ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

కమ్మనైన వివాహాలు కుదర్చడంలో40 సంవత్సరాల సుదీర్ఘ అనుభవం ఉన్న కాకతీయ మ్యారేజెస్‌లో ఇప్పుడు ప్రీమియం మెంబర్‌షిప్‌ ఉచితం ఫోన్|| 9390 999 999, 7674 86 8080

అందుబాటులోకి రానున్న కిసాన్‌ సేవా కేంద్రాలు

ABN, First Publish Date - 2023-07-27T23:44:39+05:30

తెలంగాణ రైతులకు కేంద్ర ప్రభుత్వం శుభవార్త చెప్పిందని బీజేపీ జిల్లా అధ్యక్షుడు వీరబ్రహ్మచారి అన్నారు.

ప్రధాన మంత్రి కార్యక్రమాన్ని వీక్షిస్తున్న బీజేపీ జిల్లా నాయకులు

మహబూబ్‌ నగర్‌ (క్లాక్‌ టవర్‌), జూలై 27 : తెలంగాణ రైతులకు కేంద్ర ప్రభుత్వం శుభవార్త చెప్పిందని బీజేపీ జిల్లా అధ్యక్షుడు వీరబ్రహ్మచారి అన్నారు. రాష్ట్రంలో 4వేల ప్రధాని కిసాన్‌ సేవా కేంద్రాలు నేటి నుంచి అందుబాటులోకి రానున్నాయని తెలిపారు. గురువారం రాజస్థాన్‌లో జరిగిన ప్రధాని మోదీ కార్యక్రమాన్ని జిల్లా కేంద్రంలో ఓ కేంద్ర ప్రభుత్వ ఎరువుల దుకాణంలో ఆయనతో పాటు జిల్లా నాయకులు వీక్షించారు. ఈ సందర్భం గా మాట్లాడుతూ ప్రస్తుతం దేశ వ్యాప్తంగా అందుబాటులో ఉన్న ఎరువుల దుకాణాలు పీఎం కిసాన్‌ సేవా కేంద్రాలుగా మార్చేందుకు కేంద్ర ప్రభుత్వం నిర్ణయించిందని, మొత్తం 2.80 లక్షల కేంద్రాలు ఏర్పాటు కానుండగా 1.25 లక్షల కేంద్రాలను పీఎం మోదీ ప్రారంభించినట్లు తెలిపారు. రాజస్థాన్‌లో జరిగిన కార్యక్రమంలోనే 14వ విడత పీఎం సమ్మాన్‌ నిధి కింద 8.5 కోట్ల మంది రైతుల ఖాతాల్లో రూ.2వేల చొప్పన జమ చేసినట్లు తెలిపారు. కార్యక్రమంలో జిల్లా ఉపాధ్యక్షుడు కృష్ణవర్ధన్‌, కార్యదర్శి శ్రీనివాస్‌ రెడ్డి, కోశాధికారి శేరి పాండు రంగారెడ్డి, ఫ్లోర్‌ లీడర్‌, అసెంబ్లీ కన్వీనర్‌ అంజయ్య, యువ మోర్చా జిల్లా అధ్యక్షుడు కిరణ్‌రెడ్డి, ధర్మపురం సర్పంచు శ్రీనివాస్‌ రెడ్డి, కరుణాకర్‌రెడ్డి, హరినాథ్‌ పాల్గొన్నారు.

ఫ జడ్చర్ల : కిసాన్‌ సమృద్ధి కేంద్రాలలో గురువారం ప్రధాన మంత్రి మోదీ ప్రసంగాన్ని రైతులు వీక్షించారు. జడ్చర్ల మార్కెట్‌ ప్రాంగణంలోని 12 కిసాన్‌ సమృద్ధి కేంద్రాలలో బీజేపీ కిసాన్‌ మోర్చా ఆధ్వర్యంలో ప్రధాన మం త్రి ప్రసంగాన్ని వీక్షించేలా ఏర్పాటు చేశారు. మోదీ ప్రసంగాన్ని రైతులు, బీజేపీ నాయకులు కలిసి వీక్షించారు. బీజేపీ కిసాన్‌ మోర్చా జిల్లా అధికార ప్రతినిధి నవీన్‌, మురళీ, నాయకులు మధు, కౌన్సిలర్‌ రాజు పాల్గొన్నారు.

Updated Date - 2023-07-27T23:44:39+05:30 IST

సంబంధం కోసం వెతుకుతున్నారా? తెలుగు మాట్రిమోని లో - రిజిస్ట్రేషన్ ఉచితం!
Advertising
Advertising