రేపటి నుంచి పీఎం కప్ క్రికెట్ టోర్నీ
ABN, First Publish Date - 2023-01-14T00:20:15+05:30
ఆజాదీకా అమృత్ మహోత్సవ్‌లో భాగంగా ఈ నెల 15వ తేదీ పట్టణంలోని సోమనాద్రి ఫుట్‌బాల్ మినీ స్టేడియం(తేరు మైదానం) వేదికగా పీఎం కప్-2023 క్రికెట్ టోర్నమెంట్ నిర్వహించనున్నట్లు తెలంగాణ క్రికెట్ అసోసియేషన్ రాష్ట్ర ఆర్గనైజింగ్ సెక్రటరీ మురారి సోమశేఖర్ రెడ్డి తెలిపారు.
- పాల్గొననున్న శ్రీలంక, బంగ్లాదేశ్, నేపాల్ జట్లు
- ప్రారంభించనున్న బీజేపీ జాతీయ ఉపాధ్యక్షురాలు డీకే అరుణ
గద్వాల అర్బన్, జనవరి 13 : ఆజాదీకా అమృత్ మహోత్సవ్‌లో భాగంగా ఈ నెల 15వ తేదీ పట్టణంలోని సోమనాద్రి ఫుట్‌బాల్ మినీ స్టేడియం(తేరు మైదానం) వేదికగా పీఎం కప్-2023 క్రికెట్ టోర్నమెంట్ నిర్వహించనున్నట్లు తెలంగాణ క్రికెట్ అసోసియేషన్ రాష్ట్ర ఆర్గనైజింగ్ సెక్రటరీ మురారి సోమశేఖర్ రెడ్డి తెలిపారు. జిల్లా కేంద్రంలోని తేరుమైదానంలో శుక్రవారం ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో ఆయన మాట్లాడారు. నార్త్ అమెరికా తెలుగు అసోసియేషన్(నాటా) అడ్వయిజరీ చైర్మన్ డాక్టర్ ప్రేమ్‌రెడ్డి, డైరెక్టర్ మురారి వెంకటరమణారెడ్డిల సౌజన్యంతో ఈ నెల 15 నుంచి 22 వరకు టోర్నమెంట్ ఉంటుంద న్నారు. పోటీల్లో పాల్గొనేందుకు శ్రీలంక, బంగ్లాదేశ్, నేపాల్‌తో పాటు దేశంలోని ఉత్తరప్రదేష్, బీహార్, కర్ణాటక, రాజస్థాన్, పంజాబ్, పశ్చిమబెంగాల్, జమ్మూ,కాశ్మీర్, తదితర ప్రాంతాల నుంచి జట్లు పాల్గొంటాయన్నారు. పీఎం కప్ టోర్నమెంట్‌ను బీజేపీ జాతీయ ఉపాధ్యక్షురాలు, మాజీ మంత్రి డీకే అరుణ ప్రారంభిస్తారని తెలిపారు. సూపర్ నాకౌట్ పద్ధతిలో పోటీలను నిర్వహిస్తు న్నామని చెప్పారు. సమావేశంలో టీసీఏ జిల్లా ప్రధాన కార్యదర్శి డీటీడీసీ నరసింహా, ట్రెజరర్ శ్రీధర్, లీగల్ అడ్వయిజర్ నరేందర్‌రెడ్డి, ఉపాధ్యక్షుడు మురళి, సెక్రటరీలు అనీల్, కృష్ణ, కోచ్ జియా, జ్యూవెలరీ మెహమూద్, షుకూర్, పాషా, సీనియర్ క్రీడాకారులు దేవదాసు, శ్రీనివాసులు, ఢిల్లీవాలా కృష్ణ, నరసింహ గురుస్వామి, గోసాయి హరి పాల్గొన్నారు.
Updated Date - 2023-01-14T00:20:17+05:30 IST