ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

వెబ్ స్టోరీస్+ -

కమ్మనైన వివాహాలు కుదర్చడంలో40 సంవత్సరాల సుదీర్ఘ అనుభవం ఉన్న కాకతీయ మ్యారేజెస్‌లో ఇప్పుడు ప్రీమియం మెంబర్‌షిప్‌ ఉచితం ఫోన్|| 9390 999 999, 7674 86 8080

ఉమామహేశ్వరంలో కార్తీక పూజలు

ABN, First Publish Date - 2023-11-23T22:46:17+05:30

శ్రీశైల ఉత్తర ముఖ ద్వారమైన ఉమామహేశ్వర క్షేత్రంలో భక్తులు గురువారం కార్తీక పూజలు చేశారు. రాష్ట్రంలోని హైదరాబాద్‌, నల్లగొండ, ఉమ్మడి మహబూబ్‌నగర్‌ జిల్లా, కర్ణాటక తదితర ప్రాంతాల నుంచి శ్రీశైలం వెళ్లే భక్తులు ఉమామహేశ్వర క్షేత్రాన్ని దర్శించుకొని, ఈశ్వరుడికి ప్రత్యేక పూజలు చేశారు.

ఉమామహేశ్వర ఆలయంలో కార్తీక దీపాలను వెలిగిస్తున్న భక్తులు

అచ్చంపేట అర్బన్‌, నవంబరు 23: శ్రీశైల ఉత్తర ముఖ ద్వారమైన ఉమామహేశ్వర క్షేత్రంలో భక్తులు గురువారం కార్తీక పూజలు చేశారు. రాష్ట్రంలోని హైదరాబాద్‌, నల్లగొండ, ఉమ్మడి మహబూబ్‌నగర్‌ జిల్లా, కర్ణాటక తదితర ప్రాంతాల నుంచి శ్రీశైలం వెళ్లే భక్తులు ఉమామహేశ్వర క్షేత్రాన్ని దర్శించుకొని, ఈశ్వరుడికి ప్రత్యేక పూజలు చేశారు. పాపనాశిని గుండంలో పుణ్యస్నానాలు ఆచరించి, ఈశ్వరునికి క్షీరాభిశేకం, రుద్రాభిశేకం, అమ్మ వారికి కుంకుమార్చన, గణపతి, అయ్యప్ప స్వాములకు ప్రత్యేక పూజలు చేశారు. వేదపండితులు వీరయ్య, చంద్రశేఖర్‌ అమ్మవారి ఉత్సవ విగ్రహాలకు, మూలవిరాట్‌లకు కుంకుమార్చనలు చేశారు. ఆలయానికి వచ్చిన భక్తులకు అన్నదానం చేశారు. బోగమహేశ్వరం నుంచి కాలినడకన, మెట్ల మార్గం ద్వారా కొండపైకి చేరుకొని, మెక్కులు తీర్చుకున్నారు. ఈవో శ్రీనివాసరావు, ఆలయ కమిటీ చైర్మన్‌ కుందూరి సుధాకర్‌ భక్తులకు ఏర్పాట్లను పరిశీలించారు. కార్యక్రమంలో పూజారులు, ఆలయ సిబ్బంది రామకృష్ణ, లక్ష్మయ్య, కవికుమార్‌ దామోదర్‌, శంకర్‌ తదితరులు పాల్గొన్నారు.

Updated Date - 2023-11-23T22:46:18+05:30 IST

సంబంధం కోసం వెతుకుతున్నారా? తెలుగు మాట్రిమోని లో - రిజిస్ట్రేషన్ ఉచితం!
Advertising
Advertising