ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

జీళ్లచెరువులో జాతీయస్థాయి ఎద్దుల పందాలు షురూ

ABN, First Publish Date - 2023-03-30T23:48:10+05:30

శ్రీరామనవమి సందర్భంగా కూసుమంచి మండలం జీళ్లచెరువుగ్రామంలో గురువారం జాతీయ స్థాయి ఒంగోలు జాతి ఎద్దుల బండలాగుడు పోటీలు, మహిళల ప్రో కబడ్డీ పోటీలు ప్రారంభమయ్యాయి.

పోటీలను ప్రారంభిస్తున్న ఎమ్మెల్యేలు కందాళ
అన్నపూర్ణ మ్యారేజెస్... వరల్డ్ వైడ్‌గా తెలుగువారు ఎక్కడున్నా అన్ని కులముల వారికీ పెళ్లి సంబంధాలు కుదర్చడంలో టాప్ పొజిషన్. ప్రవేశం ఉచితం. సం|| 9393 763 666

ఎమ్మెల్సీ తాతా మధు, ఎమ్మెల్యే సండ్రతో కలిసి ప్రారంభించిన కందాళ

సంప్రదాయాలను భవిష్యత్‌ తరాలకు అందిస్తామని వెల్లడి

కూసుమంచి, మార్చి 30 : శ్రీరామనవమి సందర్భంగా కూసుమంచి మండలం జీళ్లచెరువుగ్రామంలో గురువారం జాతీయ స్థాయి ఒంగోలు జాతి ఎద్దుల బండలాగుడు పోటీలు, మహిళల ప్రో కబడ్డీ పోటీలు ప్రారంభమయ్యాయి. ఈ పోటీలను ఎమ్మెల్సీ తాతా మధుసూదన్‌, సత్తుపల్లి ఎమ్మెల్యే సండ్ర వెంకటవీరయ్యతో కలిసి పాలేరు ఎమ్మెల్యే కందాళ ఉపేందర్‌రెడ్డి ప్రారంభించారు. ఈ సందర్భంగా కందాళ మాట్లాడుతూ రైతులను ప్రోత్సహించేందుకే గ్రామాల్లో బండలాగుడు ఎద్దుల పోటీలను ఏర్పాటు చేస్తున్నామని, గ్రామీణ క్రీడలకు ప్రాధాన్యమివ్వాలని, కనుమరుగవుతున్న ఎద్దులపోటీలను నిర్వహించడం ద్వారా సంప్రదాయలను భవిష్యత్‌ తరాలకు అందిస్తామని, అదే లక్ష్యంతో ఐదేళ్లుగా ఈపోటీలు నిర్వహిస్తున్నామన్నారు. తెలుగు రాషా్ట్రలకు వన్నెతెచ్చిన ఒంగోలు జాతి పశుసంపద కాపాడుకోవాల్సిన బాధ్యత అందరిపై ఉందన్నారు. ఇక కబడ్డీపోటీలు గ్రామీణస్ధాయినుంచి కార్పొరేట్‌ స్థాయికి వెళ్లాయన్నారు. పోటీల నిర్వాహకుడు, డీసీసీబీ డైరెక్టర్‌ ఇంటూరి శేఖర్‌ మాట్లాడుతూ ఎమ్మెల్యే కందాళ ఉపేందర్‌రెడ్డి సహకారంతో ఈ పోటీలను విజయవంతంగా నిర్వహిస్తున్నామన్నారు. కార్యక్రమంలో జడ్పీటీసీ ఇంటూరి బేబీ, ఖమ్మం రూరల్‌ జడ్పీటీసీ వరప్రసాద్‌, కూసుమంచి ఎంపీపీ బాణోతు శ్రీనివాస్‌, ఆత్మచైర్మన్‌ బాలకృష్ణారెడ్డి, బీఆర్‌ఎస్‌ మండల అధ్యక్షుడు వీరయ్య, ప్రధానకార్యదర్శి ఆసీ్‌ఫపాషా, పలువురు పార్టీ నాయకులు పాల్గొన్నారు. మహిళల ప్రోకబడ్డీ పోటీలకు ఆరు రాషా్ట్రలనుంచి జట్లు రాగా.. ఎమ్మెల్యే కందాళ, ఎమ్మెల్సీ తాతా మధుసూధన్‌ వారితో కబడ్డీ ఆడి ప్రోత్సహించారు.

Updated Date - 2023-03-30T23:48:10+05:30 IST

సంబంధం కోసం వెతుకుతున్నారా? తెలుగు మాట్రిమోని లో - రిజిస్ట్రేషన్ ఉచితం!
Advertising
Advertising