ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

ఖమ్మం-వరంగల్‌ గ్రీనఫీల్డ్‌ హైవేకు మోక్షం

ABN, First Publish Date - 2023-04-02T00:36:09+05:30

ఖమ్మం జిల్లాకు జాతీయ రహదారులకు మహార్దశ పట్టబోతోంది. ఇప్పటికే ప్రతిపాదనలు సర్వేలు, భూసేకరణ ప్రక్రియ పూర్తికావడంతో కేంద్ర ప్రభుత్వం నిధుల కేటాయింపుతో చకాచకా పనులు పూర్తవుతున్నాయి.

అన్నపూర్ణ మ్యారేజెస్... వరల్డ్ వైడ్‌గా తెలుగువారు ఎక్కడున్నా అన్ని కులముల వారికీ పెళ్లి సంబంధాలు కుదర్చడంలో టాప్ పొజిషన్. ప్రవేశం ఉచితం. సం|| 9393 763 666

రూ.2,235కోట్లు కేటాయిస్తున్నట్లు కేంద్ర మంత్రి వెల్లడి

త్వరలోనే ప్రారంభం కానున్న పనులు

ఖమ్మం, ఏప్రిల్‌ 1(ఆంధ్రజ్యోతి ప్రతినిధి): ఖమ్మం జిల్లాకు జాతీయ రహదారులకు మహార్దశ పట్టబోతోంది. ఇప్పటికే ప్రతిపాదనలు సర్వేలు, భూసేకరణ ప్రక్రియ పూర్తికావడంతో కేంద్ర ప్రభుత్వం నిధుల కేటాయింపుతో చకాచకా పనులు పూర్తవుతున్నాయి. ఖమ్మం-సూర్యాపేట నాలుగు లైన్ల రహదారి పనులు పూర్తయి రాకపోకలు ప్రారంభం కాగా ఇప్పుడు దేవరపల్లి-ఖమ్మం 4లైన్ల రహదారి పనులకు కూడా కొన్ని ప్యాకేజీలు మొదలయ్యాయి. తాజాగా కేంద్రం వరంగల్‌-ఖమ్మం జిల్లాల పరిధిలోని 4లైన్ల రహదారి పనులకోసం రూ.2,235కోట్ల నిధులు కేటాయిస్తున్నట్లు కేంద్ర రహదారులశాఖ మంత్రి నితినగడ్కరీ వెల్లడించారు. దీంతో వరంగల్‌-ఖమ్మం ఎనహెచ-163 రహదారిపై వరంగల్‌ జిల్లా వెంకటాపూర్‌ నుంచి మహబాద్‌జిల్లాలోని తాళ్లసంకీస గ్రామం వరకు 39.410కి.మీ. మేర 4లైన్ల రహదారి నిర్మాణ పనులు గాను రూ.1,111.76కోట్లు కేటాయించారు. ఇదొక ప్యాకేజీ కింద టెండర్లు పూర్తిచేశారు. అలాగే ఈ రహదారికి కొనసాగింపుగా తాళ్లసంకీస తాళ్లసంకీస గ్రామం నుంచి ఖమ్మం జిల్లాలోని వీ.వెంకటాయపాలెం వరకు 4లైన్ల రహదారి నిర్మానానికి రూ.1,123.32కోట్లు మంజూరు చేశారు. నాగ్‌పూర్‌-అమరావతి కారిడార్‌ కింద నిర్మాణమవుతున్న నేషనల్‌ హైవే అథారిటీ మొత్తం మూడు ప్యాకేజీలుగా టెండర్లు పూర్తిచేసుకుంది. ఇప్పటికే ఖమ్మం-విజయవాడ వైపు 90కి.మీ. టెండర్లు ప్రక్రియ నడుస్తోంది. గతనెలలో కేంద్రమంత్రి గడ్కరీ మొదటి ప్యాకేజీ కింద వీ.వెంకటాయపాలెం నుంచి బోనకల్‌ మండలం బ్రాహ్మణపల్లి వరకు 29.92కిమీ రహదారి నిర్మానానికి రూ.983కోట్లు మంజూరుచేశారు. మొత్తం అమరావతి-నాగపూర్‌ కారిడార్‌లో ఎక్కువశాతం గ్రీనఫీల్డ్‌ 4లైన్ల రహదారి నిర్మాణం కాబోతుంది. దీనికి ఖమ్మం-విజయవాడవైపు నిధుల కేటాయింపు జరగడంతో రాబోయే రెండునెలల్లో పనులు ప్రారంభించే అవకాశం కనిపిస్తుంది. అధికారులు సన్నాహాలు చేస్తున్నారు. ఖమ్మం వెంకటాయపాలెంనుండి చింతకాని, బోనకల్‌, మధిర, ఎర్రుపాలెం మండలాల మీదుగా జీ.కొండూరు నుంచి విజయవాడ ఎనహెచ 16కు నాగ్‌పూర్‌ రహదారి అనుసంధానం కాబోతుంది. ఈ రహదారి నిర్మాణం ద్వారా సుమరు 208కి.మీ.దూరం తగ్గుతుందని అధికారులు భావిస్తున్నారు. ప్రస్తుతం 273కి.మీ. పొడవున ఉన్న ఈ రహదారి మార్గం గ్రీనఫీల్డ్‌ 4లైనగా మారడంతో 565కి.మీ.కు తగ్గడం ద్వారా రవాణ వ్యవస్థతోపాటు బందరు, కృష్ణపట్నం, కాకినాడ తదితర పోర్టులకు కూడా సరుకు రవాణ ఎగుమతి, దిగుమతి అనంతరం వేగంగా గమ్యానికి చేరుకునే అవకాశం కలుగుతుంది. ఖమ్మంనుంచి గన్నవరం ఎయిర్‌పోర్టుకు వెళ్లడం కూడా త్వరితగతిన వెళ్లే అవకాశం కలగనుంది. ఇప్పటికే కోదాడ-ఖమ్మం వరకు 31.8కి.మీ. 4లైన్ల రహదారి రూ.1,090కోట్లతో పనులు వేగంగా నడుస్తున్నాయి. 40శాతం పనులు పూర్తయ్యాయి. ఈ రహదారి దేవరపల్లి-ఖమ్మం గ్రీనఫీల్డ్‌ రహదారికి అనుసంధానం కాబోతుంది. ఖమ్మం-దేవరపల్లి గ్రీనఫీల్డ్‌ హైవే పనులు కూడా మొదలై కొన్నిచోట్ల చురుగ్గా నడుస్తున్నాయి. ఈ పనులు పూర్తయితే ఖమ్మం జిల్లాలో జాతీయ రహదారుల ద్వారా రవాణవ్యవస్థ మరింత వేగవంతం కానుంది.

Updated Date - 2023-04-02T00:36:09+05:30 IST

సంబంధం కోసం వెతుకుతున్నారా? తెలుగు మాట్రిమోని లో - రిజిస్ట్రేషన్ ఉచితం!
Advertising
Advertising