దేశం నలుమూలల తెలంగాణ ఖ్యాతి
ABN, First Publish Date - 2023-04-26T00:19:44+05:30
దేశంలో ఏ రాష్ట్రంలో లేని సంక్షేమపథకాలు తెలంగాణలో ప్రవేశపెట్టి దే శానికి దిక్సూచిగా మన రాష్ట్రం నిలిచిందని ప్రభు త్వ విప్, ఎమ్మెల్యే డాక్టర్ గువ్వల బాలరాజు అన్నా రు.
- దేశ భవిష్యత్తు కేసీఆర్‌తోనే సాధ్యం
- ఊరూరా గులాబీ జెండా
- నియోజకవర్గ ప్రతినిధుల సభలో ప్రభుత్వ విప్ గువ్వల బాలరాజు
అచ్చంపేట, ఏప్రిల్ 25: దేశంలో ఏ రాష్ట్రంలో లేని సంక్షేమపథకాలు తెలంగాణలో ప్రవేశపెట్టి దే శానికి దిక్సూచిగా మన రాష్ట్రం నిలిచిందని ప్రభు త్వ విప్, ఎమ్మెల్యే డాక్టర్ గువ్వల బాలరాజు అన్నా రు. బీఆర్‌ఎస్ పార్టీ ఆవిర్భావ దినోత్సవం సంద ర్భంగా అచ్చంపేట మండల పరిధిలోని చెన్నారం గ్రామసమీపంలోని జిన్నింగ్ మిల్లు ప్రాంగణంలో ఏర్పాటు చేసిన నియోజకవర్గ ప్రతినిధుల సమావే శాన్ని నిర్వహించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ కష్టపడి సాధించుకున్న తెలంగాణ లో ముఖ్యమంత్రి కేసీఆర్ అందిస్తున్న సంక్షేమ పథకాలతో రాష్ట్ర ప్రజలు సుఖంగా జీవిస్తున్నార న్నారు. తెలంగాణ పథకాలు దేశ వ్యాప్తంగా అమ లు కావాలంటే కేసీఆర్ సారధ్యంలోనే ముందుకు సాగాలన్నారు. దేశ భవిష్యత్తు కేసీఆర్‌తోనే సాధ్య మన్నారు. కేసీఆర్ సచ్చుడో తెలంగాణ వచ్చుడో నినాదంతో ముందుకు వెళ్లి రాష్ట్రాన్ని సాధించి నేడు సంక్షేమపాలన అభివృద్ధి బాటలో ముందుకు సాగుతున్నామన్నారు. ముఖ్యమంత్రి మంచి ఆలోచన ద్వారానే అత్మీయ సమ్మేళనాలు జరు పుకుంటూ మనమందరం కలుసుకునే అవకాశం దొరకడం సంతోషకరమన్నారు. నా భారతదేశ ప్రజలందరూ బాగుండాలనే ఉద్దేశంతోనే దేశ రాజకీయాల్లోకి కేసీఆర్ వెళ్లారన్నారు. పార్టీ కోసం కష్టపడి పనిచేస్తున్న నా అన్నదమ్ముళ్లకు, అక్క చెళ్లలకు రుణపడి ఉంటామన్నారు. రైతన్నల కష్టాలు చూడలేకే శ్రీలక్ష్మీచెన్నకేశవ, శ్రీఉమామ హేశ్వర రిజర్వాయర్‌లతో పాటు రా బోవు రోజుల్లో నియోజకవర్గంలో ఎన్నో అభివృద్ధి కార్యక్రమాలు చేపడుతున్నట్లు తెలిపారు. ఎవరెన్ని కుట్రలు చేసినా తెలంగాణలో రాబోయేది బీఆర్‌ఎస్ పార్టీనే నన్నారు. అచ్చంపేటను అన్నివిధా ల అభివృద్ధి చేసేందుకు నిరంతరం ప్రజల్లో ఉం టూ వారి కష్టాలు తెలుసుకుంటూ సమస్యలు పరి ష్కరిస్తున్నామన్నారు. అనంతరం జీబీఆర్ ట్రస్ట్ చైర్మన్ గువ్వల అమల మాట్లాడారు. సమావేశంలో రైతుసమన్వయ సమితి జిల్లా అధ్యక్షుడు మనో హర్, మునిసిపల్ చైర్మన్ నర్శింహ గౌడ్, ఎంపీపీ శాంతాబాయిలోక్యానాయక్, వ్యవసాయ మార్కెట్ చైర్మన్ అరుణ, పార్టీ మండల అధ్యక్షుడు పర్వతా లు, నాయకులు రాజేశ్వర్ రెడ్డి, ప్రతాప్ రెడ్డి, నా యకులు, కార్యకర్తలు పాల్గొన్నారు.
Updated Date - 2023-04-26T00:19:44+05:30 IST