సంబురంగా ఉగాది
ABN, First Publish Date - 2023-03-22T23:10:38+05:30
శోభకృత్ నామ సంవత్సర ఉగాది వేడుకలను ఉమ్మడి జిల్లా వ్యాప్తంగా ప్రజలు బుధవారం ఘనంగా జరుపుకున్నారు.
శోభకృత్ నామ సంవత్సర ఉగాది వేడుకలను ఉమ్మడి జిల్లా వ్యాప్తంగా ప్రజలు బుధవారం ఘనంగా జరుపుకున్నారు. ఆలయాల్లో ప్రత్యేక పూజలు చేశారు. ఈ పండుగ ప్రత్యేక వంటకం షడ్రుచుల పచ్చడి చేసుకొని ఆరగించారు. భక్షాలు చేసుకుని తిన్నారు. పశువులకు స్నానం చేయించి, వాటిని అలంకరించారు. నారాయణపేట, గద్వాల జిల్లాల్లో రైతులు పొలాలకు వెళ్లి, భూమికి పూజలు చేసి దుక్కి దున్నారు. సాయంత్రం పంచాంగ శ్రవణం కార్యక్రమాలు నిర్వహించారు.
- ఆంధ్రజ్యోతి, నెట్‌వర్క్
Updated Date - 2023-03-22T23:10:38+05:30 IST