ప్రతిపక్షాలవి పిట్టలదొర మాటలు
ABN, First Publish Date - 2023-06-03T23:12:42+05:30
ప్రతిపక్షాల మాటలు గ్రామాల్లో తిరిగే పిట్టలదొర మాటల వలే ఉంటున్నాయని, సీఎం కేసీఆర్ రాష్ట్ర అభివృద్ధిని చేతలలో చేసి చూపిస్తు న్నారని ఎమ్మెల్యే అబ్రహాం అన్నారు.
- అభివృద్ధిని చేతలలో చూపిస్తున్న సీఎం కేసీఆర్
- అలంపూర్ ఎమ్మెల్యే డా.వీఎం, అబ్రహాం
ఉండవల్లి, జూన్ 3 : ప్రతిపక్షాల మాటలు గ్రామాల్లో తిరిగే పిట్టలదొర మాటల వలే ఉంటున్నాయని, సీఎం కేసీఆర్ రాష్ట్ర అభివృద్ధిని చేతలలో చేసి చూపిస్తు న్నారని ఎమ్మెల్యే అబ్రహాం అన్నారు. మండల పరిధి లోని బైరాపురం గ్రామంలో ఉన్న వాగుపై హైలెవెల్ బ్రిడ్జి నిర్మాణానికి శనివారం ఆయన భూమిపూజ చేశా రు. ఈ సందర్భంగా ఎమ్మెల్యే మాట్లాడుతూ దశాబ్దాల కాలం నుంచి గ్రామంలో ఉన్న వాగు వల్ల కలుగుతున్న ఇబ్బందులను సీఎం కేసీఆర్ దృష్టికి తీసుకెళ్లడంతో బ్రిడ్జి నిర్మాణానికి రూ.కోటి 50లక్షలు మంజూరయ్యా యని అన్నారు. బ్రిడ్జి నిర్మాణం దక్కించుకున్న సం బంధిత కాంట్రాక్టర్ నాణ్యతా ప్రమాణాలకు అనుగు ణంగా బ్రిడ్జి నిర్మించాలని అన్నారు. అలాగే గ్రామంలో ని అంతర్గత రోడ్ల నిర్మాణానికి కూడా నిధులు మంజూ రయ్యాయని తెలిపారు. గ్రామాభివృద్ధికి కలసికట్టుగా పని చేయాలని కోరారు. కార్యక్రమంలో బీఆర్‌ఎస్ రాష్ట్ర యువజన నాయకుడు డా.అజయ్, వైస్ ఎంపీపీ దేవన్న, సర్పంచుల సంఘం మండల అధ్యక్షుడు సుర వరం లోకేశ్వర్‌రెడ్డి, బీఆర్‌ఎస్ మండల అధ్యక్షుడు రమణ, ఉప సర్పంచు రమేష్, కోఆప్షన్ మెంబరు చిన్న బాషుమియ్య, నాయకులు భాస్కర్, కృష్ణగౌడు, లింగా రెడ్డి, ప్రసాద్, మద్దిలేటి పాల్గొన్నారు.
Updated Date - 2023-06-03T23:12:42+05:30 IST