ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

కమ్మనైన వివాహాలు కుదర్చడంలో40 సంవత్సరాల సుదీర్ఘ అనుభవం ఉన్న కాకతీయ మ్యారేజెస్‌లో ఇప్పుడు ప్రీమియం మెంబర్‌షిప్‌ ఉచితం ఫోన్|| 9390 999 999, 7674 86 8080

గద్వాల అసెంబ్లీ అభ్యర్థిత్వం కోసం దరఖాస్తులు

ABN, First Publish Date - 2023-08-22T00:01:16+05:30

గద్వాల నియోజకవర్గం నుంచి కాంగ్రెస్‌ పార్టీ అభ్యర్థిత్వం కోసం జడ్పీ చైర్‌పర్సన్‌ సరిత, టీపీసీసీ కార్యదర్శి డాక్టర్‌ కురువ విజయ్‌ కుమార్‌లు సోమవారం హైదరాబాద్‌లోని గాంధీభవన్‌ లో దరఖాస్తు చేసుకున్నట్లు మీడియాకు తెలిపారు.

దరఖాస్తు చేస్తున్న జడ్పీ చైర్‌పర్సన్‌ సరిత, టీపీసీసీ కార్యదర్శి డాక్టర్‌ విజయ్‌

- జడ్పీ చైర్‌పర్సన్‌ సరిత, టీపీసీసీ కార్యదర్శి కురువ విజయ్‌

గద్వాల, ఆగస్టు 21 : గద్వాల నియోజకవర్గం నుంచి కాంగ్రెస్‌ పార్టీ అభ్యర్థిత్వం కోసం జడ్పీ చైర్‌పర్సన్‌ సరిత, టీపీసీసీ కార్యదర్శి డాక్టర్‌ కురువ విజయ్‌ కుమార్‌లు సోమవారం హైదరాబాద్‌లోని గాంధీభవన్‌ లో దరఖాస్తు చేసుకున్నట్లు మీడియాకు తెలిపారు. ఉన్నత విద్యావంతురాలినైన తాను మానవపాడు జడ్పీటీసీ జోగుళాంబ గద్వాల జిల్లా పరిషత్‌ చైర్‌ పర్సన్‌గా కొనసాగుతున్నట్లు చైర్‌పర్సన్‌ సరిత దరఖా స్తులో పేర్కొన్నారు. రాజకీయ కుటుంబం నుంచి వచ్చిన తాను ప్రజలతో సత్సంబంధాలు కలిగి ఉన్నానని, గద్వాల పట్టణంలో నివాసం ఉంటూ నిత్యం ప్రజల మధ్య తిరుగుతున్నానని తెలిపారు. తిరగబడుదాం - తరిమికొడుదాం కార్యక్రమం కోఆర్డినేటర్‌గా కాంగ్రెస్‌ పార్టీ కార్యక్రమాలను ప్రజల వద్దకు తీసుకెళ్తున్నట్లు పేర్కొన్నారు.

ఇదే నియోజకవర్గం నుంచి తన అభ్యర్థిత్వాన్ని పరిశీలించాలని టీపీసీసీ కార్యదర్శి, ప్రచార కమిటీ సభ్యుడు డాక్టర్‌ కురువ విజయ్‌కుమార్‌ దరఖాస్తు చేసుకున్నారు. ఉస్మానియా యూనివర్సీటీ జేఏసీ నాయ కుడిగా విద్యారంగ సమస్యలతో పాటు తెలంగాణ ఉద్యమంలో కీలక భూమిక పోషించానని పేర్కొన్నారు. టీపీసీసీ కార్యదర్శిగా కాంగ్రెస్‌ కార్యక్రమాలను ముం దుకు తీసుకపోయానని, పార్టీ పటిష్టతకోసం పని చేశానని పేర్కొన్నారు. ప్రస్తుతం గద్వాల అసెంబ్లీ తిరగబడుదాం - తరిమికొడుదాం కార్యక్రమం కోఆర్డినేటర్‌గా పనిచేస్తున్నట్లు తెలిపారు. 15 ఏళ్లుగా కాంగ్రెస్‌లో ఉంటూ పార్టీ కోసం పనిచేస్తున్నట్లు వివరించారు.

Updated Date - 2023-08-22T00:01:16+05:30 IST

సంబంధం కోసం వెతుకుతున్నారా? తెలుగు మాట్రిమోని లో - రిజిస్ట్రేషన్ ఉచితం!
Advertising
Advertising