ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

వెబ్ స్టోరీస్+ -

కమ్మనైన వివాహాలు కుదర్చడంలో40 సంవత్సరాల సుదీర్ఘ అనుభవం ఉన్న కాకతీయ మ్యారేజెస్‌లో ఇప్పుడు ప్రీమియం మెంబర్‌షిప్‌ ఉచితం ఫోన్|| 9390 999 999, 7674 86 8080

ఏసు మార్గాన్ని అనుసరిద్దాం

ABN, Publish Date - Dec 25 , 2023 | 11:41 PM

ఏసుక్రీస్తు చూపిన మార్గాన్ని అనుసరిద్దామని ఎమ్మెల్యే యెన్నం శ్రీనివాస్‌రెడ్డి అన్నారు. క్రిస్మస్‌ సందర్భంగా సోమవారం పట్టణంలోని వివిధ చర్చీలలో నిర్వహించిన ప్రత్యేక ప్రార్థనలో ఎమ్మెల్యే, ఎంపీ మన్నె శ్రీనివాస్‌రెడ్డి, మాజీ మంత్రులు డీకే అరుణ, శ్రీనివాస్‌గౌడ్‌లు పాల్గొన్నారు.

ఎంబీ చర్చిలో ఫాదర్‌కు కేక్‌ తినిపిస్తున్న ఎమ్మెల్యే యెన్నం శ్రీనివాస్‌రెడ్డి

పాలమూరు, డిసెంబరు 25 : ఏసుక్రీస్తు చూపిన మార్గాన్ని అనుసరిద్దామని ఎమ్మెల్యే యెన్నం శ్రీనివాస్‌రెడ్డి అన్నారు. క్రిస్మస్‌ సందర్భంగా సోమవారం పట్టణంలోని వివిధ చర్చీలలో నిర్వహించిన ప్రత్యేక ప్రార్థనలో ఎమ్మెల్యే, ఎంపీ మన్నె శ్రీనివాస్‌రెడ్డి, మాజీ మంత్రులు డీకే అరుణ, శ్రీనివాస్‌గౌడ్‌లు పాల్గొన్నారు. ఈ సందర్భంగా ఎమ్మెల్యే యెన్నం క్రైస్తవులకు పండుగ శుభా కాంక్షలు తెలుపుతూ మాట్లాడారు. గతేడాదికంటే వచ్చే ఏడాది మీ జీవితాల్లో అధికంగా సుఖసంతోషాలు కలగాలని ఆకాంక్షించారు. మన కుటుంబంలోనే కాదు.. మన సమాజంలో కూడా శాంతి, సహనం, ధర్మాన్ని కాపాడేందుకు అనుక్షణం తపించే మనస్తత్వం కలిగి ఉంటేనే భవిష్యత్తు బాగుంటుందన్నారు. విద్య, వైద్యం ప్రధాన అంశా లుగా తీసుకుని ప్రజలకు సేవ చేసేందుకు కాంగ్రెస్‌ ప్రభుత్వం ముందుకు సాగుతోందన్నారు. రాజ్యాంగం ముందు అందరూ సమానమేనని, దానికి అనుగుణంగా నడుచుకుంటే అందరం సంతోషంగా జీవిస్తామన్నారు. అనంతరం పేదలకు దుస్తులు పంపిణీ చేశారు. కార్యక్రమంలో కాంగ్రెస్‌ నాయకులు ఒబేదుల్లా కొత్వాల్‌, పాస్టర్‌ వరప్రసాద్‌, సుధీర్‌, చర్చి కౌన్సిల్‌ సభ్యులు జాకబ్‌, సీజే డేవిడ్‌, టైటస్‌రాజ్‌, లక్ష్మణ్‌యాదవ్‌, సీజే బెనహర్‌, డ్యానియేల్‌, శ్యామ్యూల్‌, డీసీసీ ప్రధాన కార్యదర్శి సిరాజ్‌ఖాద్రి ఉన్నారు.

Updated Date - Dec 25 , 2023 | 11:41 PM

సంబంధం కోసం వెతుకుతున్నారా? తెలుగు మాట్రిమోని లో - రిజిస్ట్రేషన్ ఉచితం!
Advertising
Advertising