ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

Revanth Reddy: కేటీఆర్ను చంచల్ గూడ జైలులో పెట్టాలి: రేవంత్

ABN, First Publish Date - 2023-03-19T16:54:21+05:30

మంత్రి కేటీఆర్ (KTR)ను బర్తరఫ్ కాదని చంచల్ గూడ జైలులో పెట్టాలని టీపీసీసీ అధ్యక్షుడు రేవంత్రెడ్డి (Revanth Reddy) డిమాండ్ చేశారు.

అన్నపూర్ణ మ్యారేజెస్... వరల్డ్ వైడ్‌గా తెలుగువారు ఎక్కడున్నా అన్ని కులముల వారికీ పెళ్లి సంబంధాలు కుదర్చడంలో టాప్ పొజిషన్. ప్రవేశం ఉచితం. సం|| 9393 763 666

కామారెడ్డి: మంత్రి కేటీఆర్ (KTR)ను బర్తరఫ్ కాదని చంచల్ గూడ జైలులో పెట్టాలని టీపీసీసీ అధ్యక్షుడు రేవంత్రెడ్డి (Revanth Reddy) డిమాండ్ చేశారు. గాంధారిలో రేవంత్రెడ్డి నిరుద్యోగ నిరహార దీక్ష చేపట్టారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ టీఎస్‌పీఎస్సీ (TSPSC) కథ నడిపింది మొత్తం కేటీఆర్ పీఏ తిరుపతినేనని ఆరోపించారు. కేటీఆర్ మంత్రి కార్యాలయమే అన్ని వ్యవహారాలు నడిపారని విమర్శించారు. ఏ విచారణ జరిపినా కేటీఆర్ పేషీ నుంచే మూలాలు బయటపడుతున్నాయని తెలిపారు. టీఎస్‌పీఎస్సీ కేసులో నిందితుడు రాజశేఖర్, కేటీఆర్ పీఏ తిరుపతి ఊర్లు పక్కపక్కనే ఉన్నాయని, కేటీఆర్ పీఏ, రాజశేఖర్ల సన్నిహితులకు అత్యధిక మార్కులు వచ్చాయని రేవంత్‌రెడ్డి తెలిపారు. గ్రూప్-1లో 100కు పైగా మార్కులు వచ్చిన అందరి వివరాలు బయటపెట్టాలని డిమాండ్ చేశారు. కేటీఆర్ పీఏ తిరుపతి సూచన మేరకే.. రాజశేఖర్కు టీఎస్‌పీఎస్సీ TSPSCలో ఉద్యోగం ఇచ్చారని చెప్పారు. ఔట్ సోర్సింగ్ ఉద్యోగం ఇప్పించి రాజశేఖర్ను టీఎస్‌పీఎస్సీకి పంపించారని పేర్కొన్నారు. టీఎస్‌పీఎస్సీలో పనిచేస్తూ పోటీ పరీక్షలకు ఎలా ప్రిపేర్ అవుతారు? అని ప్రశ్నించారు. గతంలో టీఎస్‌పీఎస్సీలో పనిచేస్తూ గ్రూప్ 1 పరీక్ష రాసిన.. మాధురికి ఒకటవ ర్యాంక్, రజనీకాంత్కు 4వ ర్యాంక్ వచ్చాయని రేవంత్‌రెడ్డి తెలిపారు.

Updated Date - 2023-03-19T16:54:21+05:30 IST

సంబంధం కోసం వెతుకుతున్నారా? తెలుగు మాట్రిమోని లో - రిజిస్ట్రేషన్ ఉచితం!
Advertising
Advertising