ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

అకాల నష్టం

ABN, First Publish Date - 2023-03-19T23:26:36+05:30

ఉమ్మడి ఖమ్మం జిల్లాలో శనివారం అర్ధరాత్రి నుంచి ఆదివారం తెల్లవారుజాము వరకు పలుచోట్ల భారీవర్షం కురిసింది గతరెండు రోజులుగా కురుస్తున్న వర్షాలతో జిల్లాలో మొక్కజొన్న, పెసర, మిర్చి తదితర పంటలకు నష్టం వాటిల్లింది. ఆదివారం ఉదయం ఖమ్మం జిల్లావ్యాప్తంగా 33.6మి.మీ వర్షపాతం నమోదుకాగా, సత్తుపల్లిలో అత్యధికంగా 83.0మి.మీ వర్షం కురిసింది.

పినపాక మండలంలో కల్లంలోకి చుట్టూ చేరిన వర్షపు నీటిలో విలపిస్తున్న రైతు
అన్నపూర్ణ మ్యారేజెస్... వరల్డ్ వైడ్‌గా తెలుగువారు ఎక్కడున్నా అన్ని కులముల వారికీ పెళ్లి సంబంధాలు కుదర్చడంలో టాప్ పొజిషన్. ప్రవేశం ఉచితం. సం|| 9393 763 666

జూలూరుపాడు మండలంలో నేలవాలిన మొక్కజొన్న పంట

పాల్వంచ మండలం రేగులగూడెంలో కూలిన మామిడి చెట్లు

చర్ల మండలం తేగడ వద్ద నీటిలో తేలియాడుతున్న మిర్చి

జిన్నేలగూడెంలో గాలివానకు నేలరాలిన మామిడి కాయలను చూపుతున్న రైతు

ఇరు జిల్లాల్లో మళ్లీ గాలివాన బీభత్సం

పిడుగుపాటుతో 1,500కోళ్లు మృత్యువాత

ఆళ్లపల్లి మండలంలో 13దుక్కిటెద్దులు మృతి

పంట నష్ట అంచనాల్లో వ్యవసాయశాఖ

ఖమ్మం (ఆంధ్రజ్యోతి ప్రతినిధి)/కొత్తగూడెం కలెక్టరేట్‌, మార్చి 19: ఉమ్మడి ఖమ్మం జిల్లాలో శనివారం అర్ధరాత్రి నుంచి ఆదివారం తెల్లవారుజాము వరకు పలుచోట్ల భారీవర్షం కురిసింది గతరెండు రోజులుగా కురుస్తున్న వర్షాలతో జిల్లాలో మొక్కజొన్న, పెసర, మిర్చి తదితర పంటలకు నష్టం వాటిల్లింది. ఆదివారం ఉదయం ఖమ్మం జిల్లావ్యాప్తంగా 33.6మి.మీ వర్షపాతం నమోదుకాగా, సత్తుపల్లిలో అత్యధికంగా 83.0మి.మీ వర్షం కురిసింది. జిల్లా వ్యాప్తంగా పలు మండలాల్లో వర్షం కురిసింది. గత రెండు రోజులుగా కురుస్తున్న వర్షాలతో జిల్లాలో సుమారు 19వేల ఎకరాల్లో పంటలు నష్టం జరిగినట్టు వ్యవసాయశాఖ అంచనా వేసింది. మొత్తం 9,200మంది రైతులు నష్టపోయారు. ఇందులో ప్రధానంగా మొక్కజొన్న 18,876 ఎకరాలు నష్టపోగా, పెసర తదితర పంటలు 53 ఎకరాల్లో నష్టపోయినట్టు వ్యవసాయశాఖ అధికారులు అంచనా వేశారు. ఖమ్మం జిల్లాలో ప్రధానంగా కొణిజర్ల, బోనకల్‌, కూసుమంచి, చింతకాని, ముదిగొండ, కామేపల్లి, కారేపల్లి, వైరా, ఏన్కూరు, తల్లాడ, తదితర మండలాల్లో పంటల నష్టం అధికంగా జరిగింది. సత్తుపల్లి, వేంసూరు తదితర మండలాల్లో మామిడిపంటలకు కూడా నష్టం జరిగింది. ఈదురుగాలులకు మామిడి కాయలు నేలరాలాయి. మిర్చి చేలల్లో ఉన్న కాయలు వర్షానికి తడిచి నల్లాబడ్డాయి. కల్లాల్లోని మిర్చికూడా తడిచింది. వర్షానికి తడవడంతో నాణ్యత దెబ్బతిని ధరలు తగ్గే అవకాశం ఉందని రైతులు వాపోతున్నారు. పెనుబల్లి మండలం బయ్యన్నగూడెం గ్రామంలోని ఓ కోళ్లఫాంపై పిడుగు పడడంతో 20రోజుల వయస్సు కలిగిన 1,500కోళ్లు మృత్యువాతపడ్డాయి. దీంతో కోళ్లఫారం యజమాని ఆళ్ల సూర్యనారాయణ లబోదిబోమంటున్నాడు. ఒక్కసారిగా 1,500కోళ్లు మృతిచెందడంతో ఆర్థికంగా తీవ్రంగా నష్టపోయానని, తనను ప్రభుత్వం ఆదుకోవాలని కోరాడు. ఇప్పటి వరకు వ్యవసాయశాఖ ప్రాథమిక అంచనాలు మాత్రమే తయారు చేసింది. పూర్తిస్థాయి నష్టం వివరాలు సేకరించాల్సి ఉంది.

13దుక్కిటెద్దులు మృతి

భద్రాద్రి కొత్తగూడెం జిల్లాలోనూ శనివారం రాత్రి నుంచి ఆదివారం ఉదయం వరకు పలుచోట్ల భారీ వర్షం కుసింది. ఈదురుగాలతో పలుచోట్ల ఇళ్ల పైకపుపలు ఎగిరిపోయాయి. పంటలు నేలకొరిగాయి. పాల్వంచ మండలంలోని బంజర గ్రామానికి చెందిన వ్యక్తి అలకుంట వెంకట్రాములు ఇంటి పైకప్పు ఈదురు గాలులకు ఎగిరిపోయింది. ఇల్లు పూర్తిగా ధ్వంసమైంది. మామిడిగూడెం గ్రామలో మద్దెల సూరయ్య అనే వ్యక్తి ఇంటిపై చెట్టు విరిగిపడి ఇంటిపై రేకులు పూర్తిగా ధ్వంసమయ్యాయి. పిడుగుల వర్షంతో ఆళ్లపల్లి మండలంలోని మూడు గ్రామాల్లో 13 దుక్కిటెద్దులు మృతి చెందాయి. సింగరం గ్రామంలో పాయం లక్ష్మయ్య-3, తొలెం నర్సింహరావు-2, కొమరం రాంబాబు-2, సందింబంధం గ్రామంలో బొమ్మల లక్ష్మయ్య-3, బొమ్మల అంజనేయులు-1, ఈసం సత్యం-1, అడవిరామవరం గ్రామంలో పాయం పుల్లయ్య-1, రైతుల దుక్కిటేద్దులు పిడుగులు పడి మృతి చెందాయి. ఒక్కోదుక్కిటేద్దు విలువ సుమారుగా రూ.25వేల నుంచి రూ.50 వేలకు పైగా ఉంటుందని రైతులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. ఈదురుగాలులకు సుమారు 40ఎకరాల్లో మొక్కజొన్న నేలవాలింది. పలు తోటల్లో మామిడి కాలయలు నెలరాలాయి. భారీవర్షంతో జల్లేరు, కొడెల, తునికిదొన్నేఒర్రె, పాలవాగు, చింతలపడివాగులు ప్రవహించాయి. చితలపడివాగు ప్రవహించడంతో బొడాయికుంట- నడిమిగూడెం మద్య వాగుపై నిర్మిస్తున్న బ్రిడ్జీ దగ్గర కట్టతెగి పునాదుల్లోకి వరద చేరి సుమారు రూ.10లక్షలకుపైగా నష్టం వాటిల్లివచ్చని సంబంధిత నిర్వహకులు అంచనా వేస్తున్నారు. గత మూడు రోజులుగా కురుస్తున్న అకాల వర్షాలకు జిల్లాలో ఉద్యాన, వ్యవసాయ పంటలకు తీవ్రంగా నష్టం వాటిల్లింది. 145ఎకరాల్లో సుమారు రూ.60లక్షల విలువ గల ఉద్యాన పంటలకు నష్టం వాటిల్లింది. 170ఎకరాల్లో మొక్కజొన్న, 10 ఎకారల్లో పొగాకు దెబ్బతిన్నది. 16, 18 తేదీల్లో కురిసిన భారీ వర్షాలకు 10 ఎకాల్లో బొప్పాయి తోటలు దెబ్బతిన్నాయి. ఆశ్వాపురం మండలం తుమ్మలచెరువులో 25 ఎకరాల్లో టమాట తోటలు దెబ్బతిన్నాయి. సుజాతనగర్‌ మండలం సీతంపేటలో 25ఎకరాలు, బూర్గంపాడు మండల లక్ష్మీపురంలో 25ఎకరాలో మిర్చి తోటలు దెబ్బతిన్నాయి. ఇవే కాకుండా పలు పంటలు దెబ్బతిన్నాయి. ఈ మేరకు వ్యవసాయశాఖ ప్రాథమిక అంచనాలను సిద్ధం చేస్తోంది.

Updated Date - 2023-03-19T23:26:36+05:30 IST

సంబంధం కోసం వెతుకుతున్నారా? తెలుగు మాట్రిమోని లో - రిజిస్ట్రేషన్ ఉచితం!
Advertising
Advertising