ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

మండలాన్ని అన్ని విధాలా అభివృద్ధి చేస్తా

ABN, First Publish Date - 2023-01-31T22:55:59+05:30

మండలాన్ని అన్ని విధా లా అభివృద్ధి చేస్తానని ఎమ్మెల్యే ఎస్‌ రాజేందర్‌రెడ్డి పేర్కొన్నారు.

మరికల్‌లో ‘మన ఊరు - మన బడి’ పనులకు భూమిపూజ చేస్తున్న ఎమ్మెల్యే ఎస్‌ రాజేందర్‌రెడ్డి
అన్నపూర్ణ మ్యారేజెస్... వరల్డ్ వైడ్‌గా తెలుగువారు ఎక్కడున్నా అన్ని కులముల వారికీ పెళ్లి సంబంధాలు కుదర్చడంలో టాప్ పొజిషన్. ఉన్నతమైన కుటుంబాల ఎంపిక. సం|| 9397 9797 50

- ఎమ్మెల్యే ఎస్‌ రాజేందర్‌రెడ్డి

- పలు అభివృద్ధి పనులకు శంకుస్థాపనలు

మరికల్‌, జనవరి 31 : మండలాన్ని అన్ని విధా లా అభివృద్ధి చేస్తానని ఎమ్మెల్యే ఎస్‌ రాజేందర్‌రెడ్డి పేర్కొన్నారు. మంగళవారం మరికల్‌లో పర్యటించి పలు అభివృద్ధి పనులకు శంకుస్థాపనలు, ప్రారంభో త్సవాలు చేశారు. ఈ సందర్భంగా ‘కంటి వెలుగు’ కార్యక్రమాన్ని ఎమ్మెల్యే పరిశీలించారు. బీసీ కమిటీ హాల్‌, ‘మన ఊరు - మన బడి’ పనులకు ఎమ్మెల్యే శంకుస్థాపన చేశారు. అనంతరం అంగన్‌వాడీ భవ నం సైన్స్‌ ల్యాబ్‌, ఎస్సీ కమిటీ హాల్‌ను ప్రారంభించి మాట్లాడారు. 60 ఏళ్లలో ఎలాంటి అభివృద్ధి జరగలే దని, పోరాడి తెచ్చుకున్న తెలంగాణాను అభివృద్ధి చేసేందుకు సీఎం కేసీఆర్‌ కంకణం కట్టుకున్నారన్నారు. ‘కంటి వెలుగు’ను మండల ప్రజలు సద్వినియో గం చేసుకోవాలని కోరారు. అంతకు ముందు సీఎం సహాయ నిధి నుంచి మంజూరైన ఎల్‌వోసీలను అందజేశారు. మండలంలోని రాకొండ విశ్వాస్‌కు రూ.30 వేలు, స్వాతికి రూ.60 వేలు, మణెమ్మకు రూ.28 వేలు, ఆదిత్యకు రూ.28 వేలు, మరికల్‌ చైత్రకు రూ.11 వేలు, మేఘనకు రూ.18 వేలు, ధన్వాడ పార్వతికి రూ.21,500, రేణెమ్మకు రూ.18 వేలు, సాయివినయ్‌కు రూ.60 వేలు, వెంకటప్పకు రూ.40 వేల విలువ చేసే చెక్కులను పం పిణీ చేశారు. కార్యక్రమంలో జడ్పీ వైస్‌ చైర్మన్‌ సురేఖ, ఎంపీపీ శ్రీకళ, ఎంపీడీవో యశోదమ్మ, వైస్‌ ఎంపీపీ రవి, ఎంపీటీసీ సభ్యురాలు సుజాత, శ్రీని వాస్‌, గోపాల్‌, మతిన్‌, వివిధ శాఖల అధికారులు, ప్రజాప్రతినిధులు పాల్గొన్నారు.

- ధన్వాడ : బీఆర్‌ఎస్‌ ప్రభుత్వ హయాంలో రాష్ట్రంలోని అన్ని గ్రామాలు అభివృద్ధి చెందుతున్నా యని ఎమ్మెల్యే ఎస్‌ రాజేందర్‌రెడ్డి పేర్కొన్నారు. ధన్వాడ మండలం రాంకిష్టాయ్యపల్లిలో నూతన గ్రా మ పంచాయతీ భవన నిర్మాణానికి శంకుస్థాపన, కిష్టాపూర్‌లోని ఉన్నత పాఠశాలలో అదనపు గది ప్రారంభోత్సవాలతో పాటు సీసీ రోడ్డు పనులకు ఎమ్మెల్యే భూమి పూజ చేసి, మాట్లాడారు. కార్యక్రమంలో సర్పంచ్‌లు మాధవరెడ్డి, చిట్టెం దామోదర్‌రెడ్డి, ఎంపీటీసీ సభ్యుడు కడపయ్య, టీఆర్‌ఎస్‌ నాయకులు చీరాల కొండారెడ్డి, సునిల్‌ రెడ్డి, భగవంత్‌రెడ్డి, గండి బాల్‌రాజు, ఎంపీడీవో సద్గుణ, ఎంపీఈవో సుదర్శన్‌, ఏఈ ప్రవీణ్‌కుమార్‌ పాల్గొన్నారు.

Updated Date - 2023-01-31T22:56:02+05:30 IST

సంబంధం కోసం వెతుకుతున్నారా? తెలుగు మాట్రిమోని లో - రిజిస్ట్రేషన్ ఉచితం!
Advertising
Advertising