ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

పాలేరులో షర్మిలను భారీ మెజారిటీతో గెలిపించాలి

ABN, First Publish Date - 2023-02-16T23:23:49+05:30

రానున్న ఎన్నికల్లో పాలేరులో వైటీపీ అధ్యక్షురాలు షర్మిలను భారీ మెజారిటీతో గెలిపించాలని ఆపార్టీ గౌరవాధ్యక్షురాలు వైఎస్‌ విజయలక్ష్మి పిలుపునిచ్చారు.

క్యాంపు కార్యాలయాన్ని ప్రారంభిస్తున్న వైఎస్‌ విజయమ్మ
అన్నపూర్ణ మ్యారేజెస్... వరల్డ్ వైడ్‌గా తెలుగువారు ఎక్కడున్నా అన్ని కులముల వారికీ పెళ్లి సంబంధాలు కుదర్చడంలో టాప్ పొజిషన్. ఉన్నతమైన కుటుంబాల ఎంపిక. సం|| 9397 9797 50

జూలై 8న కొత్తకార్యాలయాన్ని ప్రారంభించుకుందాం

వైటీపీ క్యాంపు కార్యాలయ ప్రారంభంలో వైఎస్‌ విజయలక్ష్మి

ఖమ్మం రూరల్‌, ఫిబ్రవరి 16 : రానున్న ఎన్నికల్లో పాలేరులో వైటీపీ అధ్యక్షురాలు షర్మిలను భారీ మెజారిటీతో గెలిపించాలని ఆపార్టీ గౌరవాధ్యక్షురాలు వైఎస్‌ విజయలక్ష్మి పిలుపునిచ్చారు. ఖమ్మం రూరల్‌ మండలం, పెద్దతండాలోని సాయిగణేష్‌ నగర్‌లో ఏర్పాటు చేసిన పార్టీ క్యాంపు కార్యాలయాన్ని గురువారం విజయలక్ష్మి ప్రారంభించారు. అనంతరం జరిగిన సభలో ఆమె మాట్లాడుతు దివంగత నేత వైఎ్‌సఆర్‌ పేదల కోసం ప్రవేశపెట్టిన అభివృద్ధి, సంక్షేమ పథకాలు అమలు కావాలంటే షర్మిలను గెలిపించుకోవాలన్నారు. పేదల కోసం తుదిశ్వాసవరకు పనిచేసిన వైఎ్‌సఆర్‌ కూతురు షర్మిల ఎండ, వాన లెక్క చేయకుండా ఎన్ని ఇబ్బందులు ఎదురైనా వెనకడుగు వేయకుండా రాష్ట్ర భవిష్యత్తు కోసం పాదయాత్ర చేస్తున్నారన్నారు. ఆమె ఇచ్చిన మాట తప్పదని, ఎవరికి ఏ కష్టం వచ్చినా ఈ పార్టీ కార్యాలయంలో అందుబాటులో ఉంటారని, రాష్ట్రంలోని 4కోట్ల మంది ప్రజలకు అండగా ఉంటారన్నారు. నాడు రాజశేఖర్‌రెడ్డి హయాంలో ప్రారంభించిన ప్రాజెక్టులు కొన్ని ఇంకా పూర్తి కాలేదని వాటిని షర్మిల పూర్తి చేస్తుందన్నారు. వైఎ్‌సఆర్‌ జన్మదినమైన జూలై 8న పార్టీ కొత్త కార్యాలయాన్ని ప్రారంభించుకుందామన్నారు. కార్యక్రమంలో రాష్ట్ర నాయకులు గట్టు రామచందర్‌రావు, కల్పనా గాయత్రి, చైతన్యా రెడ్డి, వైటీపీ ఖమ్మం జిల్లా అధ్యక్షుడు లక్కినేని సుధీర్‌, జెడ్పీమాజీ చైర్‌పర్సన్‌ గడిపల్లి కవిత, షర్మిల వ్యక్తిగత సహాయకులు నంద్యాల రవీందర్‌రెడ్డి, పాలేరు నియోజకవర్గంలోని నాలుగు మండలాల అధ్యక్షులు పసుపులేటి సైదులు, అన్నబత్తుల కృష్ణ, వేలాద్రి, కోట వెంకటేశ్వర్లు, తదితరులు పాల్గొన్నారు.

Updated Date - 2023-02-16T23:23:50+05:30 IST

సంబంధం కోసం వెతుకుతున్నారా? తెలుగు మాట్రిమోని లో - రిజిస్ట్రేషన్ ఉచితం!
Advertising
Advertising