ఇంటి నిర్మాణానికి రూ.10 లక్షలు ఇవ్వాలి
ABN, First Publish Date - 2023-04-24T23:19:23+05:30
పేదలకు ఇంటి నిర్మాణం కోసం రూ.10 లక్షలు, స్థలం లేని వారికి జాగా ఇవ్వాలని కోరుతూ సీపీఐ (ఎంఎల్) ప్రజాపంథా జిల్లా శాఖ ఆధ్వర్యంలో సోమవారం నారాయణపేట సెంటర్‌చౌక్ నుంచి సత్యనారాయణ చౌరస్తా వరకు ర్యాలీ నిర్వహించారు.

- సీపీఐ (ఎంఎల్) ప్రజాపంథా ఆధ్వర్యంలో ర్యాలీ
నారాయణపేట టౌన్, ఏప్రిల్ 24 : పేదలకు ఇంటి నిర్మాణం కోసం రూ.10 లక్షలు, స్థలం లేని వారికి జాగా ఇవ్వాలని కోరుతూ సీపీఐ (ఎంఎల్) ప్రజాపంథా జిల్లా శాఖ ఆధ్వర్యంలో సోమవారం నారాయణపేట సెంటర్‌చౌక్ నుంచి సత్యనారాయణ చౌరస్తా వరకు ర్యాలీ నిర్వహించారు. అనంతరం నిర్వహించిన ధర్నాలో సీపీఐ (ఎంఎల్) ప్రజాపంథా జిల్లా కార్యదర్శి రాము పాల్గొని మాట్లాడారు. రాష్ట్ర ప్రభుత్వం జిల్లాలో ఒక్క డబుల్ బెడ్‌రూం నిర్మించలేదని, ఏ ఒక్కరికి ఇంటి స్థలం పంచలేదన్నారు. పేట శివారులోని సర్వే నంబర్లు 67, 48లోని సమస్యలను పరిష్కరించాలని అధికారులను కోరారు. ప్రజాపంథా డివిజన్ కార్యదర్శి కాశీనాథ్, నాయకులు సలీం, కాలేశ్వర్, యాదగిరి, జయలక్ష్మి, నరసింహా, ప్రశాంత్, నరసింహులు, చెన్నారెడ్డి, కృష్ణ, బాలకృష్ణ, సునీత, వెంకట్రాములు, నారాయణ, సాదిక్, సలీం, లక్ష్మి పాల్గొన్నారు.
Updated Date - 2023-04-24T23:19:23+05:30 IST