గ్రామాలు, పట్టణాల అభివృద్ధే లక్ష్యం
ABN, First Publish Date - 2023-07-07T23:37:28+05:30
అలంపూర్ నియోజకవర్గం అభివృద్ధి పథంలో ముందుకు సాగుతోం దని అలంపూరు ఎమ్మెల్యే డాక్టర్ అబ్రహాం అన్నారు.
- అలంపూర్ ఎమ్మెల్యే డాక్టర్ అబ్రహాం
- సీసీ రోడ్డు నిర్మాణ పనులు ప్రారంభం
ఇటిక్యాల/ రాజోలి, జూలై 7 : అలంపూర్ నియోజకవర్గం అభివృద్ధి పథంలో ముందుకు సాగుతోం దని అలంపూరు ఎమ్మెల్యే డాక్టర్ అబ్రహాం అన్నారు. ఇటిక్యాల మండలంలోని బట్లదిన్నె, రాజోలి మండ లంలోని నసనూరు గ్రామాల్లో సీసీ రోడ్ల నిర్మాణానికి శుక్రవారం ఆయన భూమిపూజ చేసి పనులను ప్రారంభించారు. బట్లదిన్నెలో రూ.15 లక్షల వ్యయం తో నిర్మించనున్న సీసీ రోడ్డు పనులను ఆయన ప్రారంభించారు. అనంతరం నిర్వహించిన సమావే శంలో మాట్లాడుతూ గ్రామాలతో పాటు పట్టణాలను ఆదర్శవంతంగా అభివృద్ధి చేయడమే ముఖ్యమంత్రి కేసీఆర్ లక్ష్యమన్నారు. మారుమూల గ్రామాల్లో సైతం ప్రజల అవసరాలను గుర్తించే పనులు చేపట్టినట్లు తెలిపారు. నియోజకవర్గంలోని ప్రతీ గ్రామంలో అంతర్గత రహదారులను ఏర్పాటు చేసినట్లు చెప్పారు. బట్లదిన్నె గ్రామంలో ఇప్పటివరకు రూ. 60 లక్షల విలువైన అభివృద్ధి పనులను చేసినట్లు తెలిపారు. కార్యక్రమంలో సర్పంచు ఎస్తేరమ్మ, ఎంపీటీసీ సభ్యుడు తిరుపతిరెడ్డి, ఉపసర్పంచు పరమేష్‌గౌడ్, మల్లికార్జున్‌రెడ్డి, సత్యారెడ్డి, చాగాపురం వెంకటన్న, సుంకన్న, శాలిబాషా, దాసు పాల్గొన్నారు.
పల్లెల అభివృద్ధికి కృషి
పల్లెల అభివృద్ధే లక్ష్యంగా కృషి చేస్తున్నామని అలంపూర్ ఎమ్మెల్యే డాక్టర్ వీఎం అబ్రహాం అన్నారు. మండలంలోని నసనూర్ గ్రామంలో ఐదు లక్షల రూపాయల వ్యయంతో నిర్మించనున్న సీసీ రోడ్డు పనులను శుక్రవారం ఆయన ప్రారంభించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ తెలంగాణ ఆవిర్భావం తర్వాత ప్రజలకు అనేక సంక్షేమ పథకాలను అమలు చేస్తున్నామని తెలిపారు. రానున్న రోజుల్లో బీఆర్‌ఎస్ పార్టీని ఆదరించాలని కోరారు. అనంతరం గ్రామస్థులు ఆయనను ఘనంగా సన్మానించారు. కార్యక్రమంలో ఆర్డీఎస్ ఆయకట్టు దారుల సంఘం మాజీ చైర్మర్ తనగల సీతారామిరెడ్డి, వైస్ ఎంపీపీ రేణుక, సర్పంచు ఎల్లమ్మ, మార్కెట్ కమిటీ వైస్ చైర్మన్ రఘునందన్‌రెడ్డి, బీఆర్‌ఎస్ నాయకుడు మూగన్న పాల్గొన్నారు.
Updated Date - 2023-07-07T23:37:28+05:30 IST