ప్రభుత్వ పనితీరును ఎండగట్టేందుకే ‘హాత్‌ సే హాత్‌ జోడో’

ABN, First Publish Date - 2023-02-07T00:05:20+05:30

బీఆర్‌ఎస్‌ ప్రభుత్వ పనితీరును ఎండగట్టేందుకే హత్‌ సే హాత్‌ జోడో యాత్రను చేపడుతున్నట్లు ఏఐసీసీ కార్యదర్శి, అలంపూర్‌ మాజీ ఎమ్మెల్యే సంపత్‌కుమార్‌ అన్నారు.

ప్రభుత్వ పనితీరును ఎండగట్టేందుకే ‘హాత్‌ సే హాత్‌ జోడో’
బైరంపల్లిలో నిర్వహించిన హాత్‌ సే హాత్‌ జోడో కార్యక్రమంలో సంపత్‌కుమార్‌
అన్నపూర్ణ మ్యారేజెస్... వరల్డ్ వైడ్‌గా తెలుగువారు ఎక్కడున్నా అన్ని కులముల వారికీ పెళ్లి సంబంధాలు కుదర్చడంలో టాప్ పొజిషన్. ఉన్నతమైన కుటుంబాల ఎంపిక. సం|| 9397 9797 50

- ఏఐసీసీ కార్యదర్శి , మాజీ ఎమ్మెల్యే సంపత్‌కుమార్‌

అలంపూర్‌, ఫిబ్రవరి 6 : బీఆర్‌ఎస్‌ ప్రభుత్వ పనితీరును ఎండగట్టేందుకే హత్‌ సే హాత్‌ జోడో యాత్రను చేపడుతున్నట్లు ఏఐసీసీ కార్యదర్శి, అలంపూర్‌ మాజీ ఎమ్మెల్యే సంపత్‌కుమార్‌ అన్నారు. అలంపూర్‌ జోగుళాంబదేవి, బాల బ్రహ్మే శ్వరస్వామి ఆలయాల్లో సోమవారం ఆయన ప్రత్యేకపూజలు చేశారు. అనంతరం మండలంలోని గొందిమల్ల, బైరంపల్లి, బుక్కాపురం గ్రామాల్లో హాత్‌ సే హాత్‌ జోడోయాత్ర నిర్వహించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ బీఆర్‌ఎస్‌ ప్రభుత్వం ఇచ్చిన హమీలను అమలు చేయకుండా ఎలా నిర్లక్ష్యంగా వివరిస్తుందో ప్రజలకు అవగా హన కల్పిస్తామన్నారు. బీఆర్‌ఎస్‌ అవినీతి, నియం తృత్వ పాలనను ఎండగడుతూ, రాబోయే రోజుల్లో కాంగ్రెస్‌ పార్టీని ఆదరించాలని కోరుతున్నట్లు తెలిపారు. ఇందిరమ్మ రాజ్యాన్ని స్థాపించేందుకు ప్రజలు స్వచ్ఛందంగా ముందుకు వస్తున్నారన్నారు. యాత్రలో నాయకులు శివానంద్‌, శంకరాచారి, శివానంద్‌, రామానాయుడు, చంద్రశేఖర్‌నాయుడు, వ్రికమనాయుడు, రామ్‌, లక్ష్మీధర్‌రెడ్డి, నవీన్‌రెడ్డి, ప్రభుదాసు, గోకారి, నారాయణ, గోపాల్‌, రామ కృష్ణ, నరసింహ, నారాయణ పాల్గొన్నారు.

Updated Date - 2023-02-07T00:05:21+05:30 IST

సంబంధం కోసం వెతుకుతున్నారా? తెలుగు మాట్రిమోని లో - రిజిస్ట్రేషన్ ఉచితం!
Advertising
Advertising