కురుమూర్తి జాతరకు టెండర్లు
ABN, First Publish Date - 2023-09-06T23:08:00+05:30
మహబూబ్‌నగర్ జిల్లా చిన్నచింతకుంట మండలం అమ్మాపురం గ్రామ సమీపంలోని కురుమూర్తి జాతరకు టెండర్ల ప్రక్రియ ప్రారంభమైంది.
చిన్నచింతకుంట, సెప్టెంబరు 6 : మహబూబ్‌నగర్ జిల్లా చిన్నచింతకుంట మండలం అమ్మాపురం గ్రామ సమీపంలోని కురుమూర్తి జాతరకు టెండర్ల ప్రక్రియ ప్రారంభమైంది. వేంకటేశ్వర స్వామి వారి జాతర బ్రహ్మోత్సవాలు త్వరలో ప్రారంభం కానున్న నేపథ్యంలో జాతరకు సంబంధించి బుధవారం జాతర మైదానంలోని అన్నదాన సత్రంలో ఆలయ చైర్మన్ ప్రతాప్‌రెడ్డి, ఈవో మదనేశ్వర్‌రెడ్డి, ఇన్‌స్పెక్టర్ వాసు, పాలకవర్గ సభ్యుల నేతృత్వంలో బహిరంగ టెండర్లను నిర్వహించారు. జాతరలో కొబ్బరికాయల విక్రయానికి రూ.53 లక్ష ల 10 వేలు ప్రస్తుతం పలకగా, గత ఏడాది రూ.51 లక్షల 23వేలు పలికింది. లడ్డూ, పులిహోర విక్రయానికి రూ.42 లక్షల 95 వేలు, గత ఏడాది రూ.40 లక్షల 3 వేలు, విద్యుత్ వాడకానికి సంబంధించి రూ.8 లక్షల 55వే లు పలకగా, గత ఏడాది రూ.7 లక్షల 25 వేలు పలికింది. అయితే తలనీలాల టెండర్ల ప్రక్రియ వాయిదా పడింది. కార్యక్రమంలో ఆలయ పాలకవర్గం సభ్యులు శ్రీనివాస్‌రెడ్డి, శంకర్‌యాదవ్, నూకల శంకర్, నాగరాజు తదితరులున్నారు.
Updated Date - 2023-09-06T23:08:00+05:30 IST