ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

కాంగ్రెస్‌లోకి కూచకుళ్ల రాజేష్‌రెడ్డి

ABN, First Publish Date - 2023-06-09T23:22:00+05:30

అసెంబ్లీ ఎన్నికలు సమీపిస్తున్న నేపథ్యంలో నాగర్‌ కర్నూల్‌ రాజకీయాలు ఆసక్తికరంగా మారుతున్నాయి. కాంగ్రెస్‌ పార్టీలో చేరికకు ఎమ్మెల్సీ తనయుడు కూచకుళ్ల రాజేష్‌రెడ్డి రంగం సిద్ధం చేసుకుంటుండగా, తనయుడి భవిష్యత్తు కోసం ఎమ్మెల్సీ కూచకుళ్ల దామో దర్‌రెడ్డి కూడా తనవంతు ప్రయత్నాలు ప్రారంభిం చారు. దామోదర్‌రెడ్డి బీఆర్‌ఎస్‌ను వీడితే ఓటు బ్యాంకు దెబ్బతింటుందని నాగర్‌కర్నూల్‌లో ముఖ్యమంత్రి పర్యటనకు ఒక రోజు ముందు మర్రి జనార్దన్‌రెడ్డి కూచకుళ్ల దామోదర్‌రెడ్డితో సమావేశమయ్యారు.

కూచకుళ్ల రాజేష్‌రెడ్డి
అన్నపూర్ణ మ్యారేజెస్... వరల్డ్ వైడ్‌గా తెలుగువారు ఎక్కడున్నా అన్ని కులముల వారికీ పెళ్లి సంబంధాలు కుదర్చడంలో టాప్ పొజిషన్. ఉన్నతమైన కుటుంబాల ఎంపిక. సం|| 9397 9797 50

పొంగులేటి వెంట చేరికకు రంగం సిద్ధం

దామోదర్‌రెడ్డితో ఫలించని బీఆర్‌ఎస్‌ నాయకుల బుజ్జగింపులు

పదవికి రాజీనామా చేసేందుకు సిద్ధమైన ఎమ్మెల్సీ

నాగర్‌కర్నూల్‌, జూన్‌9 (ఆంధ్రజ్యోతి): అసెంబ్లీ ఎన్నికలు సమీపిస్తున్న నేపథ్యంలో నాగర్‌ కర్నూల్‌ రాజకీయాలు ఆసక్తికరంగా మారుతున్నాయి. కాంగ్రెస్‌ పార్టీలో చేరికకు ఎమ్మెల్సీ తనయుడు కూచకుళ్ల రాజేష్‌రెడ్డి రంగం సిద్ధం చేసుకుంటుండగా, తనయుడి భవిష్యత్తు కోసం ఎమ్మెల్సీ కూచకుళ్ల దామో దర్‌రెడ్డి కూడా తనవంతు ప్రయత్నాలు ప్రారంభిం చారు. దామోదర్‌రెడ్డి బీఆర్‌ఎస్‌ను వీడితే ఓటు బ్యాంకు దెబ్బతింటుందని నాగర్‌కర్నూల్‌లో ముఖ్యమంత్రి పర్యటనకు ఒక రోజు ముందు మర్రి జనార్దన్‌రెడ్డి కూచకుళ్ల దామోదర్‌రెడ్డితో సమావేశమయ్యారు. ఈ సందర్భంగా ఇద్దరి మధ్య రాజకీయ చర్చలు జరుగగా, తన అనుచరులను అణగదొక్కుతు న్నావంటూ మర్రి జనార్దన్‌రెడ్డిపై కూచకుళ్ల దామోదర్‌రెడ్డి ప్రశ్నలు సంధించినట్లు తెలిసింది. వీరిద్దరి మధ్య రాజీ కుదుర్చుతామంటూ భూ ఆక్రమణలకు పాల్పడిన వారు భేటీ అయ్యి.. తామంటే తాము ప్రయత్నించామంటూ ప్రచారం చేసుకోవడంపై కూచకుళ్ల దామోదర్‌రెడ్డి, మర్రి జనార్దన్‌రెడ్డి సీరియస్‌ అయినట్లు తెలిసింది. అయితే.. పొంగులేటి శ్రీనివాస్‌రెడ్డితోపాటు జూపల్లి కృష్ణారావు వెంట కాంగ్రెస్‌ పార్టీలో చేరడానికి కూచకుళ్ల రాజేష్‌రెడ్డి రంగం సిద్ధం చేసుకున్నట్లు తెలిసింది. రాజేష్‌రెడ్డి కాంగ్రెస్‌ పార్టీ తీర్థం పుచ్చుకునేలోపల దామోదర్‌రెడ్డి తన ఎమ్మెల్సీ పదవికి రాజీనామా చేసే యోచనలో ఉన్నారు.

Updated Date - 2023-06-09T23:22:00+05:30 IST

సంబంధం కోసం వెతుకుతున్నారా? తెలుగు మాట్రిమోని లో - రిజిస్ట్రేషన్ ఉచితం!
Advertising
Advertising