పేటవాసుల ఆకాంక్ష తీర్చిన నేత ఎమ్మెల్యే మెచ్చా

ABN, First Publish Date - 2023-03-10T23:28:25+05:30

నియోజకవర్గకేంద్రమైన అశ్వారావుపేటకు సెంట్రల్‌ లైటింగ్‌ ఏర్పాటుకు నిధులు మంజూరు చేయించి పేట వాసుల చిరకాల కోరిక తీర్చిన గొప్ప నాయకుడు ఎమ్మెల్యే మెచ్చా నాగేశ్వరరావు అని ఎంపీపీ జల్లిపల్లి శ్రీరామమూర్తి అన్నారు.

 పేటవాసుల ఆకాంక్ష తీర్చిన నేత ఎమ్మెల్యే మెచ్చా
పుష్పాభిషేకం చేస్తున్న నాయకులు
అన్నపూర్ణ మ్యారేజెస్... వరల్డ్ వైడ్‌గా తెలుగువారు ఎక్కడున్నా అన్ని కులముల వారికీ పెళ్లి సంబంధాలు కుదర్చడంలో టాప్ పొజిషన్. ప్రవేశం ఉచితం. సం|| 9393 763 666

అశ్వారావుపేట రూరల్‌, మార్చి 10: నియోజకవర్గకేంద్రమైన అశ్వారావుపేటకు సెంట్రల్‌ లైటింగ్‌ ఏర్పాటుకు నిధులు మంజూరు చేయించి పేట వాసుల చిరకాల కోరిక తీర్చిన గొప్ప నాయకుడు ఎమ్మెల్యే మెచ్చా నాగేశ్వరరావు అని ఎంపీపీ జల్లిపల్లి శ్రీరామమూర్తి అన్నారు. అశ్వారావుపేటలో సెంట్రల్‌ లైటింగ్‌, నాలుగ లైన్ల రహదారి ఏర్పాటుకు ప్రభుత్వం రూ.23.50కోట్లను మంజూరు చేస్తూ జీవో ఇచ్చిన నేపధ్యంలో శుక్రవారం పేటలో ఆపార్టీ నాయకులు సంబురాలు ఘనంగా నిర్వహించారు. రాష్ట్రీయ రహదారిపై రింగ్‌రోడ్‌ సెంటర్‌లో తెలంగాణా తల్లి విగ్రహానికి పూలమాలలు వేసిన అనంతరం సీఎం కేసీఆర్‌, ఎమ్మెల్యే మెచ్చా నాగేశ్వరరావు ఫోటోలకు పాలాభిషేకం, పూలాభిషేకం నిర్వహించి బాణసంచా పేల్చారు. ఈసందర్భంగా ఎంపీపీ జల్లిపల్లి శ్రీరామమూర్తి మాట్లాడుతూ ఏప్రభుత్వంలో జరగని అభివృద్ది బీఆర్‌ఎస్‌ ప్రభుత్వంలోనే జరుగుతుందన్నారు. కార్యక్రమంలో నాయకులు తాడేపల్లి రవి, యూఎస్‌.ప్రకాశరావు, కలపాల శ్రీనివాసరావు, బండారు శ్రీనివాసరావు, నార్లపాటి రాములు, సుదర్శన్‌, సంకా ప్రసాద్‌, రఘురామ్‌, యువజన విభాగం నియోజకవర్గ నాయకులు మోటూరి మోహన్‌, రమేశ్‌, సతీశ్‌రెడ్డి, కాంతారావు, బజారయ్య పాల్గొన్నారు.

Updated Date - 2023-03-10T23:28:25+05:30 IST

సంబంధం కోసం వెతుకుతున్నారా? తెలుగు మాట్రిమోని లో - రిజిస్ట్రేషన్ ఉచితం!
Advertising
Advertising