మహిళల సంక్షేమం, అభివృద్ధికి కేసీఆర్ పెద్దపీట
ABN, First Publish Date - 2023-03-12T00:20:03+05:30
మ హిళల సంక్షే మం, అభివృద్ధే లక్ష్యంగా సీఎం కేసీఆర్ జనరంజకమైన పాలన ను సాగిస్తూ ముందడుగు వే స్తున్నారని ఎ మ్మెల్యే భూపాల్‌రెడ్డి అన్నారు.
మహిళల సంక్షేమం, అభివృద్ధికి కేసీఆర్ పెద్దపీట
ఎమ్మెల్యే కంచర్ల భూపాల్‌రెడ్డి
నల్లగొండ, మార్చి 11: మ హిళల సంక్షే మం, అభివృద్ధే లక్ష్యంగా సీఎం కేసీఆర్ జనరంజకమైన పాలన ను సాగిస్తూ ముందడుగు వే స్తున్నారని ఎ మ్మెల్యే భూపాల్‌రెడ్డి అన్నారు. శనివారం క్యాంపు కార్యాలయంలో నల్లగొండ పట్టణం, మండలంలోని 68 మందికి, తిప్పర్తి మండలానికి చెందిన 38మందికి, మాడ్గులపల్లికి చెందిన 19 మందికి కల్యాణలక్ష్మి, షాదీముబారక్ చెక్కులను పంపిణీ చేశారు. ఈ సందర్భంగా ఎమ్మెల్యే భూపాల్‌రెడ్డి మాట్లాడుతూ ప్రభుత్వం అమలు చేస్తు న్న పథకాలు ప్రతి ఇంటికి చేరుతున్నాయని అన్నారు. నల్లగొండను రాష్ట్రంలోనే ఆదర్శ నియోజకవర్గంగా తీర్చిదిద్దేందుకు కృషి చేస్తున్నట్లు తెలిపారు. అనంతరం తిప్పర్తి మండలంలోని పలువురు లబ్ధిదారులకు ఇళ్ల స్థలాల పట్టాలను పంపిణీ చేశారు. కార్యక్రమంలో మునిసిపల్ చైర్మన మందడి సైదిరెడ్డి, గ్రంథాలయ సంస్థ చైర్మన రేగట్టె మల్లికార్జునరెడ్డి, వైస్ చైర్మన అబ్బగోని రమేష్, చీర పంకజ్‌యాదవ్, అభిమన్యు శ్రీనివాస్, ఖయ్యూంబేగ్ తదితరులు పాల్గొన్నారు.
Updated Date - 2023-03-12T00:20:03+05:30 IST