ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

గ్రామీణ క్రీడలను ప్రోత్సహించాలి

ABN, First Publish Date - 2023-02-24T00:03:25+05:30

గ్రామీణ ప్రాంతాల ల్లో క్రీడా పోటీలను ప్రోత్సహించాల్సిన అవసరం ఎంతైనా ఉందని జడ్చర్ల ఎమ్యెల్యే డాక్టర్‌ సి. లక్ష్మారెడ్డి అన్నా రు.

బాలానగర్‌ : విజేతలకు బహుమతులు అందజేస్తున్న ఎమ్మెల్యే లక్ష్మారెడ్డి
అన్నపూర్ణ మ్యారేజెస్... వరల్డ్ వైడ్‌గా తెలుగువారు ఎక్కడున్నా అన్ని కులముల వారికీ పెళ్లి సంబంధాలు కుదర్చడంలో టాప్ పొజిషన్. ఉన్నతమైన కుటుంబాల ఎంపిక. సం|| 9397 9797 50

- జడ్చర్ల ఎమ్మెల్యే లక్ష్మారెడ్డి

బాలానగర్‌, ఫిబ్రవరి 23 : గ్రామీణ ప్రాంతాల ల్లో క్రీడా పోటీలను ప్రోత్సహించాల్సిన అవసరం ఎంతైనా ఉందని జడ్చర్ల ఎమ్యెల్యే డాక్టర్‌ సి. లక్ష్మారెడ్డి అన్నా రు. గురువారం మండల కేంద్రంలో నిర్వహించిన సేవాలాల్‌ ప్రీమియర్‌ లీగ్‌ క్రికెట్‌ టోర్నమెంట్‌లో విజేతలకు బహుమతులు అందజే శారు. ఆయన మాట్లాడుతూ ఇలాంటి పోటీలు నిర్వహించడం వలన నిరాదరణకు గురైన గ్రామ స్థాయి క్రీడాకారులు బయటికి వస్తారని అన్నారు. అనంతరం హేమాజిపూర్‌లోని శి వాలయంలో నిర్వహిస్తున్న విఘ్నేశ్వరస్వామి, కు మారస్వామి విగ్రహ ప్రతిష్ఠ కార్యక్రమంలో ఎమ్మెల్యే పాల్గొని ప్రత్యేక పూజలు చేశారు. వివిధ పూజల అనంతరం పూర్ణాహుతి కార్యక్రమాలు నిర్వహిం చారు. ఈ కార్యక్రమంలో గిరిజన కో-ఆపరేటీవ్‌ రాష్ట్ర చైర్మన్‌ వాల్యానాయక్‌, ఎంపీపీ కమల, సేవాలాల్‌ సేన జాతీయ అధ్యక్షుడు శ్రీని వాస్‌ నాయక్‌, ఎంపీటీసీ వెంకట్‌రామ్‌ నాయక్‌, ప్రకాష్‌నాయక్‌, క్రీడాకారులు, సర్పంచ్‌ నాయకు లు, భక్తులు పాల్గొన్నారు.

కాంగ్రెస్‌ పార్టీ ఆధ్వర్యంలో..

మండంలోని హేమాజిపూర్‌లో నూతనంగా ప్ర తిష్ఠిస్తున్న విఘ్నేశ్వరస్వామి, కుమారస్వామి విగ్ర హాల ప్రతిష్ఠ కార్యక్రమంలో జడ్చర్ల మాజీ ఎమ్మె ల్యే ఎర్రశేఖర్‌, టీపీసీసీ ప్రధాన కార్యదర్శి జనం పల్లి అనిరుధ్‌రెడ్డిలు వేర్వేరుగా పాల్గొని పూజలు చేశారు. ఈ కార్యక్రమంలో పూజారులు, నాయకులు, భక్తులు పాల్గొన్నారు.

ప్రతీ కార్యకర్తను గుర్తుంచుకుంటాం : ఎమ్మెల్యే

మిడ్జిల్‌ : పార్టీ కోసం పనిచేసిన ప్రతీ కార్యకర్తను తాము గుర్తుంచుకుంటామని ఎమ్మెల్యే సి. లక్ష్మారెడ్డి అన్నారు. కార్యకర్తలే పార్టీకి పట్టుకొమ్మలని, ఆపదలో ఉన్న పార్టీ కార్యకర్తలకు ఎల్లవేళల అండగా ఉంటామని ఆయన స్పష్టం చేశారు. గురువారం మండల కేంద్రంలోని ఓ పాత్రికేయుని కుమార్తె శారీ ఫంక్షన్‌లో పాల్గొని చిన్నారిని ఆశీర్వదించారు. మండలంలోని వల్లభురావుపల్లి, కంచనపల్లి, మిడ్జిల్‌ గ్రామాలలోని ఇటీవల మృతి చెందిన వారి కుటుంబసభ్యులను పరామర్శించి ఆర్ధిక సహాయం అందజేశారు. ఈ కార్యక్రమంలో జడ్పీవైస్‌ ఛైర్మన్‌ యాదయ్య, జడ్పీటీసీ శశిరేఖబాలు, పీఏసీఎస్‌ ఛైర్మన్‌ శ్రీనివాస్‌రెడ్డి, మార్కెట్‌ కమిటి మాజీ ఛైర్మన్‌ శ్యాంసుందర్‌రెడ్డి, ఎంపీటీసీ సుదర్శన్‌, నాయకులు బాల్‌రెడ్డి, సత్యనారాయణగుప్తా, నవీన్‌చారి, లాలుఉన్నారు.

Updated Date - 2023-02-24T00:03:27+05:30 IST

సంబంధం కోసం వెతుకుతున్నారా? తెలుగు మాట్రిమోని లో - రిజిస్ట్రేషన్ ఉచితం!
Advertising
Advertising