ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

మీ వెంటే మేం

ABN, First Publish Date - 2023-01-02T00:27:42+05:30

నూతన సంవత్సరం ఆరంభం, మాజీ మంత్రి తుమ్మల నాగేశ్వరరావు రాజకీయ జీవితం 40ఏళ్లు పూర్తయిన సందర్భంగా ఖమ్మంరూరల్‌ మండలం బారుగూడెంలోని శ్రీసిటీలో ఆదివారం నిర్వహించిన తుమ్మల అభిమానులు, నాయకులు, కార్యకర్తల ఆత్మీయ సమ్మేళనానికి జనం భారీగా తరలొచ్చారు. ‘

కేక్‌ కట్‌ చేస్తున్న తుమ్మల నాగేశ్వరరావు
అన్నపూర్ణ మ్యారేజెస్... వరల్డ్ వైడ్‌గా తెలుగువారు ఎక్కడున్నా అన్ని కులముల వారికీ పెళ్లి సంబంధాలు కుదర్చడంలో టాప్ పొజిషన్. ఉన్నతమైన కుటుంబాల ఎంపిక. సం|| 9397 9797 50

ప్రజలకు నమస్కరిస్తున్న తుమ్మల నాగేశ్వరరావు

తుమ్మలకు ఆత్మీయుల భరోసా

సమ్మేళనానికి భారీగా తరలివచ్చిన అభిమానులు, నాయకులు, కార్యకర్తలు

ఖమ్మంరూరల్‌ మండలం శ్రీసిటీలో సందడి

ఖమ్మం, జనవరి 1 (ఆంధ్రజ్యోతిప్రతినిధి): నూతన సంవత్సరం ఆరంభం, మాజీ మంత్రి తుమ్మల నాగేశ్వరరావు రాజకీయ జీవితం 40ఏళ్లు పూర్తయిన సందర్భంగా ఖమ్మంరూరల్‌ మండలం బారుగూడెంలోని శ్రీసిటీలో ఆదివారం నిర్వహించిన తుమ్మల అభిమానులు, నాయకులు, కార్యకర్తల ఆత్మీయ సమ్మేళనానికి జనం భారీగా తరలొచ్చారు. ‘మీ వెంటే మేం’ అంటూ తుమ్మలకు భరోసా ఇచ్చారు. ఈ ఆత్మీయ సమ్మేళనాన్ని పురస్కరించుకుని మాజీమంత్రి తుమ్మల ఉదయం ఖమ్మం వీడియో్‌సకాలనీలోని సాయిబాబా ఆలయం, స్తంభాద్రి లక్ష్మీనర్సింహస్వామి ఆలయాల్లో ప్రత్యేక పూజలు చేశారు. ఈ సందర్భంగా ఆయనకు అర్చకులు వేదాశీర్వచనాలు అందించారు. ఈ సందర్భంగా తుమ్మల మాట్లాడుతూ ఎక్కడ ఉన్నా తెలుగు ప్రజలంతా సుఖసంతోషాలతో ఉండాలని కోరుకున్నానన్నారు. అనంతరం ఆయన శ్రీసిటీకి చేరుకోగా.. సంప్రృదాయ నృత్యాలు, డప్పువాయిద్యాలతో తుమ్మలకు ఘనస్వాగతం పలికి నూతన సంవత్సర శుభకాంక్షలు తెలిపారు. అయితే తుమ్మల ఎక్కడా రాజకీయ ప్రసంగాలకు తావివ్వకుండా అందరినీ ఆత్మీయంగా పలకరిస్తూ బాగోగులు తెలుసుకున్నారు. ఇక వచ్చిన వారికి ఉదయం నుంచి సాయంత్ర వరకు భోజన కార్యక్రమం సాగింది. ఈ కార్యక్రమానికి ప్రజలు భారీగా తరలిరావడంతో శ్రీసిటీ ప్రాంతం సందడిగా కనిపించింది. మరోవైపు సమ్మేళనం విజయవంతం కావడంతో నిర్వాహకులు ఆనందం వ్యక్తంచేశారు. తుమ్మల తనయుడు యుగంధర్‌, సాధురమే్‌షరెడ్డి, పాలేరు నియోజకవర్గంతో పాటు ఉమ్మడి జిల్లాకు చెందిన పలువురు నేతలు ఆత్మీయ సమ్మేళనంలో పాలుపంచుకున్నారు.

ఉమ్మడి జిల్లా ప్రజలకు రుణపడి ఉంటా

గోదావరి జలాలతో భూములను సస్యశ్యామలం చేయడమే నాలక్ష్యం

విలేకరుల సమావేశంలో తుమ్మల

ఉమ్మడి జిల్లాలోని పదిలక్షల ఎకరాలకు సాగునీరు అందించి సస్యశ్యామలమైన జిల్లాగా తర్చిదిద్ది రైతుల జీవితాల్లో పాడిపంటలతో వెలుగులు నింపాలన్నదే తన లక్ష్యమని మాజీమంత్రి తుమ్మల నాగేశ్వరరావు పేర్కొన్నారు. సమ్మెళనంలో భాగంగా విలేకరులతో మాట్లాడిన ఆయన గోదావరి జలాలతో పాలేరు ప్రజల పాదాలు కడిగి రుణం తీర్చుకుంటానన్నారు. ముగ్గురు ముఖ్యమంత్రుల వద్ద పనిచేసిన తాను, ఉమ్మడి జిల్లాను ఇతర రాష్ట్రాలకు ఆదర్శంగా అభివృద్ధిలో తీర్చిదిద్దానని, భారీ నీటిపారుదలశాఖ మంత్రిగా గతంలో ఖమ్మం జిల్లాను సస్యశ్యామలం చేసేందుకు దుమ్ముగూడెం ప్రాజెక్టును రూపకల్పనచేశానని, ఆతర్వాత ప్రభుత్వాలు నిర్లక్ష్యం చేశాయని, ప్రస్తుత సీఎం కేసీఆర్‌కు చెప్పి ప్రాజెక్టు మంజూరుచేయించానని, పది లక్షల ఎకరాలకు సాగునీరందించే పనులు జరుగుతున్నాయన్నారు. తన 40 ఏళ్ల రాజకీయ జీవితంలో నీతిగా, నిజాయితీగా, నిబద్ధతతో పనిచేశానని, ప్రజలు, అధికారులు, మీడియా అందించిన సహకారం మరువలేనిదన్నారు. నీటిపారుదల, ఆర్‌అండ్‌బీ మంత్రిగా ఉమ్మడి జిల్లాలో 40ఏళ్లలో ప్రజలు, రైతులు, ప్రజాప్రతినిధులు చెప్పిన ప్రతీ పనిని చేసి చూపానన్నారు. ఎన్నెస్పీ కాలువలు, గోదావరి నదిపై, పాలేరు, మున్నేరు, ఆకేరు లాంటి వాగులపైనా ఎత్తిపోతల పథకాలు, చెక్‌డ్యాంలు నిర్మించి సాగునీరు అందించానని, విద్యుత సదుపాయాలు కలిపించానని, ఆర్‌అండ్‌బీ మంత్రిగా సీఎంలు, కేంద్రమంత్రుల సహకారంతో వేలకోట్ల నిధులతో రహదారుల నిర్మించానన్నారు. నాడు టీడీపీ ప్రభుత్వ, ప్రస్తుత కేసీఆర్‌ హయాంలో జిల్లాలో తాగునీటి సౌకర్యం కలిపించానన్నారు. మిషన కాకతీయ, మిషనభగీరథ ద్వారా తాగు, సాగునీటి సౌకర్యాలు కల్పించగలిగానని, 40ఏళ్ల రాజకీయ జీవితం తనకెంతో సంతృప్తినిచ్చిందన్నారు. గోదావరి జలాలు సాగునీటికి మళ్లించి సస్యశ్యామలం చేసే కార్యక్రమం ఇంకా మిగిలి ఉందని, దానిని పూర్తిచేసి,రైతుల జీవితాల్లో వెలుగులు నింపడమే తన లక్ష్యమన్నారు. విలేకరుల సమావేశంలో సాధురమే్‌షరెడ్డి, తదితరులు పాల్గొన్నారు.

Updated Date - 2023-01-02T00:27:43+05:30 IST

సంబంధం కోసం వెతుకుతున్నారా? తెలుగు మాట్రిమోని లో - రిజిస్ట్రేషన్ ఉచితం!
Advertising
Advertising