ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

ముగిసిన మెగా వాలీబాల్‌ పోటీలు

ABN, First Publish Date - 2023-01-10T23:15:27+05:30

పినపాక ప్రెస్‌ క్లబ్‌ ఆధ్వర్యంలో గత ఐదు రోజులుగా హోరాహోరీగా సాగిన భద్రాద్రి కొత్తగూడెం, ములుగు జిల్లాల జిల్లా స్థాయి మెగా వాలీబాల్‌ టోర్నమెంట్‌ మంగళవారం ముగిసింది.

వాలీబాల్‌ మ్యాచ్‌ జరుగుతున్న దృశ్యం
అన్నపూర్ణ మ్యారేజెస్... వరల్డ్ వైడ్‌గా తెలుగువారు ఎక్కడున్నా అన్ని కులముల వారికీ పెళ్లి సంబంధాలు కుదర్చడంలో టాప్ పొజిషన్. ఉన్నతమైన కుటుంబాల ఎంపిక. సం|| 9397 9797 50

పినపాక, జనవరి 10: పినపాక ప్రెస్‌ క్లబ్‌ ఆధ్వర్యంలో గత ఐదు రోజులుగా హోరాహోరీగా సాగిన భద్రాద్రి కొత్తగూడెం, ములుగు జిల్లాల జిల్లా స్థాయి మెగా వాలీబాల్‌ టోర్నమెంట్‌ మంగళవారం ముగిసింది. నాకౌట్‌ దశకు చేరుకున్న 16 టీమ్‌ లకు ఏడూళ్లబయ్యారం సీఐ బి.రాజగోపాల్‌, పినపాక ప్రెస్‌క్లబ్‌ అధ్యక్షుడు తోట గంగాధర్‌ జెర్సీలను బహుకరించారు. ఫైనల్‌ మ్యాచ్‌ అత్యంత హోరాహోరీగా సాగింది. ఈ సందర్భంగా భ ద్రాద్రి జిల్లా, పినపాక మండలానికి చెందిన మల్లారం జట్టు వి జేతగా నిలవగా, ములుగు జిల్లా తాడ్వాయి మండలానికి చెం దిన నిమ్మగూడెం డెక్కన్‌ జట్టు రన్నరప్‌గా నిలిచింది. మొదటి బహుమతిని పినపాక జడ్పీటీసీ దాట్ల సుభద్రాదేవి వాసుబాబు ప్రకటించి, అందించగా, రెండో బహుమతి పినపాక లయన్స్‌ క్లబ్‌ అధ్యక్షుడు గంగిరెడ్డి సతీష్‌రెడ్డి, మణుగూరు లయన్స్‌ క్లబ్‌ అధ్యక్షుడుఉ దండా రాధాకృష్ణ ప్రకటించి అందించారు. ఈ కార్యక్రమంలో పినపాక ఎంపీపీ గుమ్మడి గాంధీ, తహశీల్ధార్‌ ఉషాశారద, జడ్పీటీసీ దాట్ల సుభద్రాదేవి వాసుబాబు, ఏడూళ్ల బయ్యారం సీఐ బి.రాజగోపాల్‌, ఎస్‌ఐ టీవీఆర్‌ సూరి, లయన్స్‌ క్లబ్‌ అధ్యక్షుడు గంగిరెడ్డి సతీష్‌రెడ్డి, ఎంపీటీసీ సత్యం, ప్రెస్‌ క్లబ్‌ కార్యదర్శి బృహస్పతి, ఉపాధ్యక్షులు కట్టా శ్రీనివాస్‌రావు, బొగ్గం రమేష్‌ తదితరులు పాల్గొన్నారు.

Updated Date - 2023-01-10T23:15:44+05:30 IST

సంబంధం కోసం వెతుకుతున్నారా? తెలుగు మాట్రిమోని లో - రిజిస్ట్రేషన్ ఉచితం!
Advertising
Advertising