Earthquakes: మణుగూరులో మరోసారి స్వల్ప భూప్రకంపనలు
ABN, First Publish Date - 2023-08-25T07:06:51+05:30
భద్రాద్రి కొత్తగూడెం జిల్లా: మణుగూరులో మరోసారి శుక్రవారం తెల్లవారుజాము 4.43 గంటలకు స్వల్ప భూప్రకంపనలు వచ్చాయి. ఒక్కసారిగా గృహాలు ఊగాయి. దీంతో ప్రజలు నిద్రలో ఉలిక్కిపడ్డారు.
భద్రాద్రి కొత్తగూడెం జిల్లా: మణుగూరు (Manuguru)లో మరోసారి శుక్రవారం తెల్లవారుజాము 4.43 గంటలకు స్వల్ప భూప్రకంపనలు (Earthquakes) వచ్చాయి. ఒక్కసారిగా గృహాలు ఊగాయి. దీంతో ప్రజలు నిద్రలో ఉలిక్కిపడ్డారు. భయాందోళనలతో రోడ్డుపైకి పరుగులు తీశారు. అయితే ఎలాంటి ఆస్తి, ప్రాణనష్టం జరగలేదని సమాచారం. పూర్తి సమాచారం తెలియాల్సి ఉంది.
కాగా ఐదు రోజుల క్రితం మణుగూరు మండలంలో శనివారం సాయంత్రం స్వల్ప భూప్రకంపనలు వచ్చాయి. ఈ విషయాన్ని స్వయంగా అనుభూతి చెందిన స్థానిక ప్రజలు ‘ఆంధ్రజ్యోతి’కి తెలిపారు. ఎన్నడూ లేనివిధంగా భూమిలో ప్రకంపలు రావడంతో ఇళ్లలోని సామగ్రి కదలడంతో శబ్దాలు వచ్చాయని పేర్కొన్నారు. మణుగూరు పూజారినగర్ రాజ్‌పేట, కొత్తకొండాపురం, సుందరయ్యనగర్ (Sundarayyanagar), ఆదర్శనగర్ ప్రాంతాల్లోని ప్రజలు భూప్రకంపనలకు గుర్తించారు. స్థానికంగా ఉన్న సింగరేణి(Singareni) బొగ్గు గనుల్లో సహజంగా బ్లాస్టింగ్‌లు మధ్యాహ్నం మూడు గంటల నుంచి 3.30గంటల సమయం వరకు మాత్రమే జరుగుతుంటాయి. అయితే ఈ ప్రకంపనలు సాయంత్రం 4గంటలు దాటిన తర్వాత రావడంతో ప్రజలు భయంతో ఇళ్లనుంచి బయటికి వచ్చారు.
Updated Date - 2023-08-25T07:06:51+05:30 IST