప్పాపూర్‌ బస్టాండ్‌, జగిత్యాల బస్టాండ్‌, ఆలయ ప్రధాన ద్వారంతో పాటు భక్తులు బస చేసే బహిరంగ ప్రదేశాలలో ఆరోగ్య కేంద్రాలను ఏర్పాటు చేశారు. అనుభవజ్ఞులైన వైద్యులతో పాటు ఆరోగ్య సిబ్బంది మూడు రోజులు 24 గంటల పాటు అందుబాటులో ఉండి యాత్రీకులకు ఉచితంగా వైద్యసేవలు, మందులు అందజేస్తారు. జాతర సందర్భంగా మూడు అంబు లెన్సులు, అదనంగా 108, 104 వాహనాలు, బైక్‌ అంబులెన్సులను సిద్ధం చేశారు.

పార్కింగ్‌ ఏర్పాట్లు

జాతరకు వచ్చే భక్తులు తమ వాహనాలను నిలపడానికి వీలుగా ఎనిమిది చోట్ల పార్కింగ్‌ స్థలాలను ఏర్పాటు చేశారు. గుడి చెరువులోని ప్రస్తుత పార్కింగ్‌ స్థలంలో వంద వాహనాల సామర్థ్యంతో వీవీఐపీల పార్కింగ్‌ స్థలం, 300 వాహనాల సామర్థ్యంతో వీఐపీ పార్కింగ్‌ స్థలం ఏర్పాటు చేశారు. విధి నిర్వహణలో ఉన్న ఉద్యోగులు, మీడియా ప్రతినిధుల వాహనాల కోసం ప్రత్యేక పార్కింగ్‌ స్థలాలు ఏర్పాటు చేశారు. మొత్తం ఎనిమిది సెక్టార్లుగా పార్కింగ్‌ స్థలాలు సిద్ధం చేశారు.

నేటి నుంచి నిరంతర దర్శనం

వేములవాడలో మహాశివరాత్రి ఉత్సవాల సందర్భంగా మాఘ బహుళ త్రయోదశి రోజున నిర్వహించే మహాశివరాత్రి ఉత్సవాలలో భాగంగా ఫిబ్రవరి 18వ తేదీ శనివారం సాయంత్రం గం.6-05 నుంచి రాత్రి గం. 8-25 వరకు శ్రీస్వామివారికి మహాలింగార్చన అత్యంత ఘనంగా నిర్వహిస్తారు. రాత్రి 11-35గంటల నుంచి లింగోద్భవ సమయంలో సుమారు మూడున్నర గంటల పాటు మహాన్యాస పూర్వక ఏకాదశ రుద్రాభిషేకం నిర్వహిస్తారు. మహాశివరాత్రి సందర్భంగా 17వ తేదీ శుక్రవారం రాత్రి తొమ్మిది గంటల అనంతరం నిశిపూజ గావించి లఘుదర్శనం ప్రారంభిస్తారు. అర్థరాత్రి 12 గంటల నుంచి 18వ తేదీ శనివారం తెల్లవారుజామున 3-30 గంటల వరకు పురజనులకు సర్వదర్శనంకు అనుమతిస్తారు. అనంతరం ఆలయ శుద్ధి, మంగళవాయిద్యాల అనంతరం సుప్రభాతం, తదుపరి ప్రాతఃకాల పూజ అనంతరం ఆలయ అనువంశిక అర్చకులకు దర్శనానికి అనుమతిస్తారు. ఉదయం 7 గంటలకు టీటీడీ వారి పట్టువస్త్రాల సమర్పణ, 8 గంటలకు రాష్ట్ర ప్రభుత్వం తరుపున మంత్రుల చేతుల మీదుగా శ్రీస్వామివారికి పట్టువస్త్రాల సమర్పణ ఉంటాయి. సాయంత్రం 4 గంటలు శివదీక్ష స్వాములకు దర్శనంకు అనుమతిస్తారు. మహాశివరాత్రి జాతర ఉత్సవాల సందర్భంగా శ్రీస్వామివారి కోడెమొక్కుబడి మూడు రోజుల పాటు నిరంతరం కొనసాగుతుంది. జాతర ఉత్సవాల సందర్భంగా మూడు రోజుల పాటు సర్వదర్శనం, కోడెమొక్కు మినహా మిగతా అన్ని రకాల ఆర్జితసేవలు రద్దు చేశారు. శ్రీస్వామివారి దర్శనం కోసం వచ్చే భక్తులకు ఇబ్బందులు కలగకుండా దర్శనం త్వరితగతిన కలగడానికి వీలుగా అభిషేకం, అన్నపూజ, కుంకుమపూజ తదితర ఆర్జిత సేవలను మూడు రోజులపాటు రద్దు చేశారు.

జాతర కోసం విస్తృత ఏర్పాట్లు

- డి.కృష్ణప్రసాద్‌, ఆలయ ఈవో

మూడు రోజుల మహాశివరాత్రి జాతర ఉత్సవాల కోసం విస్తృత ఏర్పాట్లు చేశాం. జాతరకు వచ్చే భక్త్తులు ప్రశాంతంగా శ్రీస్వామివారిని దర్శించుకుని సంతృప్తితో తిరిగివెళ్లే విధంగా ఎలాంటి లోటు రాకుండా ఏర్పాట్లు చేపట్టాం. మూడు రోజుల పాటు జరిగే ఉత్సవాల కోసం క్యూలైన్ల క్రమబద్ధీకరణ, రంగులు, లైటింగ్‌, పందిళ్ల ఏర్పాటు, తాత్కాలిక మరుగుదొడ్లు, తాగునీటి సౌకర్యం, రవాణా తదితర వంటి వాటిపై దృష్టి సారించి పనులు పూర్తి చేశాం. భక్తులు జాతర ఉత్సవాలలో పాల్గొని శ్రీస్వామివారిని దర్శించుకుని తరించాలి.

Updated Date - 2023-02-17T01:10:59+05:30 IST

సంబంధం కోసం వెతుకుతున్నారా? తెలుగు మాట్రిమోని లో - రిజిస్ట్రేషన్ ఉచితం!
Advertising
Advertising