ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

నిరీక్షణకు తెరపడేనా?

ABN, First Publish Date - 2023-06-09T01:23:06+05:30

గొల్ల కుర్మల సంక్షేమం, ఆర్థికాభివృద్ధి నేపధ్యంలో మొదలైన గొర్రెల పంపిణీ పథకం ఐదేళ్ల తరువాత తెలంగాణ దశాబ్ది ఉత్సవాల్లో మరోసారి కదలిక వచ్చింది.

అన్నపూర్ణ మ్యారేజెస్... వరల్డ్ వైడ్‌గా తెలుగువారు ఎక్కడున్నా అన్ని కులముల వారికీ పెళ్లి సంబంధాలు కుదర్చడంలో టాప్ పొజిషన్. ఉన్నతమైన కుటుంబాల ఎంపిక. సం|| 9397 9797 50

(ఆంధ్రజ్యోతి సిరిసిల్ల)

గొల్ల కుర్మల సంక్షేమం, ఆర్థికాభివృద్ధి నేపధ్యంలో మొదలైన గొర్రెల పంపిణీ పథకం ఐదేళ్ల తరువాత తెలంగాణ దశాబ్ది ఉత్సవాల్లో మరోసారి కదలిక వచ్చింది. ఎన్నికల యేడాది కావడంతో రెండో విడత గొర్రెల పంపిణీకి ప్రభుత్వం మళ్లీ కసరత్తు ప్రారంభించింది. పంపిణీ కోసం ఇప్పటికే కమిటీలు వేయడంతో పాటు రాజన్న సిరిసిల్ల జిల్లాకు అనంతపూర్‌ జిల్లా, కర్ణాటక రాష్ట్రం నుంచి గొర్రెలను తీసుకవచ్చే విధంగా నిర్ణయించారు. దశాబ్ది ఉత్సవాల్లో శుక్రవారం పంపిణీ చేసే విధంగా జిల్లాకు చెందిన పశుసంవర్థక శాఖ అధికారులు, డాక్టర్లు, ఇతర జిల్లా అధికారుల బృందం అనంతపూర్‌కు వెళ్లి గొర్రెలను కొనుగోలు చేశారు. గొర్రెల లభ్యత లేకపోవడంతో రాజన్న సిరిసిల్ల జిల్లాలోని సిరిసిల్ల, వేములవాడ నియోజకవర్గకేంద్రాల్లో ఒక్కో నియోజకవర్గానికి 24 యూనిట్లను మాత్రమే కేటాయించారు. ఇందులో ప్రస్తుతం ఆరు యూనిట్ల చొప్పున రెండు నియోజకవర్గాల్లో పంపిణీకి ఏర్పాట్లు చేశారు. ఇందుకు సంబంధించిన ఏర్పాట్లు చేశారు. 2018లోనే రాజన్న సిరిసిల్ల జిల్లా కేంద్రంలో మంత్రులు కే తారకరామారావు, తలసాని శ్రీనివాసయాదవ్‌ రెండోవిడత గొర్రెల పంపిణీని ప్రారంభించినా యూనిట్లను మాత్రం అందించలేకపోయారు. ఈసారి కూడా దశాబ్ది ఉత్సవాల తరువాతనే గొర్రెల పంపిణీపై స్పష్టత వస్తుందని తెలుస్తోంది. లబ్ధిదారులు మాత్రం ఈసారైనా తమ నిరీక్షణకు తెరపడుతుందా... ఎదురుచూపులే మిగులుతాయా అని గొల్లకుర్మలు అయోమయంలో ఉన్నారు.

- రెండో విడత 4,520 యూనిట్లు పెండింగ్‌..

ఎంతో ఆర్భాటంగా 2017లో పథకాన్ని ప్రారంభించి మొదటి విడత గొర్రెల పంపిణీలో హడావుడి చేసి రెండో విడతను ప్రారంభించి ఎదురు చూపులను మిగిల్చిందనే విమర్శలు ఉన్నాయి. పథకం ప్రారంభించి ఐదేళ్లు గడిచిపోతున్నా రాజన్నసిరిసిల్ల జిల్లాలో గొర్రెల పంపిణీ ముందుకు సాగని వైనంగా మారింది. ప్రస్తుతం మళ్లీ ప్రభుత్వం రెండో విడత పంపిణీకి హడావుడి మొదలు పెట్టింది. జిల్లాలో 255 గ్రామపంచాయతీల పరిధిలో 190 సొసైటీలు ఉన్నాయి. జిల్లాలో రెండు విడతలు కలిపి 16,162 యూనిట్లను అందించే లక్ష్యంగా పెట్టుకోగా ఇప్పటివరకు 11,542 యూనిట్లను అందించారు. మొదటి విడతలో 8,137 యూనిట్ల లక్ష్యానికి 7,517 యూనిట్లు, రెండో విడతలో 8,025 యూనిట్ల పంపిణీ లక్ష్యం కాగా 4,125 పంపిణీ చేశారు. ఇందులో ఇప్పటి వరకు 4,520 యూనిట్లు పంపిణీ చేయాల్సి ఉంది. ప్రాథమిక గొర్రెల పంపిణీ అభివృద్ధి పథకం సబ్సిడీ గొర్రెల యూనిట్లకు ఎంపికైన వారిలో 1200 మంది లబ్ధిదారులు తమ వాటాఽధనాన్ని చెల్లించారు.

- 75 శాతం రాయితీ...

గొర్రెల పంపిణీలో యూనిట్‌ ధరను ప్రభుత్వం పెంచింది. 75 శాతం లబ్ధిదారుడికి రాయితీ లభించనుంది. 25 శాతం డీడీ రూపంలో వాటాధనం చెల్లించాల్సి ఉంటుంది. గతంలోనే జిల్లాలో 190 సొసైటీల్లో 18 సంవత్సరాలు నిండిన గొల్ల కుర్మలను సభ్యులుగా చేర్చుకొని డ్రా పద్ధతి ద్వారా లబ్ధిదారులను ఎంపిక చేశారు. గతంలో ఒక యూనిట్‌ ధర రూ 1.25 లక్షలు ఉండగా ఇందులో 75 శాతం సబ్సిడీ 25 శాతం లబ్ధిదారుడి వాటా కింద చెల్లించారు. ప్రస్తుతం యూనిట్‌ ధరను పెంచారు. 50 వేల రూపాయల వరకు పెంచి 1.75 లక్షల రూపాయలు చేశారు. ఇందులో లబ్ధిదారుడి వాటా 25 శాతం కింద 43,750 రూపాయలు చెల్లించాల్సి ఉంటుంది.

- పకడ్బందీగా పంపిణీ జరిగేనా...

జిల్లాలో మొదటి విడతలో అనేక అవకతవకలు గొర్రెల పంపిణీలో చోటు చేసుకున్నాయి. రెండో విడతలోనైనా పంపిణీ పకడ్బందీగా చేసే విఽధంగా అధికారులు ప్రత్యేక దృష్టి పెట్టారు. జియో ట్యాగింగ్‌తో పాటు ప్రతీ గొర్రెకు బీమా సౌకర్యాన్ని కల్పిస్తున్నారు. గొర్రెల కొనుగోలుకు సమీపంలోనే ఉన్న మార్కెట్లను మ్యాపింగ్‌ చేశారు. జిల్లా స్థాయిలో ప్రత్యేక కమిటీలను వేశారు. మొదటి విడతలో రాజన్న సిరిసిల్ల జిల్లాకు కడప నుంచి తీసుకువచ్చిన గొర్రెల యూనిట్లు మళ్లీ రీసైక్లింగ్‌ చేయడం ద్వారా జిల్లా యంత్రాంగం అభాసుపాలయ్యింది. గొర్రెలకు వేసిన ట్యాగ్‌లను సైతం తొలగించి అమ్మివేశారు. ఈ ఘటనలో పశు సంవర్థక శాఖ జిల్లా అధికారి, మండల పశు వైద్యాధికారిని సైతం సస్పెండ్‌ చేశారు. గొర్రెల యూనిట్లను అమ్ముకున్న లబ్ధిదారులపై సైతం కేసులు నమోదు చేశారు. ఈ సారి పారదర్శకంగా లబ్ధిదారులకు యూనిట్లను అందించాలని ప్రత్యేక కమిటీలను కూడా వేశారు.

Updated Date - 2023-06-09T01:23:06+05:30 IST

సంబంధం కోసం వెతుకుతున్నారా? తెలుగు మాట్రిమోని లో - రిజిస్ట్రేషన్ ఉచితం!
Advertising
Advertising