ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

కమ్మనైన వివాహాలు కుదర్చడంలో40 సంవత్సరాల సుదీర్ఘ అనుభవం ఉన్న కాకతీయ మ్యారేజెస్‌లో ఇప్పుడు ప్రీమియం మెంబర్‌షిప్‌ ఉచితం ఫోన్|| 9390 999 999, 7674 86 8080

అభివృద్ధికి అడ్డుపడటమే కాంగ్రెస్‌ నైజం

ABN, First Publish Date - 2023-09-30T23:20:03+05:30

అభివృద్ధికి అడ్డుపడటమే కాంగ్రెస్‌ పార్టీ నాయకుల నైజం అని, గడచిన ఐదేళ్ల కాలంలో కొడంగల్‌ నియోజకవర్గాన్ని అన్ని రంగాల్లో అభివృద్ధి చేశానని ఎమ్మెల్యే పట్నం నరేందర్‌రెడ్డి అన్నారు.

సమావేశంలో మాట్లాడుతున్న ఎమ్మెల్యే పట్నం నరేందర్‌రెడ్డి

- ఎమ్మెల్యే పట్నం నరేందర్‌రెడ్డి

కోస్గి, సెప్టెంబరు 30 : అభివృద్ధికి అడ్డుపడటమే కాంగ్రెస్‌ పార్టీ నాయకుల నైజం అని, గడచిన ఐదేళ్ల కాలంలో కొడంగల్‌ నియోజకవర్గాన్ని అన్ని రంగాల్లో అభివృద్ధి చేశానని ఎమ్మెల్యే పట్నం నరేందర్‌రెడ్డి అన్నారు. శనివారం కోస్గి పట్టణంలో జరుగుతున్న రోడ్డు విస్తరణ పనులను పరిశీలించారు. ఈ సందర్భంగా ఎమ్మెల్యే మాట్లాడుతూ సీఎం కేసీఆర్‌ సహకారంతో నియోజకవర్గాన్ని అబివృద్ధి చేస్తుంటే ఓర్వలేని కాంగ్రెస్‌ పార్టీ నాయకులు అడుగడుగునా అభివృద్ధికి అడ్డుపడుతున్నారన్నారు. గతంలో ప్రాతినిథ్యం వహించిన ఎమ్మెల్యేలు గురునాథ్‌రెడ్డి, రేవంత్‌రెడ్డి కొడంగల్‌కు ఏమి చేశారో చెప్పాలన్నారు. ఐదేళ్లలో కోస్గి మునిసిపాలిటీకి నేటి వరకు రూ.40 కోట్ల నిధులు మంజూరు చేసిన ఘనత కేసీఆర్‌కే దక్కుతుందన్నారు. పట్టణంలో చేపట్టిన రోడ్డు విస్తరణలో ఇండ్లు కోల్పోయిన బాధితులకు ఇళ్ల స్థలాలతో పాటు గృహలక్ష్మి పథకంలో ఇండ్లు కుడా మంజూరు చేయిస్తానని హామీ ఇచ్చారు. భారత్‌మాలలో భాగంగా కేంద్ర మంత్రి నితిన్‌గడ్కరికి రాష్ట్ర మంత్రుల సహకారంతో రహదారుల నిర్మాణానికి లేఖలు రాయడం జరిగిందన్నారు. స్పందించిన మంత్రి వెంటనే భూత్పూర్‌ నుంచి కర్ణాటకలోని చించోలి వరకు నాలుగు లైన్ల రహదారి నిర్మాణానికి అనుమతి ఇచ్చారని, వెంటనే జాతీయ రహదారి నిర్మాణ పనులను కూడా చేపట్టనున్నట్లు తెలిపారు. అనంతరం ఆశ కార్యకర్తలు తమ సమస్యలను పరిష్కరించాలని ఎమ్మెల్యేకు వినతిపత్రం అందించారు. జిల్లా గ్రంథాలయ సంస్థ చైర్మన్‌ శాసం రామకృష్ణ, ఎంపీపీ మధుకర్‌రావు, మ్యాకల రాజేష్‌, వరప్రసాద్‌, ఓంప్రకాష్‌, మాస్టర్‌ శ్రీనివాస్‌, బాలేష్‌, వెంకట్‌నర్సిములు,

Updated Date - 2023-09-30T23:20:03+05:30 IST

సంబంధం కోసం వెతుకుతున్నారా? తెలుగు మాట్రిమోని లో - రిజిస్ట్రేషన్ ఉచితం!
Advertising
Advertising