కోర్టులో కేసు ఉండగా ఎలా శంకుస్థాపన చేస్తారు ?
ABN, First Publish Date - 2023-01-23T23:14:51+05:30
కోర్టులో కేసులు ఉన్న స్థలాల్లో మంత్రి కేటీఆర్ ఎలా శంకు స్థాపనలు చేస్తారని బీజేపీ నాయకుడు నాగూరావు నామాజీ ప్రశ్నించారు.
- ఇది రాజ్యాంగ విరుద్ధం
- బీజేపీ నాయకుడు నాగూరావు నామాజీ
నారాయణపేట టౌన్, జనవరి 23 : కోర్టులో కేసులు ఉన్న స్థలాల్లో మంత్రి కేటీఆర్ ఎలా శంకు స్థాపనలు చేస్తారని బీజేపీ నాయకుడు నాగూరావు నామాజీ ప్రశ్నించారు. సోమవారం నారాయణపేట పీఆర్పీ గెస్ట్ హౌజ్‌లో రాష్ట్ర నాయకుడు రతంగ్ పాండురెడ్డితో కలిసి విలేకరుల సమావేశంలో ఆ యన మాట్లాడారు. అభివృద్ధికి బీజేపీ ఎప్పుడు సహకరిస్తుందన్నారు. ప్రైవేటు వ్యక్తులు, ప్రభుత్వం ఇచ్చిన ప్లాట్లను లాక్కొని కలెక్టరేట్, ఎస్పీ కార్యాల యాలను నిర్మిస్తామంటే ఒప్పుకోబోమని స్పష్ఠం చేశారు. బీఆర్‌ఎస్ ప్రభుత్వం నారాయణపేటపై రా ళ్లు వేయడం తప్పా ఒక్క హామీ నెరవేర్చలేదని వి మర్శించారు. చిత్తశుద్ధి ఉంటే డబుల్ బెడ్‌రూం ఇళ్లు ఇవ్వాలని, దళితులకు మూడెకరాల భూమి ఇవ్వాల ని, అర్హులకు దళితబంధు అమలు చేయాలని, ఇంటింటికీ భగీరథ నీళ్లు ఇవ్వాలని డిమాండ్ చేశా రు. పోటీపడి మంత్రులు ప్రకటించిన నిధులు, మినీ స్టేడియం ఏమైందని ప్రశ్నించారు. వేల కోట్లు ఖర్చుచేసి ప్రాజెక్టులు నిర్మించామని చెబుతున్న రాష్ట్ర ప్రభుత్వం జీవో నెంబరు 69 ఎందుకు అమ లు చేయడం లేదని నిలదీశారు. బీజేపీ నాయకు లు ప్రభాకర్‌వర్ధన్, సిద్ది వెంకట్రాములు, రఘువీర్, రఘు రామయ్య పాల్గొన్నారు.
Updated Date - 2023-01-23T23:14:53+05:30 IST