ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

తలసేమియాను తరిమేద్దాం

ABN, First Publish Date - 2023-01-12T23:31:50+05:30

తలసే మియా వ్యాధిని తరిమేద్దామని ఎక్సైజ్‌ శాఖ మంత్రి శ్రీనివాస్‌గౌడ్‌ అన్నారు.

సమావేశంలో మాట్లాడుతున్న మంత్రి శ్రీనివాస్‌గౌడ్‌
అన్నపూర్ణ మ్యారేజెస్... వరల్డ్ వైడ్‌గా తెలుగువారు ఎక్కడున్నా అన్ని కులముల వారికీ పెళ్లి సంబంధాలు కుదర్చడంలో టాప్ పొజిషన్. ఉన్నతమైన కుటుంబాల ఎంపిక. సం|| 9397 9797 50

- రాష్ట్ర ఎక్సైజ్‌ శాఖ మంత్రి శ్రీనివాస్‌గౌడ్‌

మహబూబ్‌నగర్‌ (వైద్యవిభాగం)జనవరి 12: తలసే మియా వ్యాధిని తరిమేద్దామని ఎక్సైజ్‌ శాఖ మంత్రి శ్రీనివాస్‌గౌడ్‌ అన్నారు. గురురవారం జిల్లా కేంద్రంలోని జడ్పీ సమావేశ మందిరంలో తలసేమియా సికిల్‌ సెల్‌ సొసైటీ ఆధ్వర్యంలో గర్భిణులకు తలసేమియా ఉచిత హెచ్‌.బీ.ఏ-2 పరీక్షలపై ఏర్పాటు చేసిన శిక్షణ కార్యక్ర మానికి ఆయన ముఖ్య అతిధిగా హాజరయ్యారు. ఈ సం దర్భంగా ఆయన జ్యోతి ప్రజ్వలన చేసి శిక్షణ కార్యక్రమా న్ని ప్రారంభించారు. అనంతరం ఆయన మాట్లాడుతూ తలసేమియా లేని సమాజాన్ని ఏర్పాటు చేసేందుకు ప్రతీ కృషి చేయాలని, తలసేమియా వ్యాధి చికిత్స చాలా ఖర్చుతో కూడుకున్నదని, ఇప్పటివరకే జనరల్‌ ఆసు పత్రిలో తలసేమియా కేంద్రాన్ని ఏర్పాటు చేసి సేవలం దిస్తున్నామన్నారు. అంతేకాకుండా ప్రభుత్వం తరపున మందులు కూడా ఉచితంగానే అందజేస్తున్నామన్నారు. అయితే గర్భిణులకు చేసే హెచ్‌.బీ.ఏ-2 పరీక్షను కూడా ఉచితంగా చేయాలనే ఉద్దేశ్యంతో ఆరోగ్య కార్యకర్తలకు శిక్షణ ఇవ్వడం సంతోషకరమన్నారు. ప్రతీ ఒక్కరు తలసే మియాను నివారించేందుకు చైతన్యవంతులు కావాలని పిలపునిచ్చారు. ఈ కార్యక్రమంలో ముడా చైర్మన్‌ గంజి వెంకన్న, జిల్లా గ్రంథాలయ సంస్థ చైర్మన్‌ రాజేంశ్వర్‌గౌడ్‌, ఎస్పీ వెంకటేశ్వర్లు, అడిషనల్‌ కలెక్టర్‌ తేజాస్‌ నందలాల్‌ పవార్‌, జిల్లా వైద్య, ఆరోగ్య శాఖ అధికారి డా. కృష్ణ, జిల్లా వైద్య శిక్షణాధికారి డా. శశికాంత్‌, సికిల్‌ సెల్‌ సొసైటీ ప్రతినిధులు డా. చంద్రకాంత్‌, డా. సుమన్‌జైన్‌, డా. సరోజ, అలీబేగ్‌, వైద్యసిబ్బంది పాల్గొన్నారు.

Updated Date - 2023-01-12T23:31:53+05:30 IST

సంబంధం కోసం వెతుకుతున్నారా? తెలుగు మాట్రిమోని లో - రిజిస్ట్రేషన్ ఉచితం!
Advertising
Advertising