Bhatti Vikramarka: మద్యం అమ్మకాలు, అప్పుల్లో తెలంగాణ మోడల్: భట్టి
ABN, First Publish Date - 2023-04-21T21:26:25+05:30
మద్యం అమ్మకాలు, అప్పులు, ప్రభుత్వ భూముల అమ్మకాల్లో తెలంగాణ మోడల్‌గా ఉందని సీఎల్పీ నేత భట్టి విక్రమార్క (Bhatti Vikramarka) విమర్శించారు
జమ్మికుంట: మద్యం అమ్మకాలు, అప్పులు, ప్రభుత్వ భూముల అమ్మకాల్లో తెలంగాణ మోడల్‌గా ఉందని సీఎల్పీ నేత భట్టి విక్రమార్క (Bhatti Vikramarka) విమర్శించారు. నీళ్లు, నిధులు, నియామకాలు, ఉద్యోగాల పేరుతో అధికారంలోకి వచ్చిన టీఆర్‌ఎస్.. బీఆర్‌ఎస్ (TRS BRS)గా మారి వాటిని తుంగలో తొక్కిందని దుయ్యబట్టారు. తొమ్మిదిన్నర సంవత్సరాలుగా పంట నష్టపోతే ప్రభుత్వం ఎలాంటి పరిహారం ఇవ్వలేదన్నారు. 2013కు ముందు పంటనష్టం జరిగితే ప్రభుత్వాలు రైతులకు నష్టపరిహారం అందించాయన్నారు. తెలంగాణలో యథేచ్చగా ఇసుక మాఫియా నడుస్తోందని దీనికి ప్రభుత్వమే అండగా ఉంటోందన్నారు. గారడి మాటలతో బురిడీ కొట్టిస్తూ ముఖ్యమంత్రి కేసీఆర్ తెలంగాణ ప్రజలను మోసం చేస్తున్నారని మండిపడ్డారు. కాళేశ్వరం ప్రాజెక్ట్‌లో అవినీతి జరిగిందని ప్రధానమంత్రి మోదీ (Prime Minister Modi), కేంద్ర హోం శాఖ మంత్రి అమిత్‌షా చెప్పారని, అలాంటప్పుడు రాష్ట్ర ప్రభుత్వంపై ఎందుకు చర్యలు తీసుకోవడం లేదో ప్రజలకు సమాధానం చెప్పాలని డిమాండ్ చేశారు. కాంగ్రెస్ పార్టీ హయాంలో 90వేల ఎకరాల్లో వరి సాగు జరిగిందని గుర్తుచేశారు. టీఎస్‌పీఎస్సీ ప్రశ్నాపత్రాల లీకేజీ వ్యవహారంలో తెలంగాణ ప్రభుత్వ పెద్దల హస్తం ఉందని ఆరోపించారు. తెలంగాణలో కాంగ్రెస్ అధికారంలోకి వచ్చిన వెంటనే రూ.2లక్షల రుణమాఫీ, ఇంటి నిర్మాణం కోసం రూ.5లక్షలు, వడ్డీ లేని రుణాలు, భూమి లేని రైతులకు కూలీబంధు పేరిట ప్రతి ఏటా రూ.12వేలు, గ్యాస్ సిలిండర్‌కు రూ.500 ఇస్తామని భట్టి విక్రమార్క హామీ ఇచ్చారు.
Updated Date - 2023-04-21T21:26:25+05:30 IST