ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

వెబ్ స్టోరీస్+ -

కమ్మనైన వివాహాలు కుదర్చడంలో40 సంవత్సరాల సుదీర్ఘ అనుభవం ఉన్న కాకతీయ మ్యారేజెస్‌లో ఇప్పుడు ప్రీమియం మెంబర్‌షిప్‌ ఉచితం ఫోన్|| 9390 999 999, 7674 86 8080

KCR: కేసీఆర్ హెల్త్ బులెటిన్ విడుదల.. డాక్టర్లు ఏం చెప్పారంటే..

ABN, First Publish Date - 2023-12-08T12:04:01+05:30

మాజీ ముఖ్యమంత్రి కేసీఆర్‌కు సంబంధించిన హెల్త్‌ బులెటిన్‌ను సోమాజీగూడలోని యశోద ఆస్పత్రి వైద్యులు విడుదల చేశారు.

హైదరాబాద్: మాజీ ముఖ్యమంత్రి కేసీఆర్‌ ఆరోగ్యానికి సంబంధించిన హెల్త్‌ బులెటిన్‌ను సోమాజీగూడలోని యశోద ఆస్పత్రి వైద్యులు విడుదల చేశారు. ఎడమ కాలి తుంటి మార్పిడి చేయాలని డాక్టర్లు ప్రకటించారు. కేసీఆర్‌కు సిటీ స్కాన్ చేసి ఎడమ తుంటి విరిగినట్టు వైద్యులు గుర్తించారు. సాయంత్రం 4 గంటలకు సర్జరీ చేయనున్నట్లు పేర్కొన్నారు. దీంతో కేసీఆర్ 8 వారాల పాటు విశ్రాంతి తీసుకోవాలని డాక్టర్లు సూచించారు. ప్రస్తుతం కేసీఆర్‌ ఆరోగ్య పరిస్థితి నిలకడగా ఉందని.. వైద్యుల పర్యవేక్షణలో ఉన్నట్లు తెలిపారు.

గురువారం రాత్రి బాత్రూంలో కేసీఆర్ కాలు జారి పడిపోడంతో ఆయనకు గాయమైంది. దీంతో హుటాహుటిన యశోద ఆస్పత్రికి తరలించి చికిత్స అందించారు.


కేటీఆర్ ట్వీట్

ఇక ఇదే అంశంపై మాజీ మంత్రి, కేసీఆర్ తనయుడు స్పందించారు. బాత్రూంలో పడిపోవడంతో కేసీఆర్‌కు గాయమైందని తెలిపారు. కేసీఆర్ త్వరగా కోలుకోవాలని ప్రార్థిస్తున్న వారందరికీ ధన్యవాదాలు చెప్పారు.

అలాగే యశోద ఆస్పత్రిలో కేసీఆర్‌ను మాజీ మంత్రి హరీశ్‌రావు, ఎమ్మెల్సీ కవిత, బీఆర్ఎస్ ఎమ్మెల్యేలు, పార్టీ శ్రేణులు పరామర్శించారు. ఆరోగ్యంపై వైద్యులను అడిగి తెలుసుకున్నారు.

సీఎం రేవంత్‌రెడ్డి ఆరా

కేసీఆర్ ఆరోగ్యంపై సీఎం రేవంత్‌రెడ్డి ఆరా తీశారు. కేసీఆర్ ఆరోగ్యంపై ఎప్పటికప్పుడు వివరాలు అందజేయాలని ఉన్నతాధికారులకు సీఎం సూచించారు. కేసీఆర్‌ ఆరోగ్య పరిస్థితిని పర్యవేక్షించాలని వైద్య ఆరోగ్యశాఖ కార్యదర్శి రిజ్వీకి ఆదేశించారు.

Updated Date - 2023-12-08T12:18:36+05:30 IST

సంబంధం కోసం వెతుకుతున్నారా? తెలుగు మాట్రిమోని లో - రిజిస్ట్రేషన్ ఉచితం!
Advertising
Advertising