Love affair : వారం వ్యవధిలో ఇద్దరి ప్రాణాలు బలి
ABN, First Publish Date - 2023-01-04T08:26:50+05:30
వారం వ్యవధిలో ప్రేమ వ్యవహారం ఇద్దరి ప్రాణాలను బలి తీసుకుంది. ప్రియురాలు చనిపోయిన ఎనిమిది రోజుల తర్వాత ప్రియుడు కూడా మృతి చెందిన ఘటన స్థానికంగా తీవ్ర కలకలం రేపింది.
జనగామ : వారం వ్యవధిలో ప్రేమ వ్యవహారం ఇద్దరి ప్రాణాలను బలి తీసుకుంది. ప్రియురాలు చనిపోయిన ఎనిమిది రోజుల తర్వాత ప్రియుడు కూడా మృతి చెందిన ఘటన స్థానికంగా తీవ్ర కలకలం రేపింది. జనగామ జిల్లా వెంకిర్యాల గ్రామంలో ఘటన చోటు చేసుకుంది. పెళ్ళికి ఒప్పుకోవడం లేదనే మనస్తాపంతో డిసెంబర్ 25వ తేదిన కావేరి అనే యువతి ఆత్మహత్యకు పాల్పడింది. యువతి మృతదేహంతో ప్రియుడు అరవింద్ ఇంటి ముందు ఆమె బంధువులు ఆందోళనకు దిగారు. దీంతో తీవ్ర మనస్తాపానికి గురైన అరవింద్ 26వ తేదీన పురుగుల మందు తాగాడు. హైదరాబాద్‌లోని ఓ ప్రయివేటు ఆస్పత్రిలో చికిత్స పొందుతూ నిన్న సాయంత్రం అరవింద్ కూడా మృతి చెందాడు. దీంతో ఇరు కుటుంబాల్లోనూ విషాదం నెలకొంది.
Updated Date - 2023-01-04T08:26:53+05:30 IST