ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

ABN, First Publish Date - 2023-01-07T23:37:47+05:30

ఖమ్మం జిల్లా ప్రధాన ఆస్పత్రి త్వరలో బోధనాసుపత్రిగా మారడానికి అన్ని ఏర్పాట్లు వేగంగా జరుగుతున్నాయి. ఆసుపత్రి బోర్డుపై ఇప్పటి వరకు ‘ఖమ్మం జిల్లా ప్రధాన ఆసుపత్రి’ అని ఉండగా దాన్ని మెడికల్‌ కళాశాలగా బోర్డు మార్చారు.

ఖమ్మం జిల్లా ప్రధాన ఆస్పత్రికి వైద్య కళాశాలగా బోర్డును ఏర్పాటు చేసిన దృశ్యం
అన్నపూర్ణ మ్యారేజెస్... వరల్డ్ వైడ్‌గా తెలుగువారు ఎక్కడున్నా అన్ని కులముల వారికీ పెళ్లి సంబంధాలు కుదర్చడంలో టాప్ పొజిషన్. ఉన్నతమైన కుటుంబాల ఎంపిక. సం|| 9397 9797 50

‘ప్రభుత్వ వైద్య కళాశాల’గా ఖమ్మం ప్రధాన ఆసుపత్రి బోర్డు మార్పు

కళాశాలకు త్వరలో ప్రిన్సిపాల్‌ రాక

ఖమ్మం కలెక్టరేట్‌, జనవరి 7: ఖమ్మం జిల్లా ప్రధాన ఆస్పత్రి త్వరలో బోధనాసుపత్రిగా మారడానికి అన్ని ఏర్పాట్లు వేగంగా జరుగుతున్నాయి. ఆసుపత్రి బోర్డుపై ఇప్పటి వరకు ‘ఖమ్మం జిల్లా ప్రధాన ఆసుపత్రి’ అని ఉండగా దాన్ని మెడికల్‌ కళాశాలగా బోర్డు మార్చారు. అంతే కాకుండా త్వరలో ఖమ్మం ప్రభుత్వ మెడికల్‌ కళాశాలకు ప్రిన్సిపల్‌ను నియమించనున్నట్లు తెలిసింది. ఇందుకోసం జిల్లా ఆస్పత్రిలో గతంలోనే మెడికల్‌ సూపరింటెండెంట్‌ ఛాంబర్‌ను ప్రిన్సిపల్‌ ఛాంబర్‌గా కేటాయించగా ఆ ఛాంబర్‌ను ప్రిన్సిపాల్‌ కోసం సిద్ధం చేసి ఉంచారు. ప్రస్తుతం జిల్లా ఆస్పత్రిలో పనిచేస్తున్న వైద్యాధికారులు, వైద్యులు నర్సులు ఇతర సిబ్బందిని మరో వైద్యవిధాన పరిషత ఆస్పత్రికి మార్చే సమాలోచనలు చేస్తున్నారు. జిల్లా ఆస్పత్రి ముందు ప్రత్యేకంగా మెడికల్‌ కళాశాల బోర్డును ఏర్పాటు చేయడంతో జనం ఆసక్తిగా చూస్తున్నారు. ఖమ్మం ప్రభుత్వ ఆస్పత్రిని మెడికల్‌ కళాశాలగా రాష్ట్ర ప్రభుత్వం ఇప్పటికే ప్రకటించింది. దీనికోసం రూ.166కోట్లను కేటాయించింది. వచ్చే ఏడాది నుంచి బోధనా తరగతులను ప్రారంభించేందుకు సిద్ధమవుతున్నారు. దాంతో సౌకర్యాల పెంపుపై దృష్టిసారించారు. ఈ మెడికల్‌, నర్సింగ్‌ కళాశాలల్లో బోధించేందుకు పీజీ ఆపై అర్హతలున్న ప్రొఫెసర్లు, అసిస్టెంట్‌ ప్రొఫెసర్లను నియమించేందుకు వైద్య ఆరోగ్యశాఖ కసరత్తు ప్రారంభించింది. జిల్లా ఆస్పత్రికి కూడా ఇప్పటికే 25మంది సీనియర్‌ రెసిడెన్స వైద్యులు చేరుకున్నారు. వారంతా రెండు నెలలుగా విధులు నిర్వర్తిస్తున్నారు. ప్రస్తుత కలెక్టరేట్‌ నుంచి జిల్లా ఆస్పత్రికి రోడ్డు దాటేందుకు వీలుగా రూ.2కోట్లతో ఫుట్‌ ఓవర్‌ వంతెన నిర్మాణానికి నిధులు మంజూరు చేయగా వంతెన నిర్మాణానికి సన్నాహలు చేయాలని ఇంజనీరింగ్‌ అధికారులకు కలెక్టర్‌ వీపీ గౌతమ్‌ ఆదేశాలు జారీ చేశారు.

Updated Date - 2023-01-07T23:37:48+05:30 IST

సంబంధం కోసం వెతుకుతున్నారా? తెలుగు మాట్రిమోని లో - రిజిస్ట్రేషన్ ఉచితం!
Advertising
Advertising