ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

వెబ్ స్టోరీస్+ -

కమ్మనైన వివాహాలు కుదర్చడంలో40 సంవత్సరాల సుదీర్ఘ అనుభవం ఉన్న కాకతీయ మ్యారేజెస్‌లో ఇప్పుడు ప్రీమియం మెంబర్‌షిప్‌ ఉచితం ఫోన్|| 9390 999 999, 7674 86 8080

కొడుకును చంపి.. ఆపై విషం తాగి!

ABN, Publish Date - Dec 22 , 2023 | 03:51 AM

ఆ తండ్రి క్షణికావేశం అప్పటిదాకా ప్రశాంతంగా ఉన్న ఆ ఇంట్లో పెను విషాదం నింపింది. మద్యం మత్తులో దాడి చేసి చెట్టంత కుమారుడిని చంపుకొన్న ఆ తండ్రి.. ఆ మత్తు దిగాక తాను చేసిన పనికి కుమిలిపోయి ప్రాణం తీసుకున్నాడు.

ఓ తండ్రి క్షణికావేశంతో కుటుంబంలో పెను విషాదం

మద్యం మత్తులో కుమారుడిపై కత్తితో దాడి.. అక్కడికక్కడే మృతి

మనోవేదనతో విషం తాగి తండ్రి మృతి.. నిజామాబాద్‌లో ఘటన

గాంధారి, డిసెంబరు 21: ఆ తండ్రి క్షణికావేశం అప్పటిదాకా ప్రశాంతంగా ఉన్న ఆ ఇంట్లో పెను విషాదం నింపింది. మద్యం మత్తులో దాడి చేసి చెట్టంత కుమారుడిని చంపుకొన్న ఆ తండ్రి.. ఆ మత్తు దిగాక తాను చేసిన పనికి కుమిలిపోయి ప్రాణం తీసుకున్నాడు. కామారెడ్డి జిల్లాలో ఈ ఘటన జరిగింది. గాంధారి మండలం పెద్దగుజ్జుల్‌ తండా లో నివాసం ఉండే బాదవత్‌ వసంతరావు (50)కు ఇద్దరు భార్యలున్నారు. మొదటి భార్య సరస్వతికి సురేశ్‌ (27), రెండో భార్యకు నరేశ్‌ కుమారులు. రెండో భార్య కొంతకాలం క్రితం మృతి చెందింది. వసంతరావు, సరస్వతి, సురేశ్‌, నరేశ్‌ ఒకే ఇంట్లో నివాసం ఉంటూ వ్యవసాయ పనులు చేసుకుంటున్నారు. కొంత కాలంగా వసంతరావు మద్యానికి బానిసయ్యాడు. తాగిన ప్రతిసారి కుటుంబీకులతో గొడవ పడుతున్నాడు. బుధవారం అర్ధరాత్రి కూడా వసంతరావు ఇంటికి తాగొచ్చాడు. ఆ మైకంలో భార్య సరస్వతితో గొడవపడి చేయిచేసుకున్నాడు. తల్లిని ఎందుకు కొట్టావంటూ తండ్రిని సురేశ్‌ నిలదీశాడు. ‘ఇంట్లోకి రా ఎందుకు కొట్టానో చెబుతాను’ అంటూ ఓ కత్తి తీసుకొని సురేశ్‌ ఛాతీపై దాడి చేశాడు. సురేశ్‌ను స్థానికులు ఆస్పత్రికి తరలించగా అప్పటికే మృతి చెందాడని వైద్యులు చెప్పారు. సురేశ్‌ను అకారణంగా చంపావంటూ వసంతరావును స్థానికులు తిట్టిపోశారు. తన వల్లే కొడుకు చనిపోయాడని మనోవేదనకు గురైన వసంతరావు పురుగుల మందు తాగాడు. తండావాసులు ఆస్పత్రికి తరలించగా అక్కడ చికిత్స పొందుతూ గురువారం మృతి చెందాడు.

Updated Date - Dec 22 , 2023 | 03:51 AM

సంబంధం కోసం వెతుకుతున్నారా? తెలుగు మాట్రిమోని లో - రిజిస్ట్రేషన్ ఉచితం!
Advertising
Advertising