ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

తెలంగాణ ఏర్పాటు తర్వాత గణనీయమైన అభివృద్ధి

ABN, First Publish Date - 2023-06-02T23:50:40+05:30

ప్రత్యేక రాష్ట్ర ఏర్పాటు తర్వాత తెలంగాణ గణనీయమైన అభివృద్ధి సాధించిందని తెలంగాణ మహిళ కమిషన్‌ చైర్‌పర్సన్‌ సునితాలక్ష్మారెడ్డి అన్నారు.

జాతీయ జెండాను ఆవిష్కరించి, వందనం చేస్తున్న సునితాలక్ష్మారెడ్డి, ఎమ్మెల్యేలు, అధికారులు, ప్రజాప్రతినిధులు
అన్నపూర్ణ మ్యారేజెస్... వరల్డ్ వైడ్‌గా తెలుగువారు ఎక్కడున్నా అన్ని కులముల వారికీ పెళ్లి సంబంధాలు కుదర్చడంలో టాప్ పొజిషన్. ఉన్నతమైన కుటుంబాల ఎంపిక. సం|| 9397 9797 50

- ప్రజా సంక్షేమంలోనూ యావత్‌ దేశానికి ఆదర్శం

- తెలంగాణ మహిళ కమిషన్‌ చైర్‌పర్సన్‌ సునితా లక్ష్మారెడ్డి

- ఘనంగా ప్రారంభమైన తెలంగాణ ద శాబ్ది ఉత్సవాలు

- అమరుల స్థూపానికి ఘన నివాళులు

- జాతీయ పతాకం ఆవిష్కరణ

- హాజరైన ఎమ్మెల్యేలు, ప్రజాప్రతినిధులు, అధికారులు

నారాయణపేట టౌన్‌, జూన్‌ 2 : ప్రత్యేక రాష్ట్ర ఏర్పాటు తర్వాత తెలంగాణ గణనీయమైన అభివృద్ధి సాధించిందని తెలంగాణ మహిళ కమిషన్‌ చైర్‌పర్సన్‌ సునితాలక్ష్మారెడ్డి అన్నారు. జిల్లా కేంద్రంలో శుక్రవారం నిర్వహించిన రాష్ట్ర అవతరణ దశాబ్ది ఉత్సవాలకు ఆమె ముఖ్య అతిథిగా హాజరయ్యారు. ముందుగా అమరుల స్థూపానికి మహిళ కమిషన్‌ చైర్‌ పర్సన్‌ సునితాలక్ష్మారెడ్డితో పాటు జడ్పీ చైర్‌పర్సన్‌ వనజ, ఎమ్మెల్యేలు ఎస్‌ఆర్‌ రెడ్డి, రామ్మోహన్‌రెడ్డి, కలెక్టర్‌ శ్రీహర్ష, అదనపు కలెక్టర్‌ మయాంక్‌ మిత్తల్‌, ఎస్పీ వెంకటేశ్వర్లు నివాళ్లు అర్పించారు. జాతీయ పతాకాన్ని ఆవిష్కరించి, పోలీసుల వందనాన్ని స్వీకరించారు. అనంతరం తొమ్మిదేళ్లలో జరిగిన అభివృద్ధిపై తెలంగాణ మహిళ కమిషన్‌ చైర్‌పర్సన్‌ సునితాలక్ష్మారెడ్డి ప్రసంగిస్తూ జిల్లా ప్రజలకు, అక్కడికి చేరుకున్న వారికి శుభాకాంక్షలు తెలిపారు. సీఎం కేసీఆర్‌ సాఽరథ్యంలో రాష్ట్రం ఈ తొమ్మిదేళ్ల స్వల్పకాలంలోనే ప్రగతిశీల రాష్ట్రంగా రూపుదిద్దుకుందని, ప్రజా సంక్షేమంలోనూ, అభివృద్ధి లోనూ యావత్‌ దేశానికి ఆదర్శంగా నిలిచిందన్నారు. సంక్షోభ సమయంలో సమర్థవంతమైన ఆర్థిక నిర్వహణ చేస్తూ ప్రజా సంక్షేమ పథకాలను భారీ ఎత్తున అమలు చేయడం తెలంగాణ ప్రభుత్వానికే సాధ్యమైందన్నారు. నారాయణపేట జిల్లా చేనేత వస్త్రాలకు ప్రసిద్ధి చెందిందని, జిల్లా కేంద్రంగా ఏర్పడిందని మా ప్రభుత్వం ప్రజల సంక్షేమం కోసం అనేక పథకాలు, కార్యక్రమాలను రూపొందించి వాటిని అమలు చేస్తోందన్నారు. రాష్ట్రం ఏర్పడ్డాక ప్రధాన రంగాల్లోనూ, ఉప రంగాల్లోనూ గణనీయమైన వృద్ధి రేటు సాధిస్తోందన్నారు. వ్యవసాయం దాని అనుబంధ రంగాల్లో వచ్చిన అభివృద్ధితో మత్స్య సంపద, పశుసంపద భారీగా పెరిగిందని, చేపల ఉత్పత్తి ప్రతికూల వృద్ధిరేటు నుంచి రెండంకెల వృద్ధి రేటుకు చేరుకుందన్నారు. రాష్ట్రం చేపట్టిన నీటి పారుదల ప్రాజెక్టుల వల్ల సాధ్యమైందని ఇదేవిధంగా ద్వితీయ, తృతీయ రంగాల్లోని ఐటీ, వాణిజ్యం, విద్యుత్‌ తదితర సేవారంగాల్లో అధిక వృద్ధిరేటు నమోదవుతోం దన్నారు. ప్రపంచ వ్యాప్తంగా ఆర్థిక మాంద్యం ఏర్పడ్డాక దాని ప్రభావం తెలంగాణ రాష్ట్రంపై అంతగా లేదని, వినియోగంతో పాటు అన్నిరంగాల్లో పెట్టుబడులు పెరగడం వల్లనే ఇది సాధ్య మవుతుందన్నారు.

Updated Date - 2023-06-02T23:50:40+05:30 IST

సంబంధం కోసం వెతుకుతున్నారా? తెలుగు మాట్రిమోని లో - రిజిస్ట్రేషన్ ఉచితం!
Advertising
Advertising