ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

వెబ్ స్టోరీస్+ -

కమ్మనైన వివాహాలు కుదర్చడంలో40 సంవత్సరాల సుదీర్ఘ అనుభవం ఉన్న కాకతీయ మ్యారేజెస్‌లో ఇప్పుడు ప్రీమియం మెంబర్‌షిప్‌ ఉచితం ఫోన్|| 9390 999 999, 7674 86 8080

కేసీఆర్‌కు పలువురు నేతల పరామర్శ

ABN, Publish Date - Dec 14 , 2023 | 04:01 AM

తుంటి మార్పిడి చేయించుకుని సోమాజిగూడ యశోద ఆస్పత్రిలో చికిత్స పొందుతున్న బీఆర్‌ఎస్‌ అధినేత, మాజీ ముఖ్యమంత్రి కేసీఆర్‌ను బుధవారం పలువురు నేతలు పరామర్శించారు.

రేపు డిశ్చార్జి కానున్న మాజీ సీఎం

ఆస్పత్రి నుంచి నందినగర్‌ ఇంటికి..!

హైదరాబాద్‌ సిటీ, డిసెంబరు 13 (ఆంధ్రజ్యోతి): తుంటి మార్పిడి చేయించుకుని సోమాజిగూడ యశోద ఆస్పత్రిలో చికిత్స పొందుతున్న బీఆర్‌ఎస్‌ అధినేత, మాజీ ముఖ్యమంత్రి కేసీఆర్‌ను బుధవారం పలువురు నేతలు పరామర్శించారు. మంత్రి తుమ్మల నాగేశ్వర్‌రావు, కాంగ్రెస్‌ నేత రేణుకా చౌదరి, మాజీ మంత్రులు జగదీశ్‌రెడ్డి, కొప్పుల ఈశ్వర్‌, లక్ష్మారెడ్డి ఎమ్మెల్యేలు కౌశిక్‌రెడ్డి, యాదయ్య, నరేందర్‌, బీఆర్‌ఎస్‌ నేత దాసోజు శ్రవణ్‌ తదితరులు ఆస్పత్రికి వచ్చి కేసీఆర్‌ను పరామర్శించారు. ఆయన త్వరగా కొలుకోవాలని వారు ఆకాక్షించారు. కాగా, ఆరు రోజులుగా ఆస్పత్రిలో చికిత్స పొందుతున్న కేసీఆర్‌ను శుక్రవారం డిశ్చార్జి చేయడానికి ఆస్పత్రి వర్గాలు సన్నాహాలు చేస్తున్నట్లు సమాచారం. తుంటి మార్పిడి విజయవంతం కావడం, మరుసటి రోజునే ఆయన వాకర్‌ సాయంతో నడవడం, ఆరోగ్యం కుదుటపడడంతో డిశ్చార్జి చేయాలని వైద్యులు నిర్ణయం తీసుకున్నారు. డిశ్చార్జి తర్వాత కేసీఆర్‌ హైదరాబాద్‌ నందినగర్‌లోని తన పాత ఇంటికి వెళ్లే అవకాశాలున్నట్లు సమాచారం. ఆ ఇంట్లో కేసీఆర్‌ ఉండడానికి అవసరమైన ఏర్పాట్లు చేస్తున్నట్లు తెలిసింది. వైద్య సేవల కోసం తరచూ ఆస్పత్రికి వెళ్లేందుకు ఇబ్బంది కలగకుండా దగ్గరగా ఉన్న నందినగర్‌లోని ఇంట్లోనే ఉండాలని కేసీఆర్‌ నిర్ణయించుకున్నట్లు సమాచారం.

Updated Date - Dec 14 , 2023 | 04:01 AM

సంబంధం కోసం వెతుకుతున్నారా? తెలుగు మాట్రిమోని లో - రిజిస్ట్రేషన్ ఉచితం!
Advertising
Advertising