ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

కమ్మనైన వివాహాలు కుదర్చడంలో40 సంవత్సరాల సుదీర్ఘ అనుభవం ఉన్న కాకతీయ మ్యారేజెస్‌లో ఇప్పుడు ప్రీమియం మెంబర్‌షిప్‌ ఉచితం ఫోన్|| 9390 999 999, 7674 86 8080

13 అడుగులకు పాలేరు

ABN, First Publish Date - 2023-07-15T00:23:56+05:30

తాగునీటి అవసరాల కోసం నాగార్జున సాగర్‌ నుంచి ఒక టీఎంసీ నీటిని విడుదల చేసిన నేపథ్యంలో కూసుమంచి మండలంలోని పాలేరు జలాశయ నీటిమట్టం గణనీయంగా పెరుగుతోంది.

నాయకన్‌గూడెం ఇన్‌ఫాల్‌ కెనాల్‌ వద్ద నీటిరాకను పరిశీలిస్తున్న సీఈ
అన్నపూర్ణ మ్యారేజెస్... వరల్డ్ వైడ్‌గా తెలుగువారు ఎక్కడున్నా అన్ని కులముల వారికీ పెళ్లి సంబంధాలు కుదర్చడంలో టాప్ పొజిషన్. ఉన్నతమైన కుటుంబాల ఎంపిక. సం|| 9397 9797 50

సాగర్‌ నీటి రాకతో పెరుగుతున్న నీటిమట్టం

కూసుమంచి, జూలై 14: తాగునీటి అవసరాల కోసం నాగార్జున సాగర్‌ నుంచి ఒక టీఎంసీ నీటిని విడుదల చేసిన నేపథ్యంలో కూసుమంచి మండలంలోని పాలేరు జలాశయ నీటిమట్టం గణనీయంగా పెరుగుతోంది. ఇప్పటి వరకు 10.3 అడుగులున్న నీరు శుక్రవారం రాత్రికి 13 అడుగులకు చేరుకోగా.. ఆ నీటిమట్టం మరింత పెరిగే అవకాశం ఉంది. దీంతో అధికారులు మిషన్‌ భగీరథ ద్వారా తాగునీటిని అందిస్తున్నారు.

ప్రస్తుతం తాగునీటికే సాగర్‌ జలాలు

పరిశీలించిన నీటిపారుదలశాఖ సీఈ శంకర్‌నాయక్‌

పాలేరు జలాశయాన్ని పూర్తిస్థాయిలో సాగర్‌ జలాలతో నింపనున్నట్టు నీటిపారుదలశాఖ చీఫ్‌ ఇంజనీర్‌ శంకర్‌ నాయక్‌ పేర్కొన్నారు. ఈఈ మంగళంపూడి వెంకటేశ్వర్లుతో కలిసి శుక్రవారం ఆయన పాలేరు జలాశయాన్ని, నాయకన్‌గూడెం వద్ద ఇన్‌ఫాల్‌ కెనాల్‌ను పరిశీలించారు. ఈసందర్భంగా విలేకరులతో మాట్లాడుతూ వర్షాభావ పరిస్థితుల నేపథ్యంలో తాగునీటికి ఇబ్బందులు తలెత్తకుండా చర్యలు తీసుకుంటున్నామని, ప్రస్తుతం సూర్యాపేట, నల్గొండ జిల్లాల పరిధిలో సాగర్‌ ఎడమకాల్వపై మరమ్మతులు జరుగుతున్నా.. సీఎం కేసీఆర్‌ ఆదేశాల మేరకు తాగునీటి అవసరాల కోసం సాగర్‌ జలాలు విడుదల చేశారన్నారు. ప్రస్తుతం పాలేరుకు 3000 క్యూసెక్కులు వస్తున్నాయని, ఇది మరింత పెరిగేఅవకాశం ఉందని, ఇక పాలేరు జలాశయంలో 10.3అడుగులున్న నీటిమట్టం ప్రస్తుతం 13అడుగులకు చేరిందన్నారు. వర్షాభావ పరిస్థితుల నేపథ్యంలో నారుమళ్ల కోసం సాగర్‌నీరు విడుదల చేయాలని రైతులనుంచి ఒత్తిడి వస్తోందని, అయినా తాగునీటి అవసరాలకే వినియోగించేలా పటిష్ఠ నిఘా ఏర్పాటు చేశామన్నారు. ఇక పాలేరు పాతకాల్వ పరిధిలో చెరుకు సాగు ఉన్నందున రెండుతడులకు నీరు ఇవ్వాలని రైతులు డిమాండ్‌ చేస్తున్నారని అది సాధ్యం కాదని, రైతులు సహకరించాలన్నారు.

రూ.7.40కోట్లతో 66 పనులు

నాగార్జునసాగర్‌ ఎడమకాల్వ, చెరువుల కింద ఖమ్మం సెక్షన్‌ పరిధిలో రూ.7.40కోట్ల విలువైన 66 పనులు జరుగుతున్నాయని సీఈ శంకర్‌నాయక్‌ తెలిపారు. ప్రస్తుతం మరమ్మతులు ముమ్మరంగా జరుగుతున్నాయని, రైతులకు సాగునీరు ఇచ్చే సమయంలో ఇబ్బందులు కలగకుండా తగిన సమయంలో పనులు పూర్తయ్యేలా చర్యలు తీసుకున్నట్లు తెలిపారు. పాలేరు పాతకాల్వ పనులు, పాలేరు జలాశయ ఫాలింగ్‌ గేట్ల మరమ్మతులు కూడా చురుకుగ్గా సాగుతున్నాయన్నారు. ఆయన వెంట ఈఈ లు మంగళంపూడి వెంకటేశ్వర్లు, అనన్య, డీఈ మధు, ఏఈ రామకృష్ణ, ఇమ్రాన్‌, తదితరులు పాల్గొన్నారు.

Updated Date - 2023-07-15T00:23:56+05:30 IST

సంబంధం కోసం వెతుకుతున్నారా? తెలుగు మాట్రిమోని లో - రిజిస్ట్రేషన్ ఉచితం!
Advertising
Advertising